Meghasandesam Serial Today September 4th: ‘మేఘసందేశం’ సీరియల్: బ్యాచిలర్ పార్టీలో ఉదయ్‌కి షాక్ - గగన్ ను హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్పిన భూమి
Meghasandesam serial today episode September 4th: బ్యాచిలర్ పార్టీలో ఉదయ్ ముందే గగన్ ను హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉండటం చూసిన రత్న మెల్లగా గగన్ రూంలోకి వెళ్తుంది. అప్పుడే గగన్ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంటాడు. గగన్‌ను చూసి పక్కన దాక్కుంటుంది. గగన్ బాత్రూంలోకి వెళ్లాక ఒక సంచి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న బొమ్మను సంచిలో వేసుకుని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్లిన రత్నను పూర్ణి చూస్తుంది.
పూర్ణి: ఏయ్ ఆగు.. ఎక్కడికి వెళ్తున్నావు.. చేతిలో ఆ మూటేంటి..?
రత్న: అంటే నా బట్టల బ్యాగు తెగిపోయింది అమ్మా.. బ్యాగులో ఉన్న బట్టలన్నీ దీనిలో వేసుకుని మూట కట్టుకుని తీసుకెళ్తున్నాను.
పూర్ణి: ఎక్కడికి తీసుకెళ్తున్నావు..?
రత్న: ఏంటి మేడం అనుమానిస్తున్నారా..?
పూర్ణి: అనుమానించక.. స్వీట్ బాక్స్ ఇచ్చి సాగనంపమంటావా..? నువ్వేదో పట్టుకెళ్తున్నావని నాకేదో డౌటుగా ఉంది. అమ్మా శివ ఇలా రండి..? ముందు మూట విప్పవే..
శారద: పూర్ణి ఏమైందే..?
రత్న: రండి మేడం రండి.. మీ అబ్బాయేమో తాగరు, తినరు.. ఆయనొక పనికిమాలినోడు
శారద: రత్నం నా కొడుకును ఏమైనా అన్నావంటే చంపేస్తాను.
రత్న: అబ్బా చంపేసంత చెడ్డ గుణమే ఉంటే అందుకోసమైనా మీ ఇంట్లోనే ఉండేదాన్ని మీ మంచితనం తగలెయ్య..
పూర్ణి: ఏంటే మా అమ్మను అంటున్నావు..?
రత్న: మీ అమ్మనేంటి..? నిన్ను అంటాను. ఎన్ని ఇలాంటి పెద్ద ఇళ్లల్లో పని చేయలేదు. ఏ ఇంట్లో చూసినా నీలాంటి వయసుకు వచ్చిన పిల్లలు ఫోన్లలో ఇక ఇకలు పకపకలు అబ్బాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడాలు.. మరి నువ్వు ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందర వేసుకుని చదవడం రుబ్బు రోలులా..? నోరు ఆడించడం..
శివ: ఏయ్ రత్నం చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు..
రత్న: నువ్వు నోరు ముయ్ రా అబ్బాయి. నువ్వే చెప్పావు కదా...? ఈ ఇంటికి నువ్వు అదనపు బరువు అని అదనంగా మాట్లాడకు.
శారద: రత్నం నిజంగానే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. వెళ్లిపో.. పో ఇక్కణ్నుంచి..
రత్న: ఇలాంటి కొంపలో ఎవడమ్మా పని చేసేది.. వెళ్దామనే మూట కట్టుకున్నాను.. ఏదో పట్టుకు వెళ్తున్నానని మీ అమ్మాయి పట్టుకుంది.
పూర్ణి: అమ్మా నిజంగానే ఇది ఏదో పట్టుకు వెళ్తుందని అనుమానంగా ఉంది.
రత్న: ఆ పట్టుకుపోతున్నాను మీ డబ్బు మీ దస్కం..చూస్కో..
అంటూ సగం పైన ఉన్న తన చీరలు తీసి కింద పడేస్తుంది.
పూర్ణి: ఇంకా ఏం తీసుకెళ్తున్నావో నేను చూస్తాను..
అంటూ సంచి తెరచి చూడబోతుంది.
శారద: ఆగు పూర్ణి
పూర్ణి: అమ్మా..
శారద: అలాంటి మనుషుల వస్తువులు నువ్వు చూడొద్దు..
పూర్ణి: అమ్మా.. చూస్తాను..
శారద: ఏం పట్టుకుపోతుంది. మహా అయితే నీవి నావి నాలుగు జతల బట్టలు పట్టుకుపోతుంది. పోవే మళ్లీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే చంపేస్తాను.
రత్న: ఆ మరెక్కడా ఇండ్లు లేనట్టు మీ ఇంటి చుట్టే తిరుగుతానా..?
అంటూ బయటకు వెళ్లిపోయి అపూర్వకు ఫోన్ చేసి అమ్మగారు బొమ్మతో బయటకు వచ్చేశాను. ఎక్కడ కలవాలో చెప్పండి అని అడుగుతుంది. దీంతో అపూర్వ లోకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయ్ అని చెప్తుంది. సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. మరోవైపు ఉదయ్ ఇస్తున్న బ్యాచిలర్ పార్టీకి గగన్ ను పిలుస్తాడు. పార్టీకి గగన్ వెళ్తాడు. అక్కడ అందరి ముందు భూమి ఎమోషనల్ అయి వెళ్లి గగన్‌ను హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్తుంది. దీంతో ఉదయ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















