Meghasandesam Serial Today November 3rd: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వ ప్లాన్ సక్సెస్ – ఆగిపోయిన ఇందు పెళ్లి
Meghasandesam Today Episode: అపూర్వ పిలిచిన రౌడీ తన నటనతో పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. పెళ్లి వాళ్లు ఇందును అనుమానించి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: గగన్ వెళ్లిపోయాక పెళ్లి కంటిన్యూ అవుతుంది. ఇంతలో సుజాత తాళి కట్టే సమయం దగ్గర పడింది అమ్మాయి అంటుంది. మన ప్లాన్ కూడా వర్కవుట్ అవుతుంది అని చెప్తుంది అపూర్వ. తను పురమాయించిన రౌడీ ఎక్కడ వెళ్లాడని చూస్తుంది. ఇంతలో పంతులు తాళి కట్టమని వంశీకి ఇవ్వగానే తాళి కడుతుంటే అప్పుడే పెట్రోల్ ఒంటి మీద పోసుకుంటూ మండపంలోకి వచ్చి ఈ పెళ్లి ఆపండి అంటాడు. ఇందు నేను ప్రాణంగా ప్రేమించుకున్నామని.. ఇందు లేకపోతే నేను బతకను అంటూ గొడవ చేస్తుంటాడు. చెర్రి వెళ్లి వాణ్ని కొట్టి ఎవడ్రా నువ్వు అంటూ నిలదీస్తాడు. ప్రసాద్ వెళ్లి ఎవడ్రా నువ్వు అంటూ అడగ్గానే నేను మీకు తెలియకపోవచ్చు కానీ ఇందూకు తెలుసు అంటాడు.
ప్రసాద్: ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు పోరా బయటకు
రౌడీ: నిజం.. ఇదే నిజం. ఇప్పుడు అర్తం అవుతుంది ఇందు. నేను నీ స్థాయికి పనికిరానని ఇప్పుడు ఈ డబ్బున్న వాణ్ని పెళ్లి చేసుకుంటున్నావు కదూ.
ప్రసాద్: ఏంట్రా ఊరుకుంటున్నాను కదాని రెచ్చి పోతున్నావా..?
రౌడీ: నేను చెప్పేది నిజం సార్. నా ప్రేమ నిజం సార్. నా పేదరికం నా ప్రేమకు అడ్డు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. నా ఇందు లేని బతుకు నాకు అవసరం లేదు సార్. తను చూస్తుండగానే నేను చనిపోతాను.
అపూర్వ: ఏంట్రా నీ నాటకాలు. ఇది ఎవరి పెళ్లి అనుకున్నావు. ద గ్రేట్ శరత్ చంద్ర గారి మేనకోడలు పెళ్లి. బావా వాడు అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి బావ.
రౌడీ: నేను చెప్పేది నిజం సార్.
శరత్: ఏంట్రా నువ్వు చెప్పే నిజం ఇలా వచ్చి గొడవ చేస్తే నీ మాటలు నమ్మాలా..?
రౌడీ: నా మాటలు నమ్మొద్దు సార్. కానీ ఫోటో చూసైనా నమ్ముతారా..?
అంటూ తన ఫోన్ లో ఇందుతో తను కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తాడు. ఇది మీ ఇందుయే కదా? అంటూ అందరికి తను మార్ఫింగ్ చేసిన ఫోటోలు చూపిస్తాడు. ఇప్పుడైనా నమ్ముతారా..? మేము ఎలా తిరిగామో.. ఎంత క్లోజ్ గా ఉన్నామో చూశారా..? అంటాడు రౌడీ. ప్రసాద్ కోపంగా కొడుతూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు చూపిస్తే నమ్ముతామా అంటాడు. దీంతో సరే ఇందు నాకు గుర్తుకు ఇచ్చిన ఇందు రింగ్ చూడండి అంటూ రింగ్ చూపిస్తాడు. రింగ్ చూసి అందరూ షాక్ అవుతారు.
అపూర్వ: బావా అవును బావ ఇది ఈ రింగ్ ఇందుదే.. ఇందు నీ రింగ్ అతని దగ్గరకు ఎలా వచ్చిందమ్మా..
ఇందు: నాకు తెలియదు అత్తయ్యా.. అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అత్తయ్యా..
రౌడీ: ఎన్ని ఆధారాలు చూపించినా ఇంకా నేను ఎవరో తెలియదు అంటున్నావా? ఇందు.
బామ్మ: ఎవర్రా నీవు ఒక ఆడపిల్ల జీవితం చెడగొడితే నీకేం వస్తుంది.
మీరా: బాబు మా ఇందు ఎలాంటిదో మాకు తెలుసు. నీకు ఎంత కావాలో చెప్పు మా అన్నయ్యా ఇస్తాడు.
రౌడీ: ఎంత మాట అన్నారండి మీరు. డబ్బుకు ఆశపడే ప్రేమ కాదండి నాది. ఇందు ఈ జన్మకు నీతో కలిసి బతికే అదృష్టం లేదని అర్థం అయింది. నేను నాశనం అయినా పర్వాలేదు. కానీ నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండు.
అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రౌడీ. వాడు వెళ్లిపోయాక ప్రసాద్ టైం చూసుకుని మూహూర్తం అయిపోతుంది తాళి కట్టించండి అనగానే ఏంటి కట్టిచేది ఇంత జరిగాక కూడా మళ్లీ పెళ్లి ఏంటి అంటూ పెళ్లి వాళ్లు వెళ్లిపోతుంటే.. ప్రసాద్ బతిమాలుతాడు. వంశీ కోపంగా ఇందును నానా మాటలు తిడతాడు. ప్రసాద్ కొట్టబోయి ఆగిపోయి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటాడు. ఇందు ఏడుస్తుంది. పెళ్లి వారు వెళ్లిపోతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!