Meghasandesham Serial Today September 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన అపూర్వ – గగన్ కాళ్లు పట్టుకున్న నక్షత్ర
Meghasandesham Today Episode: నక్షత్రను క్వారీ దగ్గరకు తీసుకెళ్లిన రౌడీలు చంపబోతుంటే వాళ్ల నుంచి తప్పించుకుని పరిగెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Meghasandesham Serial Today September 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన అపూర్వ – గగన్ కాళ్లు పట్టుకున్న నక్షత్ర meghasandesham serial today episode September 22nd written update Meghasandesham Serial Today September 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన అపూర్వ – గగన్ కాళ్లు పట్టుకున్న నక్షత్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/22/6470115e684f93cd643258a2d1b21b9e1726967411487879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meghasandesham Serial Today Episode: డాక్టర్ దగ్గరకు వెళ్లాలనకుని అపూర్వ వెళ్లి కారు ఎక్కగానే భూమి వచ్చి కారు ఎక్కుతుంది. నువ్వు ఆ కారులో వెళ్లలేదా? అని అపూర్వ అడుగుతుంది. నీ కూతురు ఎక్కనిస్తేగా నన్ను ఆటోలో వెళ్లమని డబ్బులు ఇచ్చింది అని చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. రౌడీలకు ఫోన్ చేయబోయి ఇది చూస్తుంది అని ఆగిపోతుంది. మరోవైపు రౌడీలు ఒక క్వారీ దగ్గర కారు ఆపి నక్షత్రను చంపేద్దామనుకుంటారు. అపూర్వ ఫోన్ చేసినా రౌడీలు లిఫ్ట్ చేయరు. ఈ అమ్మాయిని చంపేసి అప్పుడు మేడంకు ఫోన్ చేద్దామంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్, శారదకు ఫోన్ చేస్తాడు.
ప్రసాద్: శారద ఫోటో పంపాను చూశావా?
శారద: చూస్తున్నానండి. మొత్తానికి ఇందు పెళ్లి పనులు మొదలయ్యాయన్నమాట.
ప్రసాద్: అవును ముందు నేను పెళ్లి పనులు చేస్తానంటే వద్దన్న ఇందు తర్వాత ఏం జరిగిందో ఏంటో సరే అంది. అందుకే తండ్రిగా పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నాను.
శారద: తెలియక చిన్నపిల్ల తను ఏదో మాట్లాడినా ఆడపిల్ల పెళ్లి అంటే తండ్రి లేకుండా ఎలా అండి.
ప్రసాద్: శారద ఆరోజు నువ్వు గుడిలో చెప్పిన మాట విని నేను ఇంటికి రావడం మంచిదైంది. నేను లేకపోయి ఉంటే ఆసలు ఈ ఇంట్లో పెళ్లిపనులు ఆగిపోయేవి.
శారద: ఆవేశం ఎప్పుడూ మనిషితో తప్పు చేయిస్తుంది.
ప్రసాద్: అవును ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు కానీ గగన్, పూర్ణిమ విషయంలోనే నేను ఏమీ చేయలేకపోతున్నాను
అంటూ ప్రసాద్ చెప్పగానే.. గగన్ పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను కానీ వాడు ఒప్పుకోవడం లేదని శారద చెప్తూ.. ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు కారులో వెళ్తున్న అపూర్వను ఒక దగ్గర కారు ఆపమని అడుగుతుంది భూమి. అపూర్వ కారు ఆపి తనే షాపులోకి వెళ్లి వాటర్ తీసుకోస్తానని చెప్పి వెళ్లి రౌడీలకు ఫోన్ చేస్తుంది. వాళ్లు లిప్ట్ చేయరు. ఇంతలో భూమి కారు దిగి వస్తుంది.
భూమి: ఏంటీ మంచినీళ్లు తీసుకొస్తానని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నావు.
అపూర్వ: ఏయ్ నీకు నీళ్లు తీసుకురావడానికి నేనేమైనా నీ పనిమనిషినా..?
భూమి: ఏంటి అంకుల్ కు ఫోన్ చేయాలా?
అపూర్వ: చేస్తే చేసుకోవే అవతల నా కూతురికి ఏమైందోనని టెన్షన్ తో చస్తుంటే మధ్యలో నీ గోల ఎంటి?
భూమి: నీ కుతురికి ఏమైంది..?
అపూర్వ: నా ఖర్మే నా ఖర్మ నిన్ను కిడ్నాప్ చేయమని రౌడీలను పంపిస్తే నా కూతురిని కిడ్నాప్ చేశారు.
భూమి: ఏంటీ మళ్లీ నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశావా?
అపూర్వ: అవును ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఎలా ఉందోనని నేను కంగారు పడుతుంటే నీకు సేవలు చేయాలా? నా వల్ల కాదు.
అంటూ కారు దగ్గరకు పరెగెత్తుతుంది అపూర్వ. టెన్షన్‌తో కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లోపలి నుంచి వచ్చిన భూమి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావన్నమాట అనుకుంటుంది. మరోవైపు క్వారి దగ్గర నీళ్లలో ముంచి నక్షత్రను చంపాలనుకుంటారు రౌడీలు వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుంది నక్షత్ర. క్వారీ పక్కనే గగన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్ర గగన్ దగ్గరకు వెళ్లి వాళ్లు నన్ను చంపేస్తారు ప్లీజ్ కాపాడు అంటూ కాళ్లు పట్టుకుని బతిమాలుతుంది. దీంతో గగన్ రౌడీలను కొడుతుంటాడు. ఫైటింగ్ లో గగన్ వెళ్లి నక్షత్మ మీద పడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)