Prema Entha Madhuram Serial Today October 30th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరిని ఆవహించిన రాజనందిని – అకి, అభయ్ లన చంపేందుకు ఇంట్లో బాబుంలు పెట్టిన రాకేష్
Prema Entha Madhuram Today Episode: తన అనుచరులకు చెప్పి బాంబుల తెప్పించుకున్న రాకేస్ అకి వాళ్ల ఇంట్లో పెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: గౌరి, శంకర్ లను పిలవడానికి అకి, అభయ్, జెండే వెళ్తుంటారు. అదే టైంకు గౌరి, శంకర్ లు కూడా అభయ్ ని కలుద్దామని వస్తారు. దూరం నుంచి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. అకి సంతోషంగా అదిగో శంకర్ వాళ్లే మన కోసం వస్తున్నారు అంటుంది. ఇంతలో రాకేష్.. అక్కడ కరెంట్ తీసేస్తాడు. దీంతో అంతా చీకటిగా ఉంటుంది. అందరూ వచ్చి మాట్లాడుకుని ఉదయం కలుద్దామని వెళ్లిపోతారు. గౌరి, శంకర్ లు కొద్ది దూరం వెళ్లాక..
శంకర్: గౌరి గారు మీరు వెళ్లండి నేను ఇప్పుడే వస్తాను.
గౌరి: చీకట్లో ఎక్కడి శంకర్ గారు..
శంకర్: పవర్ పోయింది కదండి.. ఎప్పుడొస్తుందో తెలియదు. వెళ్లి కాండిల్స్ తీసుకొస్తాను.
గౌరి: సరే వెళ్లి తీసుకురండి..
శంకర్ క్యాండిల్స్ కోసం వెళ్తాడు. మరోవైపు నీలకంఠం, కోటి వస్తుంటారు..
కోఠి: మీ చాదస్తం కాకపోతే ఈ రాత్రి పూట దొంగల్లాగా వాళ్ల ఇంటికి వెళ్లకపోతే ఏం బాగుంటుంది అండి.
నీలకంఠం: ఆ అవుట్ హౌస్ లో అనురాధ, ఆర్యవర్థన్ లు ఉన్నారో లేదో తెలుసుకుని చూడాల్సిందే.
కోఠి: మీకు మరీ పంతం ఎక్కువై పోయిందండి. కొపందీసి వారి ఆత్మలు ఉన్నాయేమో..
అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే.. దూరం నుంచి క్యాండిల్స్ కోసం వస్తున్న శంకర్ ఈ ఊరు కొత్త షాపులు ఎక్కడుంటాయో తెలియదు అని నీలకంఠం దగ్గరకు వెళ్తాడు. ఇంతలో కోఠి అర్జెంటుగా మూత్రం వస్తుందని పక్కకు వెళ్లిపోతాడు. ఇంతలో శంకర్ ను చూసిన నీలకంఠం కిందపడిపోతాడు. మూత్రానికి వెళ్లిన కోఠి పరుగెత్తుకొచ్చి శంకర్ చూసి అలాగే బిగుసుకుపోతాడు. టార్చిలైట్ తీసుకుని శంకర్ వెళ్లిపోతాడు. అందరూ నిద్రపోయాక నంబూద్రి, రాకేష్ ఇంట్లోంచి బయటకు వస్తారు.
రాకేష్: ఇప్పుడు చెప్పండి ఆ శంకర్ ను ఎలా అంతం చేద్దాం.
నంబూద్రి: చెప్తాను. ఆ గౌరి, శంకర్ లది జన్మజన్మల బంధం. వాళ్ల ప్రేమ వాళ్లను ఎప్పటికీ దూరం కానివ్వదు. అంతే కాదు ఆ రాజనందిని శక్తి వాళ్లను ఎప్పుడూ రక్షిస్తుంది.
రాకేష్: అంటే వాళ్లను ఏం చేయలేమా..?
నంబూద్రి: చేయగలం.. అందుకు ముందుగా గౌరిని బంధించాలి. అది కూడా తనని రాజనందిని శక్తి ఆవహించినప్పుడే బంధించాలి. తనని బంధించినప్పుడే శంకర్ ను చంపడం సాధ్యమవుతుంది.
అని నంబూద్రి చెప్తుంటే మరోవైపు రాజనందిని ఆత్మ వెళ్లి గౌరిని ఆవహిస్తుంది. రాకేష్ తన మనుషులకు చెప్పి బాంబులు తీసుకురమ్మని చెప్తాడు. మరోవైపు గౌరి అలియాస్ రాజనందిని ఇంట్లోంచి బయటకు వస్తుంది. బయట ఎవ్వరికీ తెలియకుండా కూర్చున్న చిన్నొడు, సంధ్య లను వెతుక్కుంటూ పెద్దొడు, శ్రావణి వస్తారు. గౌరి రోడ్డు మీద నడుచుకుంటూ రావడం చూసిన సంధ్య, శ్రావణి, చిన్నొడు, పెద్దొడు.. ఎవరో వస్తున్నారని గోడ చాటుకు వెళ్లి దాక్కుంటారు. రాజనందిని ఆవహించిన గౌరి అకి వాళ్ల ఇంట్లోకి వచ్చి రాకేష్ గొంతు పట్టుకుని చంపేయబోతుంది. మరోవైపు నంబూద్రి పూజలు చేస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!