Podharillu Serial Today December12th: కెనడా పెళ్లికొడుకుకి మహా నచ్చేసిందా..? అటు పెళ్లిచూపులకు వెళ్లిన మాధవ్ అక్కడ ఏం చేశాడు..?
Podharillu Serial Today Episode December12th: పెళ్లి చూపులు చెడగొట్టడానికి మహా ఎంత ప్రయత్నించినా...కెనడా పెళ్లికొడుకుకి ఆమె నచ్చుతుంది. అటు మాధవ్ పెళ్లిచూపులు కూడా ముగుస్తాయి.

Podharillu Serial Today Episode December12th: పెళ్లి చూపులు చెడగొట్టడానికి మహా ఎంత ప్రయత్నించినా...కెనడా పెళ్లికొడుకుకి ఆమె నచ్చుతుంది. అటు మాధవ్ పెళ్లిచూపులు కూడా ముగుస్తాయి.
Podharillu Serial Today Episode: తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా మహా పెళ్లిచూపులకు వస్తుంది. పెళ్లికొడుకు మహా హైట్ తక్కువగా ఉందని కామెంట్ చేయడంతో చాలా కోపం వస్తుంది. పెళ్లికుమారుడు తల్లిదండ్రులకు మహా చాలా బాగా నచ్చుతుంది.
అటు మాధవ్ పెళ్లిచూపుల కోసం పిల్లలందరితో కలిసి నారాయణ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళతాడు. మాధవ్ పెద్ద బిల్డర్ అంటూ చక్రి ఆడపెళ్లి వాళ్ల ముందు బిల్డప్ ఇస్తాడు. అందరూ మగవాళ్లే వచ్చారు...ఆడవాళ్లను తీసుకుని రాలేదా అని ఆడపెళ్లివాళ్లు అడుగుతారు. మా అమ్మ చనిపోయిందని...ఇంట్లో అందరూ మగవాళ్లే ఉంటారని మాధవ్ చెబుతాడు. ఇంతలో పెళ్లి కుమార్తె వచ్చి వేడివేడి గారెలు అందిస్తుంది. అవి తిన్న మాధవ్...అవి సరిగా లేవని, ఎలా వేయాలో చూపిస్తానంటూ ఆమెను వంటగదిలోకి తీసుకెళ్లిచూపిస్తాడు. ఈ తంతు అంతా చూసి ఆడపెళ్లివాళ్లు నవ్వుకుంటారు. పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలు ఒకరికొకరు నచ్చుతారు. ఏ విషయం తర్వాత చెబుతామని ఆడపెళ్లివాళ్లు చెప్పి మాధవ్ వాళ్లను అక్కడ నుంచి పంపించివేస్తారు.
మరోవైపు మహా పెళ్లి చూపుల తంతు కూడా నడుస్తుంటుంది. మహా పుట్టిన తర్వాతే తనకు అదృష్టం కలిసి వచ్చి పైకి ఎదిగినట్లు ప్రతాప్ చెబుతాడు. మీరు ఇద్దరూ విడిగా మాట్లాడుకోవచ్చని చెప్పడంతో పెళ్లికొడుకు ఓకే అంటాడు. దీంతో మహా అతన్ని లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతుంది. తనకు ఇండియా వాతావరణం నచ్చదని...కెనడాలో మొత్తం ఏసీలోనే తిరుగుతానని పెళ్లికొడుకు గొప్పలు చెబుతుంటాడు.ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టాలని అనుకుంటున్న మహా...అతని మాటలకు కౌంటర్లు వేస్తుంటుంది. వంట వచ్చాఅని అడగ్గా...మహా రాదాని చెబుతుంది. నాకు వంట వచ్చిన భార్య కావాలని అంటాడు. కెనడాలో కుక్‌ను పెట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటాడు. దీనికి మహా నీకు భార్య కావాలా కుక్ కావాలా అని నిలదీస్తుంది. అలాగే నీ మేకప్ కూడా నాకు నచ్చలేదని పెళ్లికొడుకు అంటాడు. దీంతో మహా ముఖంలో వెలుగు వస్తుంది. ఖచ్చితంగా వీడికి నేను నచ్చను అని అనుకుంటుంది.
అతను చెప్పేది వినలేక మహా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చిన పెళ్లికొడుకు...తన ఒపినియన్స్, నా ఒపినియన్స్ వేర్వేరు అని వాళ్ల తల్లితో అంటాడు. పది నిమిషాల్లో ఏం తెలుస్తుంది బాబు అని ప్రతాప్ అనగా...తప్పంతా మీదే అంకుల్ అంటాడు. ఈ ఊరు, ఆ డబ్బా కాలేజీ తప్ప వేరే లోకం తెలియకుండా మీ అమ్మాయిని పెంచారని కోప్పడతాడు. ఎలాగైతేనే వీడికి నేను నచ్చలేదని మహా లోలోపల సంతోషపడుతుంది. కానీ అతను రియాక్షన్ చూసి షాక్‌కు గురవుతుంది. పెళ్లి చేసుకుని కెనడాకు తీసుకెళ్లి అసలు ప్రపంచం అంటే ఏంటో చూపిస్తానంటాడు. దీంతో అందరూ సంతోషపడతారు...కానీ మహా మాత్రం కోపంతో రగిలిపోతుంది. మీ అమ్మాయి బాగా నచ్చిందని చెప్పడంతో అందరూ స్వీట్లు తింటారు.





















