By: ABP Desam | Updated at : 02 Aug 2023 03:21 PM (IST)
Image Credit: Star Maa
Neethone Dance: నవీన్ పోలిశెట్టి పరిచయం అవసరం లేని పేరు. ‘జాతి రత్నాలు’ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి నవీన్ పోలిశెట్టి త్వరలోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షో ‘నీతోనే డాన్స్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా నవీన్ వేదికపై శ్రీముఖితో పాటు రాధతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ సినిమా ద్వారా నన్ను ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.
శ్రీముఖి మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం అని అడగడంతో నేను గ్యాప్ తీసుకోలేదు అదే వచ్చింది అంటూ పంచ్ వేశారు. ఇక ఈ కార్యక్రమం ‘నీతోనే డాన్స్’ అంటూ కపుల్స్ రావాలి. మరి మీరు సింగిల్ గా వచ్చారు ఏంటి? అని శ్రీముఖి అడగడంతో ‘‘ఇక్కడ జోడి సెట్ చేసుకుందామని వచ్చాను’’ అని చెబుతారు. దాంతో శ్రీముఖి ఇక్కడ ఆల్రెడీ పెళ్లైన వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్లే ఉన్నారని చెబుతుంది. దీంతో అక్కడ ఉన్నారు అంటూ.. నవీన్ జడ్జెస్ వైపు చూశారు.
ఇక రాధకు ఆల్రెడీ పెళ్లైనటువంటి సీనియర్ హీరోయిన్ ఇక సదా మాత్రమే అక్కడ పెళ్ళికాని అమ్మాయి. దీంతో సదా సిగ్గుపడుతూ కనిపించింది. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా కొనసాగింది. ఇక శ్రీముఖి రాధాని ప్రశ్నిస్తూ ‘‘మీరు అనుష్కను ఇష్టపడతారా లేక నవీన్ ను ఇష్టపడతారా’’ అని అడిగింది. ఆమె మాత్రం.. ‘‘నేను ఇద్దరినీ ఈక్వల్ గా చూస్తాను’’ అంటూ సమాధానం చెప్పారు. అనంతరం నవీన్ పోలి శెట్టి ‘‘మా డాడీ మీకు క్రష్ అని చెప్పారు’’ అంటూ చెబుతారు.
అనంతరం రాధా నవీన్ పోలి శెట్టి వేదికపై డాన్స్ చేస్తూ అందరిని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ఎపిసోడ్లో నవీన్ పోలిశెట్టి ఎలా అందరిని ఎంటర్టైన్ చేశారనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి. ఇక ఈ కార్యక్రమంలో బుల్లితెర జోడీలు నువ్వా నేనా అని పోటీపడుతూ డాన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficialabpdesamofficial
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>