అన్వేషించండి

Ayodhya: అయోధ్యకు చేరుకున్న రీల్ లైఫ్ సీతారామ లక్ష్మణులు - ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు

Ayodhya: ప్రస్తుతం అయోధ్య అంతా పవిత్రమైన వాతావరణం నెలకొంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సిద్ధమయ్యింది. ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ’ నటులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Ramayan Cast at Ayodhya: అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రీల్ లైఫ్ సీతారామ లక్ష్మణులు వచ్చారు. రామానంద సాగర్ తెరకెక్కించిన ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ’లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీతగా నటించిన దీపికా చిఖ్లియా, లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రీ.. అయోధ్యకు తరలివచ్చారు. దీంతో పాటు ఈ ముగ్గురు కలిసి ‘హమారే రామ్ ఆయేంగే’ అని ఒక స్పెషల్ ఆల్బమ్‌లో నటిస్తున్నారు. ఒకప్పుడు ‘రామాయణం’తో సీతారామ లక్ష్మణులను కళ్లకు కట్టినట్టు చూపించిన నటులు.. మళ్లీ ఇంతకాలం తర్వాత అయోధ్యలో కనిపించడంతో వారితో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.

ఇదే మనకు గర్వకారణం..
రీల్ లైఫ్ రాముడు అలియాస్ అరుణ్ గోవిల్.. అయోధ్య గురించి తన మాటల్లో చెప్పారు. ‘‘అయోధ్య అనేది మన రాష్ట్ర మందిరంగా మారుతుంది. గత కొన్నేళ్లలో ప్రపంచంలోని కల్చర్ అంతరించిపోతోంది. ఈ రామ మందిరం ద్వారా మళ్లీ మన కల్చర్‌ను బలపరచాలి అని అందరికీ సందేశం అందుతుంది. ఇది ప్రపంచానికి మనం అందిస్తున్న వారసత్వం. ఈ ఆలయం స్ఫూర్తినిస్తుంది. నమ్మకానికి పునాదిగా నిలుస్తుంది. ఇదే మనకు గర్వకారణానికి మారుతుంది. మన గుర్తింపుగా నిలుస్తుంది. మన నైతిక విలువలను అందరూ అలవరచుకోవాలి’’ అంటూ అయోధ్య గురించి చాలా గొప్పగా మాట్లాడారు అరుణ్ గోవిల్. 

మనసుల్లో ముద్రపడిపోయింది..
‘‘రాముడి విగ్రహ ప్రతిష్ట అనేది ఇంత పెద్ద కార్యక్రమంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నా జీవితంలో నేను హాజరవుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఇందులో చాలా ఎమోషన్, ఎనర్జీ ఉంది. రాముడు ఎక్కడ కనిపించినా దేశం మొత్తం ఆయన పేరునే తలచుకుంటోంది. రాముడిని నమ్ముకున్న వారిలో ఒక సంతోషం కనిపిస్తుంది. నేను ఈ కార్యక్రమాన్ని కళ్లారా చూస్తాననే ఆలోచన చాలా ఆనందాన్ని ఇస్తోంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు అరుణ్. దీపికా చిఖ్లియా కూడా ఈ విషయంపై స్పందించారు. ‘‘ప్రేక్షకుల్లో మనసుల్లో మా గురించి ముద్ర పడిపోయింది. రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అది మారుతుందని నేను అనుకోవడం లేదు. రామాయణంలోని పాత్రలకు మరింత ప్రేమ చేరుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ వాతావరణం..
‘రామాయణ’ సీరియల్‌లో లక్ష్మణుడిగా పాపులర్ అయిన సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. ‘‘ప్రాణ ప్రతిష్టా మహోత్సవానికి హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా పవిత్రమైన, పాజిటివ్ వాతావరణం నెలకొంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పాజిటివ్ ఫీలింగ్‌ వస్తుంది’’ అని అన్నారు. ఇక సునీల్, దీపికా, అరుణ్ కలిసి నటించిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాటను సోనూ నిగమ్‌ పాడాడు. గుప్తార్ ఘాట్, హనుమాన్‌ఘడి, లతా చౌక్ లాంటి ప్రాంతాల్లో ఈ ఆల్బమ్ సాంగ్ షూట్ జరిగింది.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

Also Read: విజయ్, రష్మిక సహజీవనం? నేషనల్ మీడియాలో జోరందుకున్న రూమర్స్, ఏమని రాస్తున్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget