Meghasandesam Serial Today November 28th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీకి దిష్టి తీసిన అపూర్వ – తనను షూట్ చేసింది శరత్ చంద్రే అన్న కేపీ
Meghasandesam serial today episode November 28th: తాను ఆత్మహత్య చేసుకోలేదని.. శరత్ చంద్రే షూట్ చేశాడని కేపీ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: పిండ ప్రధానం దగ్గర నుంచి కేపీ బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత గగన్ ఇంటికి వస్తాడు. కోపంగా అందరినీ చూస్తుంటాడు. అందరూ సైలెంట్‌గా ఉంటారు. గగన్ మాత్రం ఎమోషనల్ అవుతూ మాట్లాడతాడు.
గగన్: చిన్నప్పుడే నా తండ్రి అనుకున్న అతను నన్ను మోసం చేశాడమ్మా.. కల్లాకపటం ఎరుగని నాకు మోసం మొదటి పాఠం అయింది. ఆ తర్వాత ఎదుగుతున్న క్రమంలో బిజినెస్‌లో చాలా మంది నన్ను మోసం చేయాలని చూశారు. కొంత మంది మోసం కూడా చేశారు. చిన్నప్పుడు డబ్బు దగ్గర నాన్న అన్న బంధమే బద్దలయినప్పుడు ఇక బిజినెస్‌లో ఇవన్నీ ఎంతలే అనుకుని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత నా లైఫ్‌లో అత్యంత దారుణంగా ఎవరి దగ్గరైనా మోసపోయాను అంటే ఇదిగో ఈ భూమి దగ్గర. ఈ భూమి ప్రేమ దగ్గర. ఈవిడ గారు కొట్టిన దెబ్బలకు ఎన్నో నిద్ర లేని రాత్రులు ఓకే అది కూడా తట్టుకుని నేను స్ట్రాంగ్ గా నిలబడ్డాను కానీ ఈరోజు నువ్వు చేసిన మోసాన్నే నేను జీర్ణించుకోలేక పోతున్నాను అమ్మ. నాకు లోకం అంతా ఒక లెక్క.. నువ్వు ఒక లెక్క. నువ్వే నా లోకం అనుకున్నాను కదమ్మా..? ఇప్పుడు నువ్విచ్చిన ఈ కష్టాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి అమ్మ..
శారద: నాన్న నువ్వు భావేద్వేగంలో నన్ను మరీ ఎక్కువగా నిందించేస్తున్నావు. నీ మనసు ఇలా కష్టపడకూడదు అనే మా ఆయన్ని దాచాము అన్న నిజాన్ని నీ దగ్గర దాచాను. నేను చేసింది మోసం కాదురా..? ఆయన ప్రాణాన్ని రక్షించాను. తన అన్నయ్యను మీ నాన్నే చంపేశాడని మూర్ఖంగా నమ్మి కూర్చున్నాడు ఆ ఎస్పీ సూర్య. వాళ్ల చేతిలో మీ నాన్నకు ప్రాణ హాని ఉందని మీ నాన్నను దాచేశాను. ఇప్పుడు ఆ సూర్య మీ నాన్నను ఏం చేస్తాడోనని భయంగా ఉందిరా..?
గగన్: ఏం చేస్తాడమ్మా ఆ సూర్య మహా అయితే చంపేస్తాడు అంతే కదా..? ఆ కృష్ణ ప్రసాద్ చావుకు అర్హుడే కదమ్మా..?
శారద: సొంత తండ్రిని అలా అనోద్దు నాన్న గగన్..
గగన్: నాన్న ఎవరికి అమ్మా నాన్న అతను నాకు నాన్న కాదు. సొంత పిల్లలనే చంపి తినేసే పాము లాంటోడు. ఇప్పుడే కదా నేను చెప్పాను నీకు. అతన్ని నేను కాపాడటం ఏంటమ్మా..?
శారద: నాన్న మరీ అన్యాయంగా మాట్లాడకురా..?
గగన్: అమ్మా ఇప్పుడు నేను మాట్లాడేదే న్యాయం. కాపాడాల్సిన అవసరం నాకు లేదమ్మా.. ఆయన అవసరం కూడా మనకు లేదమ్మా..
అంటూ గగన్ చెప్పగానే.. భూమి, శారద ఎమోషనల్ అవుతుంటారు. మరోవైపు శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన కేపీకి అపూర్వ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది. కేపీ అపూర్వను, శరత్ చంద్రను కోపంగా చూస్తుంటాడు. మీరా ఎమోషనల్ అవుతుంది.
మీరా: ఆత్మహత్య చేసుకోవాలన్నంత కష్టం ఏమొచ్చిందో అడగరా చెర్రి మీ నాన్నని.
కేపీ: ఏం బావ గారు మీరు చెప్పలేదా..?
మీరా: మీరు మా అన్నయ్యను అడుగుతున్నారేంటండి..?
కేపీ: నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే..?
అంటూ కేపీ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అపూర్వ, శరత్ చంద్ర భయం భయంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















