Vijay Rashmika: విజయ్, రష్మిక సహజీవనం? నేషనల్ మీడియాలో జోరందుకున్న రూమర్స్, ఏమని రాస్తున్నాయంటే?
Vijay Rashmika: టాలీవుడ్‌లోని హాట్ కపుల్‌లో విజయ్, రష్మిక కూడా ఒకరు. ఇక వీరిద్దరూ కలిసి ఫిబ్రవరీలో వీరి రిలేషన్‌షిప్‌పై ఒక క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది.
Vijay Rashmika Engagement: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ కపుల్‌గా.. ఎప్పుడూ సోషల్ మీడియాలోని వార్తల్లో వైరల్ అవుతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందనా. వీరిద్దరు రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి.. చాలామంది వీరు రియల్ లైఫ్ కపుల్‌లాగా అనిపిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తెరపై కలిసి చేసింది రెండు సినిమాలే అయినా.. అప్పటినుండి విజయ్, రష్మిక కలిసి చాలా హాలిడేస్‌కు వెళ్లారు. కానీ ఆ విషయాలను వారు ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇక ఇంతలోనే వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని వార్తలు వైరల్ అవ్వగా.. ఈ వార్తలపై వారి సన్నిహితులు స్పందించారు.
ఫిబ్రవరీలో ఎంగేజ్‌మెంట్..?
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా.. వీరిద్దరూ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. విజయ్, రష్మిక విడివిడిగా వారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులను గమనిస్తూ ఈ విషయం స్పష్టమవుతోంది. ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో వీరిద్దరూ పలుమార్లు విడివిడిగా ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరి లివిన్ రిలేషన్‌షిప్ (సహజీవనం) చేస్తున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే వారు పెళ్లికి ఆసక్తి చూపడం లేదని కూడా చెబుతున్నాయి. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు.. విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని, ఫిబ్రవరీలో ఎంగేజ్‌మెంట్ గురించి అనౌన్స్‌మెంట్ ఇస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై వారు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ వారి సన్నిహితులు మాత్రం తాజాగా ఈ ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌పై రియాక్ట్ అయ్యారు.
కెరీర్‌పైనే ఫోకస్..
వారు కలిసి ఉంటున్న మాట నిజమే అని విజయ్, రష్మిక సన్నిహితులు బయటపెట్టారు. ప్రస్తుతం వారు రిలేషన్‌షిప్‌లో చాలా హ్యాపీగా ఉన్నారని కూడా తెలిపారు. అందుకే ఇప్పట్లో ఎంగేజ్‌మెంట్ చేసుకునే ఆలోచన వారికి లేదన్నారు. పైగా వీరిద్దరూ.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. వారి పూర్తి ఫోకస్ అంతా కెరీర్స్‌పైనే ఉందని అన్నారు. దీంతో విజయ్, రష్మిక ప్రేమ, పెళ్లి విషయంపై ఫిబ్రవరీలో క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. ఈ జంట.. తమ ప్రేమ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా పలుమార్లు దొరికిపోయారు. ప్రస్తుతం విజయ్.. ఫారిన్ ట్రిప్‌లో ఉన్నాడు. అయితే రష్మిక కూడా అక్కడే ఉందని, కలిసే ట్రిప్‌కు వెళ్లారని కూడా రూమర్స్ వస్తున్నాయి.
సినిమాల్లో బిజీ..
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల రణబీర్ కపూర్‌తో జోడీకడుతూ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ‘యానిమల్’ వరల్డ్‌లో గీతాంజలి పాత్రలో రష్మిక నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం తన చేతిలో ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ విషయానికొస్తే తనకు ‘గీతా గోవిందం’లాంటి హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమ చేస్తున్నాడు విజయ్. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడు.
Also Read: వద్దని చెప్పడం కష్టం, కానీ ఇబ్బందిగా ఉంటుంది - ముద్దు సీన్లపై అంజలి రియాక్షన్