Madhuranagarilo May 24: రాధ కొడుకు మిస్సింగ్ - చావు బతుకుల మధ్యలో శ్యామ్?
ఒకవైపు రాధ కొడుకు మిస్ అవ్వటం.. మరోవైపు శ్యామ్ కు విషపురుగు కాటేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మేడ మీద ఉన్న ధనుంజయ్ బాగా టెన్షన్ గా కనిపిస్తూ ఉంటాడు. వెంటనే శ్యామ్, రాధలకు ఫోన్ చేస్తాడు. వారి ఫోన్ కలవకపోవడంతో మరింత టెన్షన్ కి గురవుతాడు. అదే సమయంలో కింద ఉన్న పంతులు ధనుంజయ్ గురించి అడగటంతో మధుర మేడ మీదికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో సరైన రీజన్ చెప్పలేక తడబడుతూ ఉంటాడు. ధనుంజయ్ అలా కనిపించడంతో మధురకు కాస్త అనుమానం వచ్చినట్లు అనిపిస్తుంది.
మరోవైపు అడవిలో ఉన్న శ్యామ్ కు దాహం వేయడంతో రాధ తమ వెంట వాటర్ బాటిల్ లేకపోవటంతో వెంటనే రాధ అడవిలో నేను తీసుకొస్తాను అని బయలుదేరుతుంది. బైంస తన గ్యాంగ్ తో శ్యామ్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక రాధ అక్కడికి నీళ్లు బదులు కళ్ళు తీసుకొని వస్తుంది. ఇక శ్యామ్ కళ్ళు తాగి ఎవరైనా గుడికి వెళ్తారా అని అడగడంతో ఇక్కడ అలా తప్పు ఏమీ ఉండదు అని అంటుంది రాధ.
ఇక శ్యామ్ తనకు కళ్ళు తాగడం అలవాటు లేదు అంటే రాధ తాగమని మంచినీళ్లు అయితే లేవని చెబుతుంది. ఇక శ్యామ్ ఏమి చేయలేక కళ్ళు తో దాహం తీర్చుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఇంట్లో పంతులు పెళ్లికి మరో రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని కానీ ఈ వారంలోపు నిశ్చితార్థం చేసుకోవచ్చు అని అనటంతో వెంటనే అపర్ణ నిశ్చితార్థం ఎక్కడ జరుపుకున్నాము అని అడుగుతుంది.
ధనుంజయ్ శ్యామ్ వాళ్ళు వచ్చాకే నిర్ణయం తీసుకుందాము అని అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో అపర్ణ మధురను ఏంటి ఇలా అని అడగటంతో అంతే ఆయన ప్రతి చిన్న దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు కదా అని సర్దుతుంది. ఇక మధుర సంయుక్త చేతులతో పంతులుకి డబ్బులు ఇప్పిస్తుంది. అడవిలో బైంసా తన గ్యాంగ్ తో శ్యామ్ వాళ్ళను వెతుకుతూ ఉంటుంది.
ఇక శ్యామ్ రాధని చూసి ఇందాక నన్ను టెన్షన్ పెట్టావు కదా ఇప్పుడు నిన్ను టెన్షన్ పెడతాను అని అక్కడి నుంచి వెళ్లి దాచుకుంటాడు. ఇక రాధ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడరేంటి సార్ అని వెనుకకు తిరిగి చూసేసరికి శ్యామ్ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ సార్ సార్ అంటూ గట్టిగా అరుస్తుంది.
ఒక రాయి దగ్గర దాచుకున్న శ్యామ్ రాధ అరుపు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాధ మాత్రం బాగా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత శ్యామ్ అక్కడికి వచ్చి రాధని పిలవటంతో వెంటనే రాధ ఇక్కడికి వెళ్లారు అని అడగటంతో.. ఇందాక నన్ను టెన్షన్ పెట్టావు కదా అందుకే నీకు కౌంటర్ వేస్తామని ఇలా చేశాను అని అంటాడు. దాంతో రాధ ఇలా ఎందుకు చేశారు అని.. మీరు ఒక్క నిమిషం కనిపించకపోయేసరికి గుండె ఆగిపోయేంత పని అయింది అని.. టెన్షన్ తో గుండె ఆగిపోతే ఏం చేసే వాళ్ళు అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది.
ఇక చెప్పండి ఇలా ఎప్పుడు చేయనని చెప్పండి అంటూ శ్యామ్ గుండెపై కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత శ్యామ్ రాధ అని అనటంతో వెంటనే కొట్టడం ఆపేసి సైలెంట్ అవుతుంది. సారీ అని చెబుతుంది. మీరు కనిపించకపోయేసరికి ఓవర్గా రియాక్ట్ అయ్యాను అని అంటుంది. దానితో శ్యామ్ నిజంగానే రియాక్ట్ అయ్యావు అంటూ నిన్ను వదిలి తప్పు చేశాను అంటూ తిరిగి రాధకు సారీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు.
బైంసా మాత్రం శ్యామ్ వాళ్ళని వదిలేది లేదు అన్నట్లుగా వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంట్లో ధనుంజయ్ శ్యామ్ వాళ్లకు ఫోన్ చేస్తూ టెన్షన్ గా కనిపిస్తూ ఉంటాడు. పక్కనే టీ తాగుతున్న మధురకు ధనుంజయ ప్రవర్తనలో కాస్త అనుమానం వస్తుంది. శ్యామ్, రాధ వాళ్ల గురించి ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది.
ఆ సమయంలో మధురకు ఫోన్ రావడంతో.. పండు గురించి శ్యామ్ మధురకు చెప్పాలని ఫోన్ చేస్తున్నాడా అని టెన్షన్ పడతాడు. ఆ ఫోన్ ఎవరు అని శ్యామ్ అడగటంతో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అంటుంది మధుర. ఫోన్ చేసేది అపర్ణ అని చెప్పటంతో సరే అని అంటాడు ధనుంజయ్. హమ్మయ్య పండు విషయం ఏమైనా చెబుతారేమో అని టెన్షన్ పడిపోయాను అని అనుకుంటాడు ధనుంజయ్ తన మనసులో.
ఇక అపర్ణ పండు వాళ్ళ స్కూల్లో అందరూ టూర్ కి వెళ్లారు అని ఇక అక్కడ ఒక బాపు మిస్ అయ్యాడు అని అంటున్నారు.. వాళ్ళు మధురానగర్ లో ఉంటారు అని.. అంటే రాధ వల్ల కొడుకా అని అనటంతో మధుర షాక్ అయ్యి ఫోన్ పెట్టేస్తుంది. ఇక టెన్షన్ పడుతున్న ధనుంజయని చూసి ఈ విషయం ముందే తెలిసి ధనుంజయ్ టెన్షన్ పడుతున్నాడా అని అనుకుంటుంది.
వెంటనే రాధ వాళ్ళకు ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవక పోయేసరికి తను పడుతున్న టెన్షన్ చూసి ధనుంజయ ఏం జరిగింది అని అడగడంతో.. పండు కనిపించడం లేదంట అని నిజం చెప్పేస్తుంది మధుర. దాంతో ధనుంజయ్ ఈ విషయం నాకు ముందే తెలుసు అని రాధ వాళ్ళు అడవిలో వెతకడానికి వెళ్లారు అని నీకు చెబితే టెన్షన్ పడతావు అని చెప్పట్లేదు అని అనడంతో.. వెంటనే మధుర టెన్షన్ పడుతూ బాగా ఎమోషనల్ అవుతుంది.
ఇక అడివిలో వెళ్తున్న శ్యామ్ కు విషపురుగు కుట్టడంతో వెంటనే శ్యామ్ కాలు చూసి అది విషపురుగు అని గమనిస్తుంది రాధ. శ్యామ్ మాత్రం నొప్పిని తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు. వెంటనే రాధ తను చీర కొంగు చింపి కాలికి కడుతుంది. దీనికి మార్గం పసరు వైద్యం అని అంటుంది. తరువాయి భాగంలో రాధ పసరు కోసం ఆకులు తెంపుతూ ఉంటుంది.
ఇక శ్యామ్ స్పృహ తప్పి పడిపోవటంతో బైంసా అక్కడికి వచ్చి.. విషపురుగు కాటు వేసింది అని గమనించి వెంటనే ఆ కట్టు తీసేస్తే విషయం అంత పైకి ఎక్కుతుంది అని కట్టు తీసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రాధ అక్కడికి రావటంతో విషం పైకి ఎక్కుతున్న దాన్ని చూసి షాక్ అవుతుంది. మరోవైపు మధుర దేవుడి ముందు బాగా ఎమోషనల్ అవుతూ కనిపిస్తుంది.
Also Read: Keerthi Suresh: నా ఫ్రెండ్‌ను ఇందులోకి లాగద్దు - పెళ్లిపై కీర్తి సురేష్ ఫన్నీపంచ్