Meghasandesam Serial Today September 3rd: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్ర కాళ్ల మీద పడ్డ ఉదయ్ - భూమిని తిట్టిన శరత్ చంద్ర
Meghasandesam serial today episode September 3rd: ఉదయ్‌తో బ్యాచిలర్ పార్టీకి వెళ్లనని భూమి చెప్పగానే.. శరత్ చంద్ర వచ్చి భూమిని కన్వీన్స్ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బిందు రోడ్డు మీద నిలబడి కాలేజీకి వెళ్లడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటో ఈ రోజు ఒక్క క్యాబ్ బుక్ కావడం లేదని ఆలోచిస్తుంది. ఇంతలో సైకిల్ మీద కాలేజీకి వెళ్తుంటాడు శివ. బిందును చూసి దగ్గరకు వెళ్తాడు.
శివ: హలో అండి హాయ్.. మీరేంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు..?
బిందు: కారేమో రిపేరుకు వెళ్లింది. క్యాబ్ బుక్ అవ్వడం లేదు.
శివ: సరే నేను మీ ఇంటి దగ్గర వరకు లిఫ్ట్ ఇస్తాను. రండి..
బిందు: ఈ సైకిల్ మీద.. ఎవరైనా చూస్తే బాగుండదు… పైగా మన ఫ్యామిలీస్ ఎనిమీ ఫ్యామిలీస్ మీకు ఫుడ్ ఉండదు.
శివ: చూస్తేనే కదా ప్రాబ్లమ్.. ఎవ్వరూ చూడరు కానీ వచ్చి కూర్చోండి..
అని శివ చెప్పగానే.. బిందు సైకిల్ మీద కూర్చుంటుంది. ఇద్దరూ కలిసి సైకిల్ మీద వెళ్తుంటే.. ఆ పక్కనే టిఫిన్ సెంటర్ లో ఉన్న పూర్ణి చూస్తుంది. ఈ పొట్టిది ఏంటి శివ సైకిల్ ఎక్కి వస్తుంది. చెప్తా అంటూ ఫోన్‌లో వీడియో తీస్తుంది పూర్ణి. మరోవైపు ఉదయ్ ప్లాన్ ప్రకారం భూమి దగ్గరకు వెళ్తాడు. ఎలాగైనా భూమిని పబ్‌కు తీసుకెళ్లాలనుకుంటాడు. అందుకోసం బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నట్టు చెప్పాలనుకుంటాడు.
ఉదయ్: ఇవాళ నైట్ మనం బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాం.
భూమి: మనం ఏంటి.. కావాలంటే మీరు ఇచ్చుకోండి..
ఉదయ్: ఇది మన పెళ్లి బ్యాచిలర్ పార్టీ.. నువ్వు లేకపోతే ఎలా అవుతుంది.
భూమి: అలాంటి పార్టీలు అంటే నాకు అసహ్యం.. నేను రాను..
అంటూ భూమి కరాకండిగా చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఉదయ్ ఏం చేయాలో అర్థం కాక వెంటనే అక్కడే ఉన్న శరత్ చంద్ర కాళ్ల మీద పడతాడు. ఎందుకు ఈ పని చేస్తున్నావు అల్లుడు గారు అంటూ శరత్ చంద్ర అడిగినా ఉదయ్ కాళ్ల మీద నుంచి లేవడు. దీంతో ఏంటో చెప్పండి బాబు నేను మాటిస్తున్నాను అంటాడు శరత్ చంద్ర. అడిగాక కాదనకూడదు అంటాడు ఉదయ్.
శరత్: ముందు మీరు లేవండి..
ఉదయ్: మీరు ఒట్టేసి మాటిస్తే తప్పా నేను లేవను మామయ్యగారు. బ్యాచిలర్ పార్టీలో భూమిని అందరికీ పరిచయం చేస్తానని మా ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. కానీ ఆ పార్టీకి భూమి రానంటుంది. పార్టీకి వచ్చేలా ఎలాగైనా భూమిని మీరే ఒప్పించాలి.
శరత్: అయ్యో అంతేనా.. ఇంత దానికే మీరు కాళ్లు పట్టుకోవడం ఏం బాగాలేవు అల్లుడు గారు.. నేను భూమిని నీతో పాటు పార్టీకి పంపిస్తాను నువ్వు అయితే ముందు కాళ్ల మీద నుంచి లేవు..
ఉదయ్: మీరు మాటిచ్చాక సరే
అంటూ ఉదయ్ లేస్తాడు. వెంటనే శరత్ చంద్ర, భూమిని పిలుస్తాడు. భూమి వస్తుంది. ఉదయ్ నవ్వుతూ భూమిని చూస్తుంటాడు.
శరత్: రా భూమి.. నువ్వు పెరిగిన వాతావరణం నీకు ఇష్టాఇష్టాలు నేర్పించింది. ఇష్టం లేని చోటుకు వెళ్లడం కష్టమే కానీ ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి మధ్య తేడా నువ్వు తెలుసుకోవాలి కదా..? నువ్వు ఉదయ్‌తో బ్యాచిలర్ పార్టీకి వెళ్లాలి..
భూమి: కానీ అది కాదు నాన్నా…
శరత్: నువ్వు ఇంకేం చెప్పొద్దు భూమి.. అల్లుడి గారితో నువ్వు బ్యాచిలర్ పార్టీకి వెళ్లక తప్పదు.
అని శరత్ చంద్ర కరాకండిగా చెప్పగానే.. భూమికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. ఉదయ్ మాత్రం హ్యాపీగా నవ్వుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!






















