Madhuranagarilo July 2nd: 'మధురానగరిలో' సీరియల్: విషం తాగిన గన్నవరం, కాబోయే భర్తకు సర్ప్రైజ్ చేయనున్న సంయుక్త
విషం కలిపిన మందు తాగటంతో గన్నవరం రచ్చ రచ్చ చేయటం వల్ల సీరియల్ సరదాగా సాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Madhuranagarilo July 2nd: 'మధురానగరిలో' సీరియల్: విషం తాగిన గన్నవరం, కాబోయే భర్తకు సర్ప్రైజ్ చేయనున్న సంయుక్త Samyukta to surprise future husband in Madhuranagarilo July 2nd eposide Madhuranagarilo July 2nd: 'మధురానగరిలో' సీరియల్: విషం తాగిన గన్నవరం, కాబోయే భర్తకు సర్ప్రైజ్ చేయనున్న సంయుక్త](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/d3dc5b2be4704dc50a5aa565b23fdb7c1690959109976768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhuranagarilo July 2nd: రాధ పండు పక్కన కూర్చోని శ్యామ్ పెళ్లి గురించి అడిగినందుకు ఆలోచనలో పడుతుంది. పండు తండ్రి గురించి అడుగుతున్నాడని నాకే పండు తండ్రి గురించి తెలీదు అని బాధ పడుతుంది. పండు తండ్రి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో.. పండు ఆరోగ్యం ఎలా కుదుటపడుతుందో అని ఆలోచనలో పడుతుంది.
మరో వైపు విల్సన్ మందు కొడుతూ తన శోభనం గురించి బాధ పడుతుండగా అక్కడికి గన్నవరం రావడంతో గన్నవరం వల్లే తన పరువు మొత్తం పోయింది అని తనని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. గన్నవరం కూడా ముందర మందు ఉండటంతో విల్సన్ ను మాటల్లో పెట్టి ఆ మందు తాగేస్తాడు. ఇక విల్సన్ చనిపోవటానికి విస్కీలో విషయం కల్పానని చెబుతాడు. దాంతో గన్నవరం ఆ విస్కీ తాగింది తనే అని షాక్ అవుతాడు. ఇక ఆ విషయం కలిపిన విస్కీ నేనే తాగాను అని గన్నవరం అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో నాతోనే పెట్టుకుంటావా అని విల్సన్ అనుకుంటాడు.
మరోవైపు రాధ తలకు పెళ్లి కాలేదు అనే విషయం శ్యామ్ కి అనుమానం వచ్చిందేమో అని.. ఎలాగైనా తనకు పెళ్లి అయినట్లుగానే తెలియాలి దానికి ప్లాన్ చేయడానికి స్వప్నను అడగాలి అని స్వప్నకు ఫోన్ చేస్తుంది. ఇక స్వప్నతో శ్యామ్ కు తన పెళ్లి పై అనుమానం వచ్చింది అని.. ఒకవేళ తనకు పెళ్లి జరగలేదన్న విషయం తెలిస్తే శ్యాం సార్ వెంటనే పెళ్లి చేసుకుంటాడని అది చూసి మధుర మేడం తట్టుకోదు అని చెబుతుంది.
ఒక తనకు పెళ్లి కాలేదు అనే విషయం శ్యామ్ కి తెలియకూడదు అని అనగా ఏం టెన్షన్ పడకు రెండు రోజుల్లో పెళ్లి జరిగిపోతుంది కదా అని స్వప్న ధైర్యం ఇస్తుంది. అదే సమయంలో శ్యామ్ వాటర్ కోసం అక్కడినుంచి రాధ గది దగ్గరికి వస్తాడు. ఇక రాధ శ్యామ్ తన మాటలు విన్నాడేమో అని భయపడుతుంది. కానీ శ్యామ్ వారి మాటలు ఏమి వినడు.
మరోవైపు విషం తాగేసి వచ్చాను అని గన్నవరం తన భార్యతో చెప్పుకుంటూ బాగా హడావుడి చేస్తూ ఉంటాడు. ఎలాగైనా తనకు వాంతులు వచ్చేలాగా చేయమని అనడంతో కుంకుడుకాయ పసరు తీసుకొని వస్తుంది వాసంతి. ఇక అది తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు గన్నవరం. అప్పుడే అక్కడికి శిరోజా వచ్చి వీపుల గట్టిగా కొడితే వామిటింగ్ చేసుకుంటాడు అని సలహా ఇస్తుంది.
దానితో ఇద్దరు కలిసి కుమ్ముతారు. వెంటనే దానికంటే కుంకుడుకాయ రసం బెటర్ అని తాగుతాడు. విల్సన్ అక్కడికి వచ్చి తను మందులో ఎటువంటి విషం కలపలేదు అని కావాలని అలా చేశాను అని చెబుతాడు. మరోవైపు పండు స్కూలుకి వెళ్ళను అని సంగీత్ ఫంక్షన్ కి ఉంటాను అని అంటాడు. అప్పుడే స్కూల్ కి సెలవు అని మెసేజ్ రావటంతో ఫంక్షన్ కోసం రెడీ చేస్తాను అని అంటుంది రాధ.
ఇక అప్పుడే శ్యామ్ అక్కడికి వచ్చి నేను రెడీ చేస్తానులే అని పండుని రెడీ చేస్తాడు. మరోవైపు శిరోజా తన భర్త పై ఫైర్ అవుతూ ఉంటుంది. గన్నవరంతో అలా ఎందుకు అబద్దం ఆడావు.. ఏమైనా అవుతే నిన్ను జైల్లో వేస్తారు.. అప్పుడు నేను తట్టుకోగలనా అంటూ ప్రేమ చూపిస్తూ ఉంటుంది. దాంతో విల్సన్ తెగ సంతోష పడతాడు. ఇక సంయుక్త శ్యామ్ కి సర్ ప్రైజ్ చేయాలని కారులో బయలుదేరుతుంది.
also read it: Trinayani August 1st: విశాలాక్షిని ఘోరంగా అవమానించిన తిలోత్తమా.. సుమనపై చిరాకు పడుతున్న విక్రాంత్,
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)