Meghasandesam Serial Today November 25th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని ఫాలో అయిన గగన్ - కేపీని చూసిన గగన్
Meghasandesam serial today episode November 25th: భూమిని ఫాలో అవుతూ వెళ్లి ఒక ఇంట్లో కేపీని చూస్తాడు గగన్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: చెర్రి, శరత్ చంద్రలా గెటప్ వేసుకుని నక్షత్రతో మాట్లాడింది. హనీమూన్‌కు వెళ్లమని చెప్పింది నక్షత్ర గుర్తు చేసుకుని ఇరిటేట్ గా ఫీలవుతుంది. కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో అక్కడికి అపూర్వ వస్తుంది. అపూర్వను చూసిన నక్షత్ర ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది.
అపూర్వ: బేబీ ఏమైంది బేబీ..
సుజాత: అయ్యో అదేంటమ్మా కేపీ చచ్చిపోయిన ఇన్ని రోజులకు ఏడుస్తున్నావు…?
నక్షత్ర: చీ నోర్ మూయ్.. నేను ఏడుస్తుంది అందుకు కాదు. అయినా నువ్వు ఎలా ఒప్పుకున్నావు మమ్మీ..
అపూర్వ: నేనేం ఒప్పుకున్నాను బేబీ..
నక్షత్ర: హనీమూన్‌కు వెళ్లడానికి
సుజాత: అయ్యయ్యో ఈ వయసులో నువ్వు హనీమూన్‌కు వెళ్లడం ఏంటి అమ్మాయి.. చూసిన వాళ్లు అంతా ఏమనుకుంటారు అమ్మాయి. పిల్లలకు పెళ్లి చేసి ముసలోళ్లు హనీమూన్‌కు వెళ్లడం ఏంటని నవ్వుకోరు.. అయినా మీ అమ్మా నాన్న హనీమూన్‌కు వెళ్తుంటే నీకేం పోయే కాలం వచ్చిందే.. అలా ఏడుస్తున్నావు.. అయినా నీకో చిట్టి తమ్ముణ్ని ఇవ్వాలన్న ఆశ వాళ్ల మనసుల్లో మెదిలిందేమో..? అంతేనా అమ్మాయి..
అపూర్వ కోపంగా సుజాతను కొడుతుంది.
అపూర్వ: ఏదీ పూర్తిగా వినకుండా మధ్యలోనే దూరి కాకిలా కథ అల్లేయకు.. నక్షత్ర హనీమూన్ అందో లేదో ఏకంగా నాకు పిల్లలను కూడా పుట్టించేసే ప్రయత్నం చేస్తున్నావు.. అడ్డు జరుగు.. బేబీ అసలు హనీమూన్ ఏంటి..? పూర్తిగా చెప్పు..
నక్షత్ర: నన్ను ఆ చెర్రిని డాడీ హనీమూన్‌కు వెళ్లమని చెప్తున్నాడు మమ్మీ..
చెర్రి వచ్చి డోర్ చాటు నుంచి వింటుంటాడు.
చెర్రి: అప్పుడే అమ్మకు కంఫ్లైంట్ చేస్తున్నావా..? చెప్తా నీ సంగతి.
అనుకుంటూ వెళ్లిపోతాడు.
నక్షత్ర: వెళ్తాం కానీ మమ్మీకి కూడా ఒక మాట చెప్పండి అంటే మీ మమ్మీ హ్యాపీగా ఒప్పుకుంది అంటున్నారు మమ్మీ.
అపూర్వ: నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ హనీమూన్‌కు నేను ఒప్పుకున్నాను అంటాడా..? చా ఈ మధ్య బావకు మతి చెలిస్తున్నట్టు ఉంది.
నక్షత్ర: ఫ్లీజ్ మమ్మీ నువ్వే ఏదో ఒకటి చేసి మా హనీమూన్ ఆపు మమ్మీ ఫ్లీజ్.
సుజాత: అల్లుడు గారు నిర్ణయం తీసుకున్నాక ఇక మా అమ్మాయి ఎలా ఆపుతుంది అమ్మాయి.
అపూర్వ: నువ్వు కాస్త నోరు మూసుకుంటావా.. అయినా నన్ను అడగకుండా వెంటనే ఎలా ఫిక్స్ అయిపోతాడు. బేబీ నువేం వర్రీ కావద్దు. ఈ హనీమూన్‌ను నేను ఆపుతాను.
అంటూ చెప్పి అపూర్వ వెళ్లిపోతుంది.
సుజాత: ఇదిగో మీ అమ్మ అపుద్ది అంటావా అమ్మాయి..
నక్షత్ర: ఏయ్ గోరింటాకు ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. వెళ్లు ఇక్కడి నుంచి
అంటూ నక్షత్ర తిట్టగానే.. సుజాత కోపంగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత భూమి, కేపీ కోసం భోజనం తీసుకెళ్తుంటే.. వెనకే గగన్ ఫాలో అవుతాడు. సరిగ్గా కేపీ భోజనం చేస్తుంటే.. వెళ్లి డోర్ కొడతాడు. గగన్ వాయిస్ విన్న కేపీ వెళ్లి పైన దాక్కుంటాడు. ఇంతలో గగన్ లోపలకి వచ్చి కేపీ ఎక్కడని భూమిని అడుగుతాడు. భూమి ఏదో చెప్పబోతుంటే.. ఏయ్ ఆపు నీ నంగనాచి మాటలు.. అంటూ తిడుతూ పైన దాక్కున్న కేపీని గగన్ చూస్తాడు. గగన్‌ను చూశాడని కేపీ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















