Meghasandesam Serial Today September 23rd: ‘మేఘసందేశం’ సీరియల్: శారదను చంపేందుకు హాస్పిటల్‌కు వెళ్లిన అపూర్వ - అపూర్వ ను చూసిన భూమి
Meghasandesam serial today episode September 23rd: శారదను చంపేందుకు హాస్పిటల్ కు వెళ్తుంది అపూర్వ. అక్కడే ఉన్న భూమి అపూర్వను చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గగన్ నిజం చెప్పడంతో శరత్ చంద్ర కోపంగా అపూర్వను శోభాచంద్రను చంపింది నువ్వేనా అంటూ నిలదీస్తాడు. నా శోభాను చంపింది నువ్వేనా అంటూ కోపంగా అడుగుతుంటాడు.
అపూర్వ: బావ ఏం మాట్లాడుతున్నావు బావ. నా ప్రాణానికి ప్రాణం అయిన నా అక్కను నేను చంపుకుంటానా బావ. లేదు బావ వీడు అంతా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు బావ.. వాణ్ని నమ్మకు బావ.
శరత్: ఎన్నాళ్లు నన్ను మోసం చేస్తావు. నా ప్రాణమైన శోభాచంద్రను దూరం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను..
అంటూ శరత్ చంద్ర కోపంగా అపూర్వ గొంతు నులిమి చంపేస్తుంటే అందరూ చూస్తుంటారు.
సుజాత: అబ్బాయి అబ్బాయి మా అమ్మాయిని వదిలేయ్ అబ్బాయి.. నీకు దండం పెడతాను.
శరత్: ఈరోజు నా చేతుల్లోనే నీ చావు. చచ్చిపో ఇక
కేపీ: శరత్ చంద్ర గారు ఫ్యాక్టరీ తగులబడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే కార్మికులను కాపాడతానని మాయమాటలు చెప్పి నాతో ఫ్యాక్టరీని తగులబెట్టించిందండి.. అంతకు ముందే శోభా చంద్ర చెల్లెమ్మని ప్యాక్టరీలో కట్టేసి మంటల్లో కాలిపోయేలా చేసిందండి.. ఈ నిజం నేను ఎక్కడ బయటపెడతానోనని మీ చెల్లెలిని నాకు ఇచ్చి పెళ్లి చేసిందండి.. ఈ అపూర్వను చంపేయండి..
గగన్: చంపేయండి..
శరత్: నువ్వు ఎన్ని ఘోరాలు చేశావు.. ఎంత మంది జీవితాలు నాశనం చేశావు. నువ్వు బతకడానికి వీల్లేదు.
గగన్: అందుకే శరత్ చంద్ర గారు ఈ అపూర్వను చంపడానికే నేను వచ్చాను.
శరత్: చంపాల్సింది నువ్వు కాదురా నేను..
అంటూ గగన్ చేతిలో ఉన్న గన్ లాక్కుని శరత్ చంద్ర కోపంగా అపూర్వను కాల్చేస్తాడు. వెంటనే అపూర్వ వద్దు నన్నేం చేయోద్దు అంటూ ఉలిక్కి పడి నిద్ర లేస్తుంది. ఇదంతా కలా అని భయపడుతుంది. ఎలాగైనా ఆ శారదను చంపేయాలని డిసైడ్ అవుతుంది అపూర్వ. అందుకోసం తర్వాత శారద ఉన్న హాస్పిటల్ కు రత్న, రౌడీని తీసుకుని వెళ్తుంది. రత్న సిస్టర్ వేషం, రౌడీ కంపౌండర్ వేషం అపూర్వ పేషెంట్ వేషం వేసుకుంటారు.
అపూర్వ: నేరుగా నన్ను ఆ శారద ఉన్న ఐసీయూ రూంలోకి తీసుకెళ్లండి. ఆ శారద కళ్లు తెరచి నిజం చెప్పే లోపు చచ్చిపోవాలి.
అని చెప్పి అపూర్వ స్ట్రెచర్ మీద పడుకుంటుంది. రత్న, రౌడీ కలిసి స్ట్రెచర్‌ను తోసుకుంటూ శారద ఉన్న ఐసీయూ రూం దగ్గరకు వెళ్తారు. ఆ రూం ముందు గగన్, భూమి ఉంటారు. వాళ్లను చూసి రత్న, రౌడీ ఆగిపోతారు. ఇంతలో లోపలి నుంచి సిస్టర్ వచ్చి శారదకు మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్తుంది.
గగన్: ఇవ్వండి తీసుకొస్తాను..
భూమి: ఇటు ఇవ్వండి నేను తీసుకొస్తాను.
గగన్: అవసరం లేదు మా అమ్మకు నేను తీసుకొస్తాను.
భూమి: బావ ఆగండి..
అంటూ గగన్ మెడిసిన్స్ కోసం వెళ్తుంటే.. వెనకాలే భూమి వెల్తుంది. వాళ్లు వెల్లగానే.. అపూర్వ త్వరగా పదండి ఐసీయూలోకి నన్ను తీసుకెళ్లండి అని చెప్తుంది. రత్న, రౌడీ కలిసి అపూర్వను ఐసీయూలోకి తీసుకెళ్తారు.
అపూర్వ: ఆ ఇంజక్షన్ ఇవ్వు..
రత్న ఇంజక్షన్ కింద పడేస్తుంది.
అపూర్వ: ఏయ్ వెతకవే ఇంజక్షన్ ఎక్కడ పడేశావు..
రౌడీ: అమ్మా ఆ భూమి వస్తుంది.
అని చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. వెంటనే రత్న, రౌడీ బయటకు వెళ్లిపోతారు. అపూర్వ అక్కడే దాక్కుంటుంది. ఇంతలో లోపలికి వచ్చిన భూమి ఏదో తీసుకుని వెళ్లిపోతూ అపూర్వ శారీని చూస్తుంది. ఎవరు మీరు అంటూ పిలుస్తుంది. అపూర్వ భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















