Meghasandesam Serial Today October 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను కొట్టిన భూమి – అపూర్వకు గుండు గీయబోయిన గగన్
Meghasandesam Today Episode: గగన్ కోపంగా వెళ్లి అపూర్వకు గుండు గీయబోతుంటే భూమి వచ్చి గగన్ ను కొట్టి పంపిచేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: గగన్ అపూర్వ ఇంటికి గట్టిగా అరుస్తాడు. అపూర్వ మనుషులు గగన్ మీదకు వెళ్తుంటారు. అపూర్వ బయటకు వచ్చి అలా అరుస్తున్నావేంటి.. ఆడియోకే అప్పుడే కొన్న కొత్త రేడియోలా అరుస్తున్నావు.. వీడియో చూసుంటే ఓల్టేజ్ ఎక్కు వ అయిన టీవీలా పేలిపోయేవాడివేమో.. అంటుంది అపూర్వ.. ఆడియో విన్నాను కాబట్టే అరవై కిలోమీటర్ల వేగంతో వచ్చాను. వీడియో చూసి ఉంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వచ్చి నిన్ను పది వేల ముక్కలు చేసేవాణ్ని అంటాడు.
అపూర్వ: ఓరేయ్ మీ అమ్మను అవమానించాననే ఆవేశంతో మాట్లాడకు. వీళ్ళు నీలా ఏసీలో ఉంటూ సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేసే బ్యాచ్ కాదు. ఏంట్రా చూస్తుంటేనే నీకు చెమటలు పడుతున్నాయా..?
గగన్: ఒక మగాడి మగతనమే కాదు. ఒక కొడుకుగా అమ్మకు నువ్వు చేయబోయే అవమానం నీ ఇంటి ముందు, నీ వాళ్ల ముందు చేస్తాను.
అపూర్వ: ఓహో అదా నీ కాన్సెప్ట్.. ఓకేరా కాన్సెప్ట్ కొత్తగా బాగుంది. కానీ చిన్న చేంజ్ రా.. అక్కడ మీ అమ్మకు జరగబోయిన అవమానం ఇక్కడ నీకు జరుగుతుంది. రేయ్ రమణ ఇంకా చూస్తారేంట్రా..? తెల్లగా ఉన్నవాడి రంగు రక్తపు మరకలతో ఎర్రగా మారాలి. అంతకంటే ముందు వాడి తల వెంట్రుకలు నా కాళ్ల దగ్గర ఉండాలి.
అని అపూర్వ చెప్పగానే రమణ కత్తి తీసుకుని గగన్‌కు గుండు గీయడానికి వెళ్తాడు. గగన్ ఒక్క తన్నుతో రమణ గాల్లోకి లేచి అపూర్వ కాళ్ల దగ్గర పడతాడు. మిగతా రౌడీలను కొడతాడు గగన్.
గగన్: నాకు చెమటలు పుట్టిస్తావనుకుంటే నువ్వు చెమలు కక్కుతున్నావు ఏంటి? కంగారు పడకు ఎవర్నీ చంపను కానీ వాళ్లు ఆరు నెలల బెడ్ రెస్ట్ తీసుకుంటారు అంతే. మా అమ్మకు నువ్వు చేసిన అవమానానికి నీకు మీ అమ్మ గుర్తుకు వచ్చేలా చేస్తాను. నీకు గుండు గీకి.. నీ తలవెంట్రులతో మా అమ్మ కాళ్లకు ఉన్న మట్టి తుడుస్తా…
అపూర్వ: వీణ్ని అనవసరగా రెచ్చగొట్టి తప్పు చేశాను. వీణ్ని ఆపడం వీళ్ల తరం కాదు.
అని మనసులో అనుకుని పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన భూమి అపూర్వ మాటలు విని పరుగెత్తుకెళ్లి గగన్ ను ఆపాలని చూస్తుంది. గగన్ వినకుండా కత్తి తీసుకుని రౌడీలను కొడుతూ అపూర్వ దగ్గరకు వెళ్తాడు.
గగన్: గుండు గీస్తే అవమానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు.
అని గుండు గీయబోతుంటే భూమి వచ్చి గగన్ పక్కకు తోసేసి చెంప పగులగొడుతుంది.
భూమి: ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అసలు ఏం అనుకుంటున్నావు నువ్వు పో బయటకి.
గగన్ షాకింగ్ గా చూస్తుండిపోతాడు. మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. భూమి ఏడుస్తుంది. తనను తాను కొట్టుకుని ఏడుస్తూ కూలబడిపోతుంది. వర్షం వస్తుంది. గగన్ వర్షంలో కారు దగ్గర నిలబడి బాధపడుతుంటాడు. భూమి గగన్ దగ్గరకు వెళ్తుంది. మరోవైపు ఇంట్లో కూర్చున్న అపూర్వ, గగన్ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు.
అపూర్వ: రండి ఎస్సై గారు ఇప్పటి వరకు వాడు చాలా గొడవ చేశాడు. వాణ్ని ఎలాగైనా అరెస్ట్ చేసి లోపల పడేయండి మళ్లీ వాడు ఇటువైపు రాకూడదు. నా కంటికి కనిపించకూడదు.
బామ్మ: జరిగిందేదో జరిగిపోయింది కదమ్మా.. వదిలేయెచ్చు కదా?
అపూర్వ: ఏంటండి వదిలేసేది.. ఇదిగో దీని తోనే నా ప్రాణాలు తీయాలనుకున్నాడు.
ఎస్సై: ఎవరు మేడం వాడు. మాకు డీటెయిల్స్ ఇవ్వండి.. వాడి సంగతి మేము చూసుకుంటాము.
అని ఎస్సై సరే అని చెప్తాడు. ఇంతలో చెర్రి వస్తాడు. వదిలేస్తే అత్తయ్య సోదరుణ్ని ఏదో ఒకటి చేసేలా ఉంది. అని దగ్గరకు వెళ్లి ఇప్పుడు అన్నయ్యను అరెస్ట్ చేయిస్తే గుడి దగ్గర మీరు చేసింది బయటకు వస్తుంది. అసలే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది అని చెప్తాడు. నక్షత్ర కూడా అవునమ్మా అని చెప్తుంది. దీంతో అపూర్వ సరేలేండి ఎస్సై గారు ఈ సారికి వాణ్ని వదిలేద్దాం అంటుంది. సరేనని పోలీసులు వెళ్లిపోతారు. తర్వాత నక్షత్ర, అపూర్వ దగ్గరకు వెళ్లి భూమికి నీ మీద అంత ప్రేమ ఎందుకు…? నీకోసం బావను కొట్టడం ఏంటి అని అడుగుతుంది. దీంతో అపూర్వ వాడు నీకు బావేంటే అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!