అన్వేషించండి

Naga Panchami Serial Today December 15th Episode - 'నాగ పంచమి' సీరియల్: మోక్షని వశం చేసుకునేందుకు రూపం మార్చుకున్న కరాళి - నాగదేవత కఠిన నిర్ణయం!

Naga Panchami Today Episode - మోక్షని తన వశం చేసుకోవడానికి మహాంకాళి కరాళి రూపం మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Naga Panchami Serial Today Episode 

మోక్ష: నా అదృష్టం అని చెప్పాలో.. లేక అదో అద్భుతం అని చెప్పాలో తెలియడం లేదు. 
మోక్ష తండ్రి: ఏంటి మోక్ష మళ్లీ ఆపాము నీ వెంట పడిందా.. 
మోక్ష: ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఎవరైనా నాకు చెప్పినా నేను నమ్మను. కానీ నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టే చెప్తేన్నాను. రాత్రి నా వెంట పడి కాటేయడానికి వచ్చిన పాము మామూలు పాము కాదు. ఐదు తలల పాము. ఆ ఐదు తలల పాము కూడా చాలా పెద్దది. దాన్ని చూడగానే నా గుండె ఆగిపోయింది అనుకున్నాను. కానీ తెల్లవారి పంచమి నన్ను లేపితే గానీ నాకు బతికున్న విషయం తెలీలేదు. 
సాధువు: అలాంటి ఐదు తలల పామును చూడగలగడం కూడా ఆదృష్టమే బాబు. ఎవరికో కానీ అలాంటి దర్శన భాగ్యం కలగదు. 
శబరి: నువ్వు అబద్ధం చెప్పవు అని తెలుసు నాన్న కానీ నువ్వు చెప్తుంటే నమ్మశక్యం కావడం లేదు. 
మోక్ష: నిజం శబరి.. నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా.. నన్ను కాపాడటానికి ఆదేవుడే మన ఇంటికి పంచమిని పంపించాడు అని అది అబద్ధం కాదు శబరి. పంచమి లేకపోతే నేను లేను. 
శబరి: అమ్మా పంచమి.
పంచమి: నాదేం లేదు బామ్మ నా కళ్లముందు ఏం జరిగినా నేను ఏం చూసినా.. అది శివయ్య ఆజ్ఞ అని నమ్ముతాను.
శబరి: ఆ నమ్మకం చాలమ్మా.. శివయ్యే నీ ద్వారా నా మనవడిని కాపాడటానికి పంపించుంటాడు. ఎప్పటికీ నువ్వు నా మనవడి చేతిని వదిలిపెట్టకూడదమ్మా. ఎప్పటికీ నా మనవడి రక్షణ బాధ్యత నీదే. నువ్వే తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ నా మనవడిని కాపాడలేరమ్మా. నువ్వే వాడికి శ్రీరామ రక్ష అంటూ మోక్ష చేతిని పంచమి చేతిలో పెడుతుంది.
మోక్ష: నాకు ఒకటి మాత్రం అర్థమైంది. ప్రతీ పౌర్ణమికి ఆ పాము ఏదో ఒక రూపంలో నా వెంట పడి నన్ను కాటేయాలి అని ప్రయత్నిస్తుంది. ఇక మీద కూడా అలా జరుగుతూనే ఉంటుంది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ పాము నన్ను వదిలిపెట్టదు. ఆ పాము పగ నుంచి నేను తప్పించుకున్న ప్రతీ పౌర్ణమి నాకు పునర్జన్మలాంటిదే. అది ఎంతకాలం అలా కొనసాగుతుందో.. ఎక్కడ ఆగిపోతుందో నాకు తెలీదు. అందుకు అందరూ సిద్ధపడి ఉండాల్సిందే.. 
మోక్షపిన్ని: నువ్వే అలా అధైర్య పడితే ఎలా మోక్ష.. అవసరమైతే ప్రతీ పౌర్ణమికి మృత్యుంజయ యాగం జరిపిద్దాం.
నాగసాధువు: అవసరం లేదు తల్లీ.. ఎప్పుడు ఎక్కడ ఎలా తన భర్తను కాపాడుకోవాలో పంచమికి బాగా తెలుసు.. అమ్మా పంచమి ఎప్పుడు ఏం చేయాలో ఆ శివయ్య నీకు ఏదో ఒక స్ఫూర్తిని కలిగిస్తాడు. ఆ స్ఫూర్తిని గుర్తించి నువ్వు అలా నడుచుకో తల్లీ నీకు అంతా మంచే జరుగుతుంది.
పంచమి: అలాగే స్వామి.
మోక్ష: మీ మేలును మర్చిపోలేను స్వామి. ఈలోకానికి నా లాంటి వాడికి మీలాంటి సాధువులు చాలా అవసరం.
నాగసాధువు: బిడ్డకు తల్లి.. భార్యకు భర్త.. ఇంటికి యజమాని.. లోకానికి దేవుడు రక్షణగా ఉంటారు. మన విధి దేవుణ్ని నమ్మడం ప్రార్ధించడం.. మనకు ఏం కావాలో.. మనకు ఏం చేయాలో ఆ సర్వాంతర్యామి అయిన శివుడే చూసుకుంటాడు.. క్షేమంగా వెళ్లి రండి.. ఇక నేను బయలుదేరుతాను.
మోక్ష: అవును సుబ్బు కనిపించడం లేదు.
పంచమి: తను వాళ్ల ఊరు వెళ్లిపోయాడు.. సుబ్బు గురించి భయం అవసరం లేదు. తనే ఒక ధైర్యం తనకి ఎవరి సాయం అవసరం లేదు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లగలడు. రాగలడు.. అందుకే ఒంటరిగా పంపించాను.
వైదేహి: మనతో పాటు మోహినిని కూడా తీసుకొచ్చాం కదా.. తనెక్కడ?
మోక్ష: తను వెళ్లిపోయింది అని పంచమి చెప్పింది. 
పంచమి: ఈఅడవుల్లో ఏవో కొత్త కొత్త మూలికలు దొరుకుతాయంట అవి తనకు చాలా ఉపయోగపడతాయి అంట. వాటితో ప్రయోగం చేయాలి రావడానికి చాలా కాలం పట్టొచ్చు అని చెప్పి వెళ్లిపోయింది.  

కరాళి ఓ చోట కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ పంచమి తనని బెదిరించిన సంఘటన గుర్తుచేసుకుంటుంది. ఇక మహాంకాళిని ప్రత్యక్షమవ్వమని ప్రాధేయపడుతుంది. 
కరాళి: అమ్మా మహాంకాళి నేను నా  సర్వశక్తులన్నీ ఉపయోగించి పోరాడుతున్నాను. కానీ ఏదో శక్తి నన్ను అడ్డుకుంటోంది. నేను ఇప్పుడు పంచమి దగ్గర నీ భర్తను నీకు దక్కనివ్వను అని ప్రగల్భాలు పలికి వచ్చాను. దానిని నిజం చేయాలి మహాంకాళి. నువ్వు ప్రత్యక్షం అవ్వు మహాంకాళి.. నువ్వు ప్రత్యక్షమై ఏదో ఒక మార్గం చూపించకపోతే నా పరువు పోతుంది. ఆ పంచమిని వంచిచకపోతే నేను ఆ నాగమణిని సంపాదించకపోతే ఇక ఈ కరాళి జీవితం వృథా. రెండు క్షణాల్లో నువ్వు ప్రత్యక్షం అవ్వకపోతే.. మూడో క్షణంలో నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ భక్తురాలి చావుకి నువ్వే కారణం అవుతావు.. ఇక కరాళి కొండ మీద నుంచి కిందకి దూకేయబోతే.. 
మహాంకాళి: ఆగు కరాళి.. ఈ భూమ్మీద నీకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్లే ఐదు తలల పాము నుంచి నువ్వు బతికి బయటపడ్డావు కరాళి. నీకు ఆయుష్షు ఉన్నంత వరకు మృత్యువు నీ దరి చేరదు. అంత వరకు నువ్వు చావాలి అనుకున్నా చావలేవు.
కరాళి: బతికుండి నేను చేయగలిగిందేమీ లేదు. నన్ను నువ్వే చంపేయ్ మహాంకాళి చంపేయ్.. 
మహాంకాళి: చెప్పాను కదా కరాళి నీకు నూకలు చెల్లే వరకు ఎంత ప్రయత్నించినా చావలేవు అని.. అయినా నీకు ఎన్నో వరాలు ప్రసాదించాను. కానీ నువ్వే వినియోగించుకోలేపోయావు. 
కరాళి: చివరి సారిగా అడుగుతున్నాను తల్లీ పంచమిని జయించడానికి కావాల్సిన ఒక వరం ఇవ్వు.
మహాంకాళి: గెలుపోటములు నాకు సంబంధం లేవు కరాళి. నువ్వు చివరి సారి అంటున్నావు కాబట్టి నీకు ప్రస్తుతం ఉపయోగపడే ఓ శక్తిని ప్రసాదిస్తాను. ఈ రూపంతో నువ్వేమీ సాధించలేకపోయావు. మోక్షని ఆకర్షించాలి అనే నీ కోరిక ఈరూపంతో నెరవేరదు. అందుకే కరాళి నువ్వు కోరుకున్న రూపం నీకు వస్తుంది. కానీ అది ఒక రూపమే. అది కూడా ఒక్క సారే.  ఆ రూపం నువ్వు ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు మళ్లీ నువ్వు యధాప్రకారం ఈ రూపంలోకి రాగలవు. నీకు ఎంత అందమైన రూపం కావాలో ఎలా ఉంటే నువ్వు మోక్షని ఆకర్షించగలవో నువ్వే ఊహించుకో.. ధ్యానంలో కూర్చొని నువ్వు కోరుకునే రూపాన్ని నువ్వు తలచుకో.. అప్పుడు నీ రూపం మారిపోతుంది. 
కరాళి: (ధ్యానం చేయడంతో రూపం మారిపోతుంది) మేనక లాంటి రూపం కావాలి అనుకున్నాను. వచ్చేసింది.. పంచమి వచ్చేస్తున్నా.. ఇక నువ్వు మోక్షని మర్చిపో..

మరోవైపు నాగలోకంలో నాగదేవత సమావేశం ఏర్పాటు చేస్తుంది. 
ఫణేంద్ర: మేము మా శాయశక్తులా ప్రయత్నించాం మాతా.. ప్రాణాలకు తెగించి కూడా లోపలికి వెళ్లాలని చూశాం. కానీ యాగశాల లోపలకి ఎవ్వరు కూడా వెళ్లకుండా మంత్రి శక్తితో బంధనం వేశారు మాతా.
నాగదేవత: అదంతా మన యువరాణి ఆలోచనే అయ్యుంటుంది. మనం మన యువరాణిని చాలా తక్కువ అంచనా వేసి మోసపోయాం.
ఫణేంద్ర: మోక్షని కాపడటం కోసం తను ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తుంది మాతా.. మోక్షని కాటేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పౌర్ణమి రోజు యువరాణి పాముగా మారుతుంది. 
నాగదేవత: మానవ రూపంలో ఉండగా యువరాణి మనసు మార్చడం అసాధ్యం అని తెలిసిపోయింది. మోక్ష కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడింది అంటే యువరాణి మనసులో మచ్చుకు కూడా మన నాగజాతి ఆలోచనలు లేవు. అందుకే నాగ జాతి అన్నా నాగలోకం అన్నా తనకు ఏ మాత్రం గౌరవం లేదు. మనల్ని మన లోకాన్ని మోసం చేయటానికి యువరాణి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇక ఏమాత్రం తన మాటలు చేష్టలు నమ్మకూడదు. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం నన్ను చూసి భయం నటిస్తుందే తప్ప నేనంటే భక్తి కానీ భయం కానీ యువరాణికి లేవు. ఇంకా తన మీద జాలి చూపించి ఉపేక్షించడం అనవసరం. 
ఫణేంద్ర: నేను భూలోకంలో తనతోనే ఉండి తన ఆలోచనల్ని ముందుగా పసిగట్టి చెప్తాను మాతా.. దాన్ని బట్టి మనం తనకన్నా ముందు మోక్షని కాపాడటానికి యువరాణి తీసుకొనే ప్రయత్నాల్ని విఫలం చేద్దాం. 
నాగదేవత: ప్రయోజనం లేదు యువరాజా.. తనలో ఏ కోశానా తను ఓ పాము అన్నది లేదు. తనని మార్చి తీసుకురావడం కష్టం. 
ఫణేంద్ర: యువరాణి పాముగా మారగానే.. మూర్చపోయేలా చేసి బంధించి తీసుకొస్తాను మాతా
నాగదేవత: మరి తను మోక్షని కాటేసి చంపాలి కదా.. ఏం చేద్దాం.. మహా రాణి చివరి కోరిక కూడా తీర్చలేకపోతే ఆ మచ్చ ఇష్టరూప నాగ జాతి మీద బలమైన ముద్ర వేస్తుంది. ఆ అవమానం కలకాలం నాగజాతి, నాగలోకం భరించాలి. ఈ ఒక్క కారణం చేత ఆలోచిస్తున్నా యువరాజా
ఫణేంద్ర: నా మాటలకు యువరాణి భయపడకపోగా నన్నే ఎదురించి మాట్లాడుతుంది మాతా. 
నాగదేవత: రాణీ రక్తం యువరాజా.. ఆ రక్తంలో ధైర్యం తప్ప భయం కనపడదు. యువరాణి విషయంలో ఎన్నో ఉపాయాలు ప్రయోగించి చూశాం. అయినా తను మన దారికి రాలేదు. చూద్దాం.. అసలు యువరాణి ఆలోచనలు ఏంటో నేను క్షుణ్నంగా తెలుసుకొని ఒక నిర్ణయం ప్రకటిస్తాను. అదే అమలు చేద్దాం..

మరోవైపు తమ భర్తలు సంతోషంగా ఎవరితోనో ఫోన్లలో మాట్లాడటం చూసి ఏంటి ఇలా ఫోజులు కొడుతున్నారని అనుకుంటారు జ్వాలా, చిత్రలు. ఇక ఈ పౌర్ణమికి కూడా ఆ పాము మోక్షను ఎందుకు కాటేయలేదని తెగ బాధ పడిపోతారు. ఇంతలో మోక్ష ఫ్యామిలీ మొత్తం ఇంటికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : స్వప్నను కాపాడిన అపర్ణ - రాజ్‌కు షాక్ ఇచ్చిన శ్వేత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget