Prema Entha Madhuram Serial Today Fabruary 8th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అభయ్‌ని రెచ్చగొట్టిన మాయ – కంపెనీలో పొజిషన్ అడిగిన రవి
Prema Entha Madhuram Today Episode: ది గ్రేట్ ఆర్యవర్ధన్ కొడుకుగా నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని అభయ్‌ని మాయ రెచ్చగొట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: చిన్నోడితో సంధ్య పెళ్లికి ఒప్పుకోదు గౌరి. దీంతో అందరూ గౌరిని కన్వీన్స్ చేయాలని చూస్తారు అయినా ససేమిరా అంటూ వెళ్లిపోతుంది గౌరి. దీంతో గౌరి దగ్గరకు అకి, అభయ్ వెళ్తారు.
అకి: గతం దగ్గర ఆగిపోతే ఎలా అమ్మా.. నాన్న మీద మీకు నమ్మకం ఉంది కదా..? నాన్న తన తమ్ముళ్లను సరైన దారిలోనే పెంచారు.
అభయ్: అవునమ్మా కాకపోతే రాకేష్ వల్ల వాళ్ల మధ్య డిస్టబెన్స్ వచ్చాయి.
గౌరి: మీకు తెలియదు అభయ్. వాళ్ల బిహేవియర్, తలపొగరు, బాధ్యత లేకుండా బతకడం నేను దగ్గరుండి చూశాను. అనుగా మీ అమ్మగా మీ పట్ల నాకు ఎంత బాధ్యత ఉంటుందో గౌరిగా వాళ్ళకు అక్కగా నాకు అంతే బాధ్యతగ ఉంది. చూస్తూ చూస్తూ వాళ్ల గొంతు కోయలేను. అసలు అతను కనీసం తన తప్పు లేదని కూడా చెప్పుకోవడ లేదు.
మరోవైపు జెండేతో శంకర్
శంకర్: అసలు నా తమ్ముడు ఎందుకు బతిమాలుకోవాలి సార్. సంధ్య కూడా నా తమ్ముడిని ప్రేమించలేదా..? సంధ్య తన అక్కకు నచ్చజెప్పుకోవాలి కదా..?
జెండే: సంధ్య నచ్చజెప్పినా కూడా గౌరి వినిపించుకోవడం లేదు కదా సార్.
శంకర్: అంటే సంధ్యకు తన అక్కే ఎక్కువన్నమాట. నా తమ్ముడు అక్కర్లేదు అన్నమాట.
ఇంకోవైపు సంధ్య, శ్రావణి, పెద్దొడు, చిన్నోడు మాట్లాడుకుంటుంటారు.
సంధ్య: అక్కర్లేదని నేను అన్నానా..? నీ కంటే నాకు మా అక్కే ఎక్కువ. ఎందుకంటే తను మాకు అక్క కాదు అమ్మతో సమానం.
చిన్నొడు: అలాంటప్పుడు మన విషయం చెప్పు అని ఎందుకు ఫోర్స్ చేశావు.
శ్రావణి: తన మీద కోప్పడతావు ఎందుకు చిన్నొడా..? తన ఏం అంది ఇప్పుడు మా అక్కే ఎక్కువ అంది ఇప్పుడు. ఏం మీకు మీ అన్నయ్య ఎక్కువ కాదా..?
పెద్దొడు: మా అన్నయ్య మీ అక్కలాగా మమ్మల్ని వ్యతిరేకించలేదే..? సపోర్టే చేశాడు కదా..?
గౌరి: ఎందుకు సపోర్టు చేయడు. తన తమ్ముళ్లు ఆణిముత్యాలని తన నమ్మకం. రేపు వాళ్ల పెళ్లి చేస్తే వాళ్ల వల్ల నాకు మీ నాన్నకు మధ్య డిస్టబెన్స్ వస్తాయి. అందుకే వద్దని చెప్తున్నాను. మీ నాన్నకు ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు.
శంకర్: ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు జెండే సార్. ఆవిడ చెల్లితో తప్పా నా తమ్ముడికి పెళ్లి కాదా..? అంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను చూడండి..
సంధ్య: అయితే మీ అన్నయ్య తెచ్చిన సంబంధమే చేసుకో.. నేనేందుకు..?
చిన్నొడు: నీకు మీ అక్కా ఎన్నారై ప్రాడుగాణ్నో తీసుకొస్తుంది. వాణ్నే చేసుకో.. మీరు వాళ్లనే కదా బాగా నమ్ముతారు.
శ్రావణి: ఏయ్ ఏం మట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..?
అంటూ తిడుతుంది. దీంతో అందరికీ గొడవ జరగుతుంది. ఒకరినొకరు తిట్టుకుంటారు. మరోవైపు రవి తన లైఫ్ లో ఏం జరగుతుంది అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అకి వచ్చి భోజనం చేశావా అని అడుగుతుంది. లేదని రవి చెప్తూ అకిని తిడతాడు. ఇలా ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు నాకు ఇప్పుడు మీ కంపెనీలో పొజిషన్ కావాలి అని అడుగుతాడు. నాకున్న నాలెడ్జ్‌లో సగం కూడా లేని ఆయన దగ్గర పని చేయడం ఏంటి..? వర్దన్ కుటుంబ అల్లుడిగా నేను ఒక పీఏగా పనిచేస్తున్నాను అంటే గౌరవం ఉంటుందా..? అంటాడు. అంతా డోర్ చాటు నుంచి శంకర్ వింటాడు. మరోవైపు అభయ్‌ని రెచ్చగొడుతుంది మాయ. కంపెనీని నువ్వే లీడ్ చేయమని చెప్తుంది. దిగ్రేట్ ఆర్యవర్ధన్ కొడుకుగా నీకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















