Naga Panchami Serial Today December 19th Episode నాగమణి మోక్షని కాపాడగలదని తెలుసుకున్న పంచమి.. మేఘన మాయలో ఫణేంద్ర!
Naga Panchami Today Episode పంచమి పాముగా మారిన తర్వాత తనతో జత కలవమని ఫణేంద్ర చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today Episode
జ్వాలా, చత్రలు మోహిని గదిలోకి వస్తారు. అక్కడ ఏవో మంత్ర పూజలు చేసినట్లు ఉండటం చూసి షాక్ అవుతారు. మోహిని కూడా నంబూద్రిలా క్షుద్ర పూజలు చేస్తోందిని అనుకుంటారు. ఇక రూం సర్దకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు పంచమి గుడికి వస్తుంది. అక్కడికి మేఘనలా రూపం మార్చుకున్న కరాళి వస్తుంది. మేఘన పంచమిని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది.
మేఘన: శత్రువుని నమ్మించి తన పక్కన చేరగలిగితే సగం విజయం సాధించినట్లే.. ఏదో ఒక విధంగా పంచమిని ఆకట్టుకొని బుట్టలో వేసుకోవాలి. నేను నంబూద్రీ చెల్లెలు కరాళి అని బయట పడకుండా జాగ్రత్త పడాలి.
ఫణేంద్ర: (పంచమి గుడిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫణేంద్ర వచ్చి మాట్లాడుతాడు. వాళ్లని గమనించిన మేఘన వెంటపడుతుంది.) మృత్యుంజయ యాగం జరిపించి చాలా తప్పు చేశావు యువరాణి. నాగదేవత నీ మీద కోపంతో రగిలిపోతుంది యువరాణి.
పంచమి: నాగదేవతకు నా భర్తమీద అంత పగ ఎందుకో నాకు అర్థం లేదు. అన్యాయం జరిగింది నా తల్లికి. ఏమైనా పగ తీర్చుకోవాలి అంటే నేనే తీర్చుకోవాలి. నేనే క్షమించగలిగాను. అలాంటప్పుడు నాగలోకం అంతా మా వెంట పడటం ఎందుకో.
ఫణేంద్ర: చనిపోయింది నీ కన్న తల్లి కావొచ్చు యువరాణి. కానీ ఆమె నాగలోకానికి రాణి. ఆమె చివరి కోరిక తీర్చడం నాగలోకం బాధ్యత.
పంచమి: మీరు ఎంత చెప్పినా ఆ తీర్పును నేను ఒప్పుకోను నా భర్తను నేను కాపాడుకుంటాను.
ఫణేంద్ర: నేను ఇప్పుడు వచ్చింది ఆ కార్యం మీదే యువరాణి. నువ్వు యాగం చేసిన కారణంగా మోక్షని చంపే బాధ్యత నాగదేవత నాకు అప్పగించింది. అందుకు ముహూర్తం కూడా నాగదేవత ఖరారు చేసింది. వచ్చే ఏకాదశి రోజున నేను మోక్షని కాటేసి చంపాలి. మా యువరాణికి ఇలాంటి గతి పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను యువరాణి.
పంచమి: నేను ఏం చేస్తే నా భర్తని నాగలోకం వదిలేస్తుంది యువరాజా.
ఫణేంద్ర: నాగదేవత ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగే లేదు. కానీ నీకు ఒక ఉపశమనం ఉంది. నువ్వు పాముగా మారినప్పుడు యువరాణిగా నువ్వు, యువరాజుగా నేను జత కలిస్తే కలిగే సంతానానికి నాగలోకంలో రాణి పీఠం మీద కూర్చొనే యోగ్యత లభిస్తుంది. అలా చేయగలిగితే నువ్వు అనుభవించలేని రాణి యోగం కనీసం నీ సంతానానికైనా లభిస్తుంది.
పంచమి: అలాంటి ఆశలు పెట్టుకోవద్దు యువరాజా. నన్ను కాటేసి చంపి నా భర్తను బతికించే అవకాశం ఉంటే చెప్పండి. దానికి నేను సిద్ధం.
ఫణేంద్ర: ఈ సారి ఏదో ఒకటి చేసి మోక్షని కాపాడాలి అనుకుంటున్నావేమో.. ఈసారి కాటేసే బాధ్యత నాది.. నేను ఎప్పుడు ఎలా కాటేస్తానో నాకే తెలీదు. ఇష్టరూప నాగుల విషానికి విరుగుడు లేదు. కాటేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. ఒక్క నాగమణి మాత్రమే రక్షించగలదు. ఇంకేం చేసినా ఆ ప్రాణి బతకదు. ఆ నాగమణిని భూలోకానికి తీసుకురావడం ఆసాధ్యం. మోక్షని కాపాడాలి అన్న ఆశని వదిలేసి.. నాతో జతకట్టడం కోసం ఆలోచించు యువరాణి.
ఇక ఫణేంద్ర పాముగా మారి వెళ్తుంటే.. మోహిని ఆ పాముని అడ్డుకుంటుంది. తన మంత్ర శక్తులతో ఫణేంద్ర పాము చుట్టూ అగ్గి వచ్చేలా చేస్తుంది. తర్వాత ఆ అగ్గిని ఆర్పేస్తుంది.
ఫణేంద్ర: ఎవరు నువ్వు నా దారికి ఎందుకు అడ్డుగా వచ్చావు.
మేఘన: క్షమించండి యువరాజా.. నేనొక నాగ కన్యను. నా పేరు మేఘన.
ఫణేంద్ర: నువ్వు ఇష్ట రూప నాగ కన్యవా..
మేఘన: అవును యువరాజా.. మన యువరాణికి రక్షణగా వచ్చిన నాగకన్యలో నేను ఒకదాన్ని.. ఒక చిన్న తప్పిదం వల్ల నాగదేవత ఆగ్రహానికి గురై శక్తులు కోల్పోయి.. మానవ రూపంలో ఈ భూలోకంలోనే ఉన్నాను.
ఫణేంద్ర: నన్ను గుర్తించావు అంటే నువ్వు ఇష్ట రూప నాగ కన్యవే.
మేఘన: ఇక వీడు నా వలలో పడినట్లే.
ఫణేంద్ర: కానీ నీకు మంత్ర శక్తులు తెలిసినట్లున్నాయి. మన ఇష్ట రూప జాతులకు అలాంటి విద్యలు తెలీవు కదా. ఆ విద్యను ఎలా ప్రయోగించావో చెప్తే నువ్వు నాగకన్యవో కాదో నేను చెప్తాను.
మేఘన: మనసులో.. అనుకున్నట్లు గానే మంత్ర శక్తి ఉపయోగించి దొరికిపోయాను. అది చాలా పెద్ద కథ యువరాజా.. అదంతా మీకు తర్వాత చెప్తాను. అప్పటి నుంచి నేను ఇక్కడే మన యువరాణికి తెలీకుండా రహస్యంగా తనని అనుసరిస్తున్నాను. ఎవరో ఒకరి మన నాగలోకం నుంచి యువరాణి కోసం రాకుండా పోతారా అని ఎదురు చూస్తున్న నాకు అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. నాకు మన యువరాణి గురించి మొత్తం తెలుసు యువరాజా. తన తల్లిని చంపిన శత్రువల్లో ఒకరైన నంబూద్రీని చంపేసినప్పుడు చాలా మంది నాగకన్యలతో పాటు నేను కూడా మన యువరాణికి రక్షణగా ఉన్నాను.
ఫణేంద్ర: కానీ రెండో శత్రువు అయిన మోక్షని చంపడానికి యువరాణి ససేమిరా అంటుంది.
మేఘన: ఈ భూలోకంలో భార్య భర్తల బంధం చాలా గట్టిగా ఉంటుంది యువరాజా. పాపం మన యువరాణి ఆ బంధం లో చిక్కుకొని బాగా ఇబ్బంది పడుతుంది. ఈ భూలోకంలో ఉండి నేను చాలా తెలుసుకున్నాను యువరాజా. మీరు యువరాణి నాగలోకం తీసుకెళ్లడానికి నేను సాయం చేస్తా.
ఫణేంద్ర: ఆ అవకాశం లేకుండా పోయింది యువరాణి నాగదేవత ఆగ్రహానికి గురై నాగలోక ప్రవేశాన్ని పోగొట్టుకుంది.
మేఘన: మీరు తలచుకుంటే కాని కార్యం ఏముంటుంది యువరాజా. నాగ దేవతకు చెప్పి మీరు ఒప్పించగలరు. ముందు మన యువరాణి మీతో పాటు నాగలోకానికి రావడానికి సరే అనిపిస్తే మిగిలినవన్నీ సవ్యంగా జరిగిపోతాయి. మీరు నాతో రండి యువరాజా.. యువరాణిని మీతో పంపించే బాధ్యత నాది. (పూర్తిగా నమ్మేశాడు వీడిని ఇంక వదలకూడదు.)
మరోవైపు హాల్‌లోకి వైదేహి ఇంట్లో అందరిని పిలుస్తుంది. మృత్యుంజయ యాగంతో మోక్షకు ఉన్న అన్ని గండాలు తొలగిపోయాయి అని అంటుంది. యాగం తర్వాత అన్ని మరణ గండాలు తొలగిపోతాయి అని స్వామిజీ చెప్పారని అంటుంది వైదేహి. ఇక మోక్ష, పంచమిలు హాయిగా కాపురం చేసుకోవాలి అని చెప్తుంది. నెల తిరిగే లోపు శుభవార్త చెప్పాలి అని అంటుంది. దీంతో పంచమి షాక్ అవుతుంది. ఇక చిత్ర అయితే మోక్ష, పంచమిలు గండాల కోసం దూరంగా లేరని.. వాళ్లు కలిస్తే మోక్ష చనిపోతాడని భయపడుతున్నారని చెప్తుంది. మోక్షకు తన మనసులో బాధలు చెప్పేయ్ మని అంటుంది. అప్పుడే అత్తయ్య నీకు ఇంకో పెళ్లి చేస్తుందని చిత్ర అంటుంది. దానికి శబరి వాళ్లను తిడుతుంది. అయితే వైదేహి మాత్రం అవసరం అయితే ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.