అన్వేషించండి

Meghasandesam Serial Today September 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: స్పృహలోకి వచ్చిన శారద – భూమికి నిజం చెప్పిన శారద  

Meghasandesam serial today episode September 29th: ఐసీయూలో  ఉన్న శారద భూమికి నిజం చెప్తుంది. గగన్‌కు చెప్పమంటే భూమి వద్దంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Meghasandesam Serial Today Episode: తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో దేవుడి గుడిలో ముడుపు కట్టిన గగన్‌ అక్కడి నుంచి హాస్పిటల్‌కు వచ్చి తాను తీసుకొచ్చిన విబూది శారద నుదుటిన పెట్టి ఎమోషనల్‌ అవుతుంటాడు.

గగన్: ఇక నీకేం కాదు అమ్మ నిన్ను చూసుకోవడానికి ఆ శివుడు ఉన్నాడు. ( ఇంతలో డాక్టర్‌ వస్తుంది) డాక్టర్‌ మా అమ్మకు ఏమీ కాదుగా.. చెప్పండి డాక్టర్‌..

డాక్టర్‌: మీరు కాసేపు బయట ఉండండి చూసి చెప్తాను.

అనగానే భూమి, గగన్‌ బయటకు వెళ్తారు. డాక్టర్‌ చెక్‌ చేసి బయటకు వెళ్తుంది.

డాక్టర్‌: గగన్‌ గారు ఇక మీ అమ్మ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మీరేం కంగారు పడకండి తనకు ఏ క్షణంలోనైనా స్పృహ రావొచ్చు

అని డాక్టర్‌ చెప్పగానే.. గగన్‌ ఎమోషనల్‌ అవుతూ డాక్టర్‌కు థాంక్స్‌ చెప్తాడు. తర్వాత ఐసీయూలో ఉన్న శారదకు స్పృహ వస్తుంది. పక్కనే పడుకుని ఉన్న భూమి లేచి చూసి హ్యాపీగా ఫీలవుతుంది. అత్తయ్యా మీరు చూస్తున్నారా..? అంటూ సతోషంగా గగన్‌కు చెప్పాలనుకుంటుంది.

భూమి: అత్తయ్యా ఇప్పుడే నేను వెళ్లి బావను తీసుకొస్తాను..

అంటూ భూమి బయటకు వెళ్లబోతుంటే.. శారద భూమి చేయి పట్టుకుని ఆపేస్తుంది. దగ్గరకు రా అంటూ సైగ చేస్తుంది. దీంతో దగ్గరకు వెళ్తుంది భూమి.

భూమి: ఏంటి అత్తయ్యా చెప్పండి.. అయినా బావను తీసుకొస్తాను.. ఆగండి.. ఇద్దరికి చెబుదురు ఆ విషయం..

శారద: ముందు నీకు చెప్పాలి భూమి… తర్వాత గగన్‌కు చెబుదాం..

భూమి: అయితే ఏంటో చెప్పండి అత్తయ్యా.. మెల్లగా జాగ్రత్త

శారద: ఏమీ కాదులో భూమి.. మీ అమ్మ ఫైర్‌ యాక్సిడెంట్‌ లో మరణించలేదు భూమి.. అసలు తనది మామూలు చావు కాదు.. ఘోరంగా చంపేశారు.. కుర్చీకి కట్టేసి తప్పించుకునే వీలు లేకుండా.. మంటల్లో మాడి మసై పోయేలా ప్లాన్‌ చేశారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం మీ అమ్మను చంపేసి.. ఫైర్‌ యాక్సిడెంట్‌ లో చనిపోయేలా క్రియేట్‌ చేశారు.

భూమి: ఏంటి అత్తయ్యా మీరు చెప్పేది..?

శారద: అవును భూమి మీ అమ్మను చంపింది ఎవరో కాదు భూమి.. మీ పిన్ని.. ఆమె  చంపుతుండగా తీసిన వీడియో ఆ రికార్డర్‌లో ఉంది భూమి. ( భూమి షాక్‌ అవుతుంది. ఏడుస్తుంది.) ఆ వీడియో నేను చూశాను. ఆ వీడియో కోసమే ఆ రత్న మన ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆ వీడియో కోసమే నన్ను చంపాలని చూశారు భూమి. ఈ విషయం వెంటనే గగన్‌కు చెప్పాలి..

భూమి: వద్దు అత్తయ్యా ఈ విషయం బావకు చెప్పొద్దు..

శారద: ఎందుకు చెప్పొద్దు భూమి.. వెంటనే నిజం గగన్‌కు తెలియాలి.

భూమి: అత్తయ్యా ఈ విషయం బావకు చెబితే.. బావ కోపంతో అపూర్వ చంపడానికైనా తెగిస్తాడు. ఆ అపూర్వ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా.. అది ఎంత నరరూప రాక్షసురాలో మర్చిపోయారు. తన అవసరాల కోసం ఎవరినైనా చంపేందుకు సిద్దంగా ఉంటుంది ఆ రాక్షసురాలు. తనను చంపడానికి బావ వస్తున్నాడని అపూర్వకు ఊరుకుంటుందా అత్తయ్యా ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు బావ ప్రమాదంలో పడతాడు అత్తయ్యా.. బావకు ఈ విషయాలు మనం ఎప్పటికీ చెప్పొద్దు అత్తయ్య. ఈ విషయం బావకు తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి అత్తయ్యా

అంటూ భూమి చెప్తుండగానే.. గగన్‌ ఐసీయూ డోర్‌ తెరుచుకుని వస్తాడు. గగన్‌ ను చూసిన భూమి, శారద షాక్ అవుతారు. గగన్‌ తాము మాట్లాడుకుంది విన్నాడేమోనని భయపడతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 3:కేదార్‌ను చంపడానికి వచ్చి భంగపడిన మీనన్‌...జగధాత్రిని చూసి వెనక్కి పరార్‌
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను చంపడానికి వచ్చి భంగపడిన మీనన్‌...జగధాత్రిని చూసి వెనక్కి పరార్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
Godavari Serial Today November 3rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
Nindu Manasulu Serial Today November 3rd: నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget