అన్వేషించండి

Seethe Ramudi Katnam August 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తన మీద ఒట్టుపెట్టుకొని విద్యాదేవిని ఆపేసిన మహాలక్ష్మీ.. ఇదేం ట్విస్ట్‌రా బాబు.. సుమతి నుంచి మహాకు లెటర్!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవిని ఇంటి నుంచి వెళ్లనివ్వొద్దని మహాలక్ష్మీకి సుమతి నుంచి లెటర్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి వెళ్లిపోతుంటే ప్రీతి పట్టుకొని హగ్ చేసుకుంటుంది. విద్యాదేవి ప్రీతిని జాగ్రత్తగా ఉండమని, చెడు స్నేహాలు వద్దని తల్లిదండ్రుల పేరు నిలబెట్టమని చెప్తుంది. తన తల్లి వచ్చే వరకు అయినా మీరు ఉంటారనుకున్నా టీచర్ అని ప్రీతి అంటుంది. నాకు ఉండాలనే ఉంది కానీ తప్పదని విద్యాదేవి అంటుంది. విద్యాదేవి ఏడుస్తూ ఇంటి నుంచి బయల్దేరుతుంది. 

విద్యాదేవి: నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరగాలి రేవతి నువ్వు సంతోషంగా ఉండాలి.
రేవతి: మా పెళ్లి అయిన వరకు మీరు ఉండాలి టీచర్.
విద్యాదేవి: సీతారామ్‌లు మీ పెళ్లి జరిపిస్తారు రేవతి. నేను ఎక్కడున్నా నేను వస్తాను.
చలపతి: మిమల్ని చూస్తుంటే సుమతి అక్క గుర్తొస్తుంది టీచర్.. సుమతి అక్క లేని లోటు తీర్చారు.
విద్యాదేవి: మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు చలపతి గారు మీరు ఎప్పుడూ సీతకు సపోర్ట్‌గా ఉండండి. మహాలక్ష్మీ గారు ఎక్కడ.
అర్చన: మీరు ఈ పరిస్థితిలో వెళ్లడం మహాకు ఇష్టం లేదు అందుకే రాలేదు. 
సీత: ఏదో ఒకటి చేసి టీచర్ వెళ్లకుండా ఆపు దేవుడా.
మహాలక్ష్మీ: విద్యాదేవి సుమతి నేమ్ బోర్డ్ చూసి ఎమోషనల్ అవుతుంటే.. మహా అప్పుడే వచ్చి ఆగండి విద్యాదేవి గారు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు మా ఇంట్లోనే ఉండండి. నైట్ అంతా ఆలోచించా విద్యాదేవి గారు వెళ్లడం కరెక్ట్ కాదు అనిపించింది.
గిరిధర్: కానీ ఆవిడ మన ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు.
మహాలక్ష్మీ: ఎవరు ఏమనుకుంటే మనకెందుకు జనా ఎలాంటి వాడో మనకి తెలుసు. 
జనార్థన్: బయటి వాళ్లకి మన మీద నమ్మకం లేదు కదా మహా.
మహాలక్ష్మీ: బయట వాళ్లు ఏమనుకుంటే మనకెందుకు ఇప్పుడు విద్యాదేవిని పంపించేస్తే వాళ్ల అనుమానాల్ని నిజం చేసినట్లు అవుతుంది. మీ ఇద్దర్ని అవమానించినట్లు అవుతుంది. విద్యాదేవి వల్ల మనకు మంచే జరిగింది కానీ చెడు జరగలేదు. విద్యాదేవి గారు మనింట్లో ఉండి తీరాల్సిందే.
రామ్: థ్యాంక్స్ పిన్ని టీచర్ గారి గురించి చాలా బాగా ఆలోచించారు. 
విద్యాదేవి: నన్ను వెళ్లనివ్వండి.
సీత: లేదు టీచర్ మీరు ఇక్కడే ఉండండి.
రామ్: ఏ సమస్య వచ్చినా మేం చూసుకుంటాం ఉండండి టీచర్.
ప్రీతి: మీరు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది.
మహాలక్ష్మీ: ఉండండి టీచర్ మీరు ఉంటే పిల్లలు సంతోషపడతారు. విద్యాదేవి గారు మీరు మా ఇంట్లోనే ఉండాలి. వెళ్తాను అంటే నా మీద ఒట్టే. 

రామ్, ప్రీతిలు విద్యాదేవిని లోపలికి తీసుకెళ్తారు. ఇక అర్చన ఆఖరి నిమిషంలో ఎందుకు ఆపాల్సి వచ్చిందని మహాని నిలదీస్తుంది. అంతా ప్లాన్ ప్రకారం చేస్తే ఇలా చేశావ్ నిన్ను కొట్టాలని అనిపిస్తుందని ఎందుకు అలా ప్రవర్తించావని అడుగుతుంది. దానికి మహా ఇందాక తనకు కొరియర్‌లో ఓ లెటర్ వచ్చిందని అదే అంతా తారుమారు చేసిందని అంటుంది. 

అర్చన: ఎవరు రాశారు.
మహాలక్ష్మీ: సుమతి రాసింది ఇదే లెటర్ చదువు.
అర్చన: మహాలక్ష్మీ నేను సుమతిని నేను చనిపోయుంటానని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావ్. కానీ నేను బతికే ఉన్నానని నీకు నిద్ర పట్టడం లేదని నాకు తెలుసు. నా భర్తమీద పిల్లల మీద నీది కపట ప్రేమ అని నాకు తెలుసు. కానీ వాళ్లు నీ గురించి తెలిస్తే తట్టుకోలేరు. విద్యాదేవి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. అందుకే నీకు ఆమె అంటే పగ. విద్యాదేవిని మర్యాదగా ఆపు లేదంటే నేను సీన్‌లోకి రావాల్సి వస్తుంది. నేను వస్తే నువ్వు వెళ్లాల్సి వస్తుంది.. ఇది నిజంగానే సుమతి అక్క రాసిందా.
మహాలక్ష్మీ: అవును సుమతి రైటింగ్ నాకు తెలుసు. సుమతి విద్యాదేవిలు ఒకరికి ఒకరు తెలుసు అనుకుంటా. సుమతి వస్తే నాకు ఇబ్బంది అది ఎక్కడుందో తెలిస్తే దాని అంతు చూస్తా అప్పటి వరకు విద్యాదేవిని భరించాలి.

సీత తన తల్లిదండ్రులకు టీచర్ వెళ్లడం లేదని చెప్తుంది. తన మీద అంత కోపం ఉన్న టీచర్‌ని ఎలా వెళ్లకుండా మహా ఆపిందని అడిగితే సీత చెప్పడం మొదలు పెడుతుంది. గతంలో రెండు సార్లు టీచర్‌ని పంపాలని ప్రయత్నించారని ఈసారి మహాలక్ష్మీ అత్తయ్య, అర్చన అత్తయ్య వీధిలో వాళ్లకి అఫైర్ ఉన్నట్లు మాట్లాడించారని అందుకే సుమతి అత్తయ్య చెప్పినట్లు లెటర్ రాశానని చెప్తుంది. సీత మాటలు విని మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. దాంతో శివకృష్ణ మహాలక్ష్మీ ఏదో తప్పు చేసిందని అందుకే సుమతి పేరు పెట్టగానే విద్యాదేవిని ఆపేసిందని అంటాడు. సుమతి కనిపించకుండా పోవడానికి తిరిగి రాకపోవడానికి కారణం అదే అని అంటుంది. ఇక సేమ్ రైటింగ్ ఎలా రాశావని సీతని విద్యాదేవి అడిగితే డైరీ చూసి సేమ్ రాశానని చెప్తుంది.  

మహాలక్ష్మీ అర్చన దగ్గరకు వెళ్లి జరిగింది చెప్తుంది. సీత చేతిలో దారుణంగా ఓడిపోయావని అవమానంగా ఉందని అర్చన అంటుంది. ఇంత మోసం చేసిన సీతని వదలవద్దని అర్చన అంటుంది. ఈసారి సీతని చావు దెబ్బ కొడతాను అని అంటుంది. ఈ నెల చివరకు సీతకు ఎండ్ కార్డ్ పడబోతుందని మహాలక్ష్మీ అంటుంది. ఇక సీత మధుకి కాల్ చేస్తానని మీరు కూడా అక్కతో ప్రేమగా మాట్లాడండని చెప్తుంది. దాంతో సీత తల్లిదండ్రులు నువ్వు మధు మాకు ఒక్కటే అని అంటారు. సీత మధుకి కాల్ చేస్తుంది. ఇద్దరూ ఒకరి బాగోగులు మాట్లాడుకుంటారు. మధు తన బాధ చెప్తే తల్లిదండ్రులు బాధ పడతారు. అందర్ని దూరం చేసుకున్నానని ఇప్పుడు బాధ పడుతున్నానని అంటుంది. ఇక మధు తన తండ్రితో మాట్లాడి సారీ చెప్తుంది. ఎమోషనల్ అవుతుంది. తల్లిదండ్రులు మధుకి ధైర్యం చెప్తారు. ఇక మిమల్ని చూడాలని ఉందని మధు అంటే త్వరలోనే వస్తామని చెప్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తల్లి మాటలు వినే అదృష్టం దక్కించుకున్న విశాల్.. మూడు ప్రశ్నలు ఏం అడుగుతాడో?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

వీడియోలు

India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Embed widget