అన్వేషించండి

Satyabhama Serial August 12th: సత్యభామ సీరియల్: అత్తాకోడళ్ల సవాల్, సత్యకు అగ్నిపరీక్ష.. బోనం ఎత్తడంలో సక్సెస్ అవుతుందా! 

Satyabhama Today Episode సత్య తన మీద పడ్డ నిందని నిరూపించుకోవడానికి ఏ ఆటంకం లేకుండా బోనం ఎత్తాలని భైరవి కండీషన్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode అందరూ తనని దోషిలా చూస్తున్నారు అని ఇలాంటి టైంలో మనం విడిపోతే తన మీద పడిన నింద నిజం అవుతుందని సత్య క్రిష్‌తో అంటుంది. నువ్వే కన్ఫ్యూజన్‌లో ఉన్నావని నీ జోలికి నేను రాకూడదని అనుకుంటున్నావ్ కదా అని అంటుంది. దానికి క్రిష్ నువ్వు నా వెంట పడొద్దని అంటాడు.

సత్య: నేను నీ మీద మోజుతో నీ వెంట పడటం లేదు. నీ దగ్గర నేను కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాలన్న ఆలోచనతో అలా చేస్తున్నాను. ముఖాలు మాడ్చుకొని విడిపోవడం కంటే సంతోషంగా విడిపోవాలని ఇలా చేస్తున్నా. నా మీద పడిన నింద చెరిపేసుకొని గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్లాలి అనుకుంటున్నా. 
క్రిష్: కలిసి జీవితాంతం బతకలేనప్పుడు ఎందుకు ఈ ఆరాటం. ఒకప్పుడు నువ్వు కూడా నన్ను నమ్మలేదు కానీ నోరు మూసుకొని పడున్నానా లేదా. నమ్మకంతో నీ దగ్గర పడున్న నన్నే నువ్వు నమ్మలేదు అంటే బాధగా అనిపించదా. నా మీద నాకే అసహ్యం రాదా అది తప్పా. నేనేమీ విడిపోవాలని ఆరాటపడటం లేదు నీతో కలిసి ఉండలేకపోతున్నా అని బాధ పడుతున్నా.
భైరవి: (ఉదయం సత్య పూజ చేయడానికి పువ్వులు పట్టుకొని దేవుడి గదిలోకి వెళ్తుంటే భైరవి ఆపుతుంది. పూల పళ్లెం విసిరి కొడుతుంది.) అంతా నీ ఇష్టమేనా నన్ను అడిగే పని లేదా. ఈ ఇంటిని అపవిత్రం చేశావ్ కనీసం పూజ గదినైనా పవిత్రంగా ఉంచుకోనివ్వు.  
సత్య: అత్తయ్య పెళ్లి అయిన దగ్గర నుంచి నేనే కదా రోజూ నిత్య పూజ చేస్తున్నాను. ఈ రోజు ఎందుకు అడ్డు పడుతున్నారు.
భైరవి: అడ్డు పడటం నా తప్పు కాదు పూజ చేసే అర్హత కోల్పోవడం నీ తప్పు. నిజం తెలియక ఇన్ని రోజులు నీతో పూజ చేయించా ఇప్పుడైనా తప్పు దిద్దుకోనివ్వు. రేపు ఒకసారి పంతులుకి పిలవయ్యా పూజ గది శుద్ధి చేయిద్దాం. మనం కూడా కాశీకి పోదాం.
జయమ్మ: భైరవి హద్దు దాటి మాట్లాడుతున్నావ్. నువ్వేమో పూజ గదికి రావొద్దన్నావ్, నా కొడుకేమో డైనింగ్ టేబుల్ దగ్గరకు రావొద్దన్నాడు రేపు ఇంకెవరూ గది దాటి బయటకు రావొద్దని అంటారు ఏంటిరా ఈ తమాషా. జాలి పడి నేను సత్యని ఇంట్లో నుంచి వెళ్లనివ్వకుండా ఆపలేదు. తన నిజాయితీ తెలిసి ఆపాను. తనకు ఎవరు ఏం హద్దులు పెట్టినా నేను ఒప్పుకోను.
భైరవి: రాముంతటి వాడే సీతని అగ్నిపరీక్షకి నిల్చొపెట్టాడు.
జయమ్మ: అంటే ఏంటే సీతలా సత్యకి అగ్నిపరీక్ష పెట్టాలి అనుకుంటున్నావా చెప్పేది సూటిగా చెప్పు.
భైరవి: ఏదో ఒక తీరున తనని తన పవిత్రని నిరూపించుకోమనండి. 
క్రిష్: ఏదో ఒక తీరున అంటే.
భైరవి: రేపు మన ఆచారం ప్రకారం బోనం సమర్పించుకోవాలి. బోనాలెత్తే మనషికి ఎలాంటి కలకం ఉన్నా తప్పు చేసినా అమ్మవారు బోనం ఎత్తనివ్వదు అడ్డుపడుతుంది.. తను ఏ తప్పు చేయలేదు అని అమ్మవారి మీద ప్రమాణం చేసి నీ పెళ్లాం రేపు బోనం ఎత్తాలి. అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి.

క్రిష్, జయమ్మ ఇద్దరూ ఒకేసారి అది కుదరదు అని అరుస్తారు. తప్పు బయట పడుతుందని ఒప్పుకోవడం లేదని మహదేవయ్య అంటాడు. నింద చెరుపుకోవాలి అంటే చేయాలి అంటాడు.

క్రిష్: సత్య బోనం ఎత్తుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ అదేదో నింద చెరుపుకోవడానికి అగ్నిపరీక్ష అన్నట్లు చేయడానికి నేను ఒప్పుకోను. 
జయమ్మ: అది సత్యకు అవమానం. 
మహదేవయ్య: భైరవి నేను ముందు నుంచి చెప్తున్నా మా అమ్మ మాటే ఫైనల్ తను ఎలా చెప్తే అలాగే సత్య బోనం ఎత్తుకోలేకపోతే అమ్మ ఫీలవుతుంది అది నేను చూడలేను. సత్య బోనం ఎత్తదు పోయి ఎవరి పని వాళ్లు చూసుకోండి.
సత్య: నేను బోనం ఎత్తుకుంటా. 
క్రిష్: సత్య నువ్వు మాట్లాడు కానీ బోనం ఎత్తడానికి వీళ్లేదు.
సత్య: నాకు క్లారిటీ ఉంది నేను బోనం ఎత్తుతా కానీ నాది ఓ ప్రశ్న నేను బోనం ఎత్తి నా నిజాయితీ నిరూపించుకున్న తర్వాత ఎవరూ ఆ కిడ్నాప్ గురించి మాట్లాడకూడదు సరేనా. 
రుద్ర: ముందు అమ్మ చెప్పినట్లు చేయ్ తర్వాత అవి మాట్లాడు కుందాం.

విశాలాక్షి ఇంట్లో వాళ్లకి భైరవి కాల్ చేసిందని చెప్తుంది. బోనం ఎత్తడానికి పిలుస్తున్నారని చెప్తుంది. నందిని రాను అని అంటుంది. పుట్టింటి వాళ్లకి నా మీద ఇష్టం లేదని నేను రాను అంటుంది. ఇక నువ్వు రాకపోతే అత్తింటి వాళ్లే ఆపేశారని అంటారని విశాలాక్షి, విశ్వనాథం నందినిని ఒప్పిస్తారు. సత్య దగ్గరకు క్రిష్ వెళ్లి అమ్మ పెట్టిన కండీషన్‌కి ఎందుకు ఒప్పుకున్నావని కోప్పడతాడు. ఎప్పుడూ న్యాయం గెలవాలి అని లేదు అని కొన్ని సార్లు అన్యాయం ముందుంటుందని కొత్త సమస్యలు ఎందుకుని క్రిష్ అంటాడు. దానికి సత్య అత్తయ్య మనసు గెలుస్తానని నిజాయితీ నిరూపించుకుంటానని అంటుంది. ఇప్పుడు నేను నిరూపించుకోకపోతే ఎందుకు అని రెండు నెలల్లో ఇంటి నుంచి వెళ్లిపోతావ్ నీకు ఎందుకని అడుగుతాడు. దానికి సత్య రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చని అంటుంది. ఇక రేపు బోనం ఎత్తుతానని సత్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తన మీద ఒట్టుపెట్టుకొని విద్యాదేవిని ఆపేసిన మహాలక్ష్మీ.. ఇదేం ట్విస్ట్‌రా బాబు.. సుమతి నుంచి మహాకు లెటర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget