(Source: ECI/ABP News/ABP Majha)
Prema entha maduram Serial Today March 1st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: వర్ధన్ కుటుంబంలో బర్తుడే సెలబ్రేషన్స్ – కొత్త ప్లాన్ తో ఎంటర్ అయిన మాన్షి
Prema entha maduram Today Episode: ఫుల్ హ్యపీ మూడ్ లో ఉన్న వర్ధన్ కుటుంబంలోకి మాన్షి ఎంటర్ కాగానే అంతా షాక్ అవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Prema entha maduram Serial Today Episode: పిల్లల బర్తుడే అని శారదాదేవి స్పెషల్‌గా స్నానం చేయించాలని ఏర్పాట్లు చేస్తుంది. అఖి, అభయ్ అక్కడకు వచ్చి స్నానం చేయమని మారాం చేస్తుంటారు. నీరజ్ వచ్చి ఎలా చేయరో చూస్తానని నీళ్లు తీసుకుని పిల్లల మీద చల్లడానికి ప్రయత్నిస్తే పిల్లలు తప్పించుకుంటారు. వారి వెనక నీరజ్ పరుగెడుతుంటాడు. ఇంతలో ఆర్య, అను అక్కడకు వస్తారు. చూడు దాదా పిల్లలు స్నానం చేయమంటే చేయకుండా ఆట పటిస్తున్నారు అని చెప్పడంతో తమరేం తక్కువా నువ్వు కూడా ఇలాగే స్నానం చేయకుండా పరుగెత్తేవాడివి. అనగానే పిల్లలు నాన్న బాబాయ్ కూడా ఇక్కడే స్నానం చేసేవాడా? అని అడగ్గానే పదొ తరగతి వరకు ఇక్కడే చేసేవాడు అని ఆర్య చెప్పగానే పిల్లలు నీరజ్‌ను ఆటపటిస్తారు. ఇంతలో అను వాళ్ల అమ్మా,నాన్న పద్దు, సుబ్బు వస్తారు. అందరూ హ్యాపీగా పిల్లలకు స్నానం చేయిస్తారు.
సుబ్బు: పద్దు ఇంకా ఎంతసేపే పిల్లలకు త్వరగా తల తుడువు లేదంటే జలుబు చేస్తుంది.
పద్దు: ఓయబ్బో అక్కడికేదో పిల్లలంటే మీ ఒక్కరికే ప్రేమ ఉన్నట్లు మాకు తెలుసులే..
ఇంతలో ఆనంది స్నానం చేయడానికి రెడీ అయ్యి అక్కడకు వస్తుంది. ఆనంది నువ్వేంటమ్మా ఇక్కడకు వచ్చావు అని శారదాదేవి అడుగుతుంది. మేము స్నానం చేయించుకున్నట్లు తను కూడా చేయించుకోవాలని వచ్చిందేమో.. ఇవాళ మా బర్తుడే అందుకే ఇలా చేస్తున్నాం. అని పిల్లలు అనగానే ఇవాళ నా బర్తుడే కూడా అని ఆనంది చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
అఖి: అబద్దం అమ్మా స్పెషల్ బాత్ కోసం తను ఇలా చెప్తుంది.
అను: అఖి అలా అనకూడదమ్మా?
సుబ్బు: బుజ్జమ్మా ఎవరమ్మా ఈ అమ్మాయి..?
పద్దు: అమ్మీ ఎవరీ పిల్లా?
అను: అమ్మా అవన్నీ నేను తర్వాత చెప్తాను. పిల్లల్నీ నేను రెడీ చేస్తాను. నువ్వు ఆ పాపకు కూడా స్నానం చేయిస్తావా?
అఖి: అమ్మమ్మ ఎందుకు చేపించాలి అమ్మా?
అను: అఖి నువ్వు సైలెంట్‌గా ఉండు. లక్ష్మీ నువ్వు అమ్మకు హెల్ఫ్ చెయ్. పిల్లలు పదండి.
అని అను పిల్లలను తీసుకుని లోపలికి వెళ్తుంది. శారదాదేవి పూజకు ఏర్పాట్లు చేస్తాను అని తను కూడా వెళ్లిపోతుంది. పద్దు ఆనందికి స్నానం చేయిస్తుంది.
నీరజ్: వాట్ ఈజ్ దిస్ దాదా? అఖి అన్నది అని కాదు. ఆ పాప అటెన్షన్ కోసమే ఇలా చేస్తుంది అనిపిస్తుంది. లేకపోతే ఇవాళే తన బర్తుడే అవ్వడమేంటి?
ఆర్య: నీరజ్ చిన్నపిల్ల తనేందుకు అబద్దం చెప్తుంది.
నీరజ్: అబద్దం చెప్పదు ఓకే దాదా కానీ నిజం మాత్రం ఎక్కడ చెప్తుంది. పేరెంట్స్ గురించి అడుగుతే గుర్తు లేదు అంటుంది. బర్తుడే మాత్రం గుర్తుందా తనకి. తన విషయంలో ఏదో ఒక డిషిషన్ తీసుకోవాలి దాదా నన్నడితే తనను ఏదైనా ఆర్గనైజేషన్‌లో జాయిన్ చెయ్యడం బెటర్.
అనగానే నీరజ్ తొందర పడకు అని ఆర్య చెప్తాడు. తర్వాత ఆనందికి స్నానం చేయించిన పద్దు లోపలికి వెళ్తుంది. మరోవైపు కేశవ వచ్చి శారదాదేవికి ఫంక్షన్ పనులన్నీ పూర్తి చేశానని చెప్పడంతో నీరజ్ వచ్చి అన్నీ పనులు నువ్వే చేస్తావా? నేను కూడా చేస్తాను అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో మాన్షి ఎంటర్ అవుతుంది. బయట గేటు దగ్గర సెక్యూరిటీ అడ్డుపడితే కోపంగా తిడుతుంది. లోపలికి తోసుకుని వస్తుంది. ఇంట్లో అందరినీ చూసి సెక్యూరిటీని అడుక్కున్నట్లు నటిస్తుంది. ఆర్య సెక్యూరిటీని పంపిస్తాడు. మాన్షి లోపలికి వస్తుంది. ఏడుస్తున్నట్లు నటిస్తూ.. నన్ను క్షమించండి అని ప్రాధేయపడుతుంది. నీరజ్ బయటకు వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో శారదాదేవిన కాళ్లపై పడి మొక్కుతుంది మాన్షి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.