Prema Entha Madhuram Serial Today October 7th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి ఇంటికి వెళ్లిన అభయ్ – పెళ్లి కాగానే జైలుకు వెళ్లమన్న రాకేష్
Prema Entha Madhuram Today Episode: ఇంటి ఓనరు పాండు ఫోన్ చేసి తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని శంకర్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: గౌరి వాళ్ల ఇంటికి లంచ్‌కు వస్తాడు అభయ్. రాకేష్ మాత్రం కారులోనే కూర్చుని ఉంటాడు. లోపలికి వచ్చిన అభయ్‌కు చిన్నొడు, పెద్దోడు కలుస్తారు. మా అన్నయ్యా చిన్న డిస్టబ్ లో ఉన్నాడని చెప్పడంతో అయితే గౌరి గారిని కలిసి వెళ్తానని చెప్పి గౌరి వాళ్ల ఇంట్లోకి వెళ్తాడు. లోపల గౌరి బాధపడుతూ శంకర్ ముసుగులు తీసిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. శంకర్ తనను కొట్టబోయిన విషయం గుర్తు చేసుకుని భయపడుతుంది. శ్రావణి, సంద్య అభయ్‌ని హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్తారు. ఇంతలో అభయ్ కి అకి ఫోన్ చేసి పెళ్లి విషయంలో జరిగిన గొడవ గురించి చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్లడం కరెక్టు కాదు వచ్చేయ్ అని చెప్తుంది. అభయ్ సరే అని వెళ్లిపోతాడు.
రాకేష్: అభయ్ వస్తున్నాడేంటి?
అభయ్: రాకేష్ వెళ్దాం పద
రాకేష్: ఏమైంది అభయ్..
అభయ్: తర్వాత చెప్తాను నువ్వు ముందు పద.
అని కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతుంటే లోపలి నుంచి గౌరి వచ్చి పిలుస్తుంది. పలకకుండా వెళ్లిపోతాడు. మరోవైపు జెండేను కలుస్తాడు యాదగిరి.
యాదగిరి: ఏంటి సార్ ఆలోచిస్తున్నారు. మా రవి చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ రాకేషే జలంధర్ కొడుకు అని అర్థం అయింది కదా సార్. వాణ్ని వెంటనే గన్ తో షూట్ చేసి పడేయండి సార్.
జెండే: యాదగిరి కంట్రోల్. ఇది ఆవేశపడాల్సిన సమయం కాదు. ఆలోచించాల్సిన సమయం. వాడి గురించిన నిజం మనకు తెలిస్తే కాదు దానికి సాక్ష్యం కావాలి.
యాదగిరి: తన తల్లిదండ్రులన చంపడానికి ప్రయత్నిస్తున్నవాడే వాళ్లను విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే అభయ్ బాబు ఎందుకు నమ్మడు సార్.
జెండే: దానికంటే ముందు అభయ్ కి నిజం తెలియాలి కదా సార్. వాడిని భయపెట్టాలని చూస్తే అభయ్ నుంచి మనల్ని దూరం చేస్తాడు. ముందు ఆ పెళ్లి ఆపడం గురించి ఆలోచించాలి.
యాదగిరి: అవును సార్.. సారు మేడం విడిపోకూడదు. ఏదో ఒకటి చేయండి సార్
అంటూ జెండేను ప్రాధేయపడుతుంటాడు. మరోవైపు రాకేష్, వినయ్, పాండు ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటారు.
వినయ్: నన్నే ఇరికించి నా గుట్టు బయటపెడదాం అనుకున్నారు. చివరికి వాళ్లే ఇరుక్కున్నారు.
పాండు: పార్ట్‌నర్ గౌరి తిడుతుంటే ఆ శంకర్ ముఖం చూడాలి. అబ్బాబ్బా నా మనసు ఆనందంతో పొంగిపోయింది అంతే.
రాకేష్: అసలైన సెలబ్రేషన్ రేపు ఆ గౌరి పెళ్లి అయ్యాక ఉంటుంది.
పాండు: నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే రేపు ఆ పెళ్లి జరిగేలా చేస్తాను పార్ట్‌నర్. శంకర్ ఫోన్ చేస్తున్నాడు. మీరు కామ్ గా ఉండండి. హలో శంకర్ చెప్పమ్మా..
శంకర్: ఓనరు గారు ఇల్లు ఖాళీ చేస్తున్నాం. రేపు మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి.
పాండు: ఏంటి ఓనరు గారా? అబ్బో పోనీలే ఖాళీ చేసే ముందైనా గౌరవం ఇస్తున్నావు. అవును ఆరు నూరైనా నూరు ఆరైనా ఇల్లు ఖాళీ చేసేది లేదన్నావుగా..? ఇప్పుడెందుకు ఖాళీ చేస్తున్నావు అమ్మా..
శంకర్: అది మీకు అనవసరం.
పాండు: రేపు నేను టూలెట్ బోర్డుతో వస్తాను ఓకే. వాడితో ఇల్లు ఖాళీ చేయించాలన్న కోరిక నెరవేర్చావు. థాంక్యూ సో మచ్.
రాకేష్: నీ ఇల్లు అసలు మ్యాటర్ కాదు. ఆ పెళ్లి జరగడం కావాలి.
అంటూ పెళ్లి కాగానే నువ్వు వెంటనే జైలుకు వెళ్లిపో అంటూ చెప్తాడు. వినయ్ సరే అంటాడు. ఒకవైపు శంకర్, మరోవైపు గౌరి బాధపడుతూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ లో సాడ్ సాంగ్ వస్తుంది. తర్వాత అమ్మవారి ముందు కూర్చున్న జోగమ్మ వాళ్ల గత జన్మ అర్ధాంతరంగా ముగిసింది. ఈ జన్మలోనేనా వారు పూర్తి జీవితం గడుపుతారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా అని బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం