అన్వేషించండి

Meghasandesam Serial Today November 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌ :   భూమిని కాల్చిన శరత్ చంద్ర – అపూర్వను చంపబోయిన గగన్‌

Meghasandesam Today Episode:  గన్‌ తీసుకని వచ్చిన శరత్ చంద్ర బుల్లెట్‌ పేల్చగానే అది భూమి గుండెల్లోకి దూసుకెళ్తుంది.దీతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam  Serial Today Episode:  ఆ రౌడీని శారదకు తాళి కట్టమని చెప్పింది నేనే అని అపూర్వ  చెప్తుంది. మన కుటుంబ పరువు కోసమే అలా  చేశానని.. సందు దొరికితే చాలు ఆ కృష్ణప్రసాద్‌ ఆ ఇంట్లోనే ఉంటున్నాడు.. మన మీరాకు సవతి పోరు ఉండదు అని చేశాను అంటుంది అపూర్వ. ఆ శారదను ఎన్నిసార్లు నిలదీసినా బరితెగించి మరీ బతుకుతుంది అని ఏడుస్తూ చెప్తుంది. నలుగురిలో చీ కొడితేనైనా అవమానంతో చస్తుంది అనుకుంటే అంతకంతకు అడ్డగోలుగా బతుకుతుంది. అందుకే ఎవరితోనైనా పెళ్లి చేస్తే ఈ కృష్ణ ప్రసాదం ఆ ఇంటి వైపు చూడకుండా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పండి బావ నేను చేసింది తప్పా అని అడుగుతుంది.

గగన్‌: తప్పు కాదు.. తప్పించుకోలేనంత తప్పు చేశావే తప్పుడు దానా..?

అని ఆవేశంగా వెళ్లి అపూర్వ పీక పిసుకుతాడు.

శరత్: రేయ్‌ చంపేస్తానురా..?

గగన్‌: ఈరోజు నిన్ను నా చేతుల్లో నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు.

అంటూ అపూర్వ గొంతు పట్టుకుని చంపబోతాడు. అందరూ అడ్డు పడగానే పూల కుండీ తీసుకుని అపూర్వ మీదకు వస్తాడు. ఇంతలో పైకి వెళ్లిన శరత్‌ చంద్ర గన్‌ తీసుకుని కిందకు వస్తాడు. ఇంతలో భూమి లోపలికి పరుగెత్తుకొస్తుంది.

శరత్: అరేయ్‌ గగన్‌ మర్యాదగా ఆ కుండీ కింద పడేయ్‌

గగన్‌: పడేస్తా.. దీని తలపైన

అని పూలకుండీ వేయబోతుంటే శరత్‌ చంద్ర కాలుస్తుంటే భూమి వెంటనే గగన్‌ ను పక్కకు తోస్తుంది. బుల్లెట్‌ భూమి గుండెల్లోకి వెళ్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. భూమి అక్కడే కుప్పకూలి పోతుంది. గగన్‌, శరత్ చంద్ర వచ్చి పట్టుకుంటారు. ఏడుస్తూ భూమి చూడు చూడు అంటూ పిలుస్తారు. ఇద్దరూ కలిసి భూమిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు.

బిందు: నాన్నమ్మా.. భూమి..

సుజాత: ఏంటమ్మాయి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది.

అపూర్వ: పోనీలే పిన్ని ఏం జరిగిన నా మంచి కోసమే.. ఈ దెబ్బతో శత్రుశేషం లేకుండా పోతుంది.

మరోవైపు భూమిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్తారు శరత్ చంద్ర, గగన్‌. భూమిని ఆఫరేషన్‌ థియేటర్‌ లోకి తీసుకెళ్తారు.

గగన్‌: భూమికి ఏమైనా కావాలి…?

శరత్‌: నా కూతురుకు ఏమైనా అయిందో..

గగన్‌: ఏయ్‌ కూతురంట కూతురు అసలు కాల్చిందే నువ్వురా..?

శరత్‌: గన్‌ తేవడానికి కారణం నువ్వు అసలు చంపాలనుకుంది నిన్ను.

గగన్‌: చంపేసినా నీ ప్రాణానికి గ్యారెంటీ ఉండేది. ఈ క్షణం నుంచి నువ్వు ప్రతి క్షణాన్ని నువ్వు లెక్క పెట్టుకోవాల్సిందే..

అంటూ ఇద్దరూ ఆపరేషన్‌ థియేటర్‌ ముందు గొడవ పడుతారు. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి ఇద్దరిని తిడుతుంది. ఇది హాస్పిటల్‌.. మార్కెట్ కాదు. లోపల మీరు తీసుకొచ్చిన వారికి ఆపరేషన్‌ జరగుతుంది అని డాక్టర్‌ చెప్పగానే భూమికి ఎలా ఉందని అడుగుతారు. భూమి కండీషన్‌ చాలా క్రిటికల్‌ గా ఉందని బుల్లెట్‌ హార్ట్‌ లో బ్లాక్‌ అయింది దాన్ని తీసే స్పెషలిస్టు ముంబైలో ఉన్నారు కానీ ఆయన అపాయింట్ మెంట్ ఇప్పుడు దొరకదు అని డాక్టర్‌ చెప్పగానే శరత్‌ చంద్ర ఎన్ని కోట్లైనా.. చార్టెడ్‌ ప్లయిట్‌ లో ఆయన్ని తీసుకొస్తానని శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సుజాత స్వీట్స్‌ తీసుకొచ్చి అపూర్వకు ఇచ్చి ఆ భూమి చావు బతుకుల మధ్య ఉందట అని చెప్పి సంతోషంగా ఫీలవుతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget