అన్వేషించండి

chinni serial today march 17th: చిన్ని సీరియల్: 'మా అమ్మని చంపింది మీ నాన్నే'.. చిన్ని 30 రోజుల అగ్రిమెంట్!

chinni serial today episode march 17th | చిన్ని కావేరి ఫొటో తీసుకొని మ్యాడీ ఇంటికి వచ్చి 30 రోజుల అగ్రిమెంట్ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ బాధగా ఉంటే నాగవల్లి, దేవా వెళ్లి విడాకుల గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతారు. అవును అని మ్యాడీ అంటే నువ్వే విడాకులు ఇస్తాను అన్నావ్.. ఇప్పుడు ఏమైనా రెండో ఆలోచన ఉందా.. నీకు ఏ ఆలోచన ఉన్నా సరే ముందే విడాకులు ఆపేద్దాం అని అంటారు. నాకు అస్సలు చిన్నికి దగ్గర అవ్వాలి అని లేదు.. నేను మీ కోసం చిన్నికి విడాకులు ఇవ్వడం లేదు,.. నా కోసమే ఇస్తున్నా.. జీవితంలో ఆ చిన్ని నా జోలికి రాకూడదు అని విడాకులు ఇస్తున్నా అని అంటాడు.

చిన్ని మ్యూచువల్‌ విడాకులకు ఒప్పుకోదు.. ఏదో ఒకటి చేసి విడాకులు తీసుకోవాలి.. టైం వేస్ట్ చేయకూడదు అని అంటుంది. మ్యాడీ కూడా టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటాడు. మ్యాడీ విడాకుల విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాడని అనుకుంటారు. చిన్నిని, బాలరాజుని చంపేస్తే తలనొప్పి ఉండదు అని దేవా మనసులో అనుకుంటాడు. ఇక ఉదయం ఇంటికి లాయర్ వస్తారు. లాయర్‌ని ఎవరు పిలిచారా అని అందరూ అనుకుంటే మ్యాడీ వచ్చి నేనే పిలిచాను అని విడాకుల కోసం అని చెప్తాడు. విడాకుల పత్రాల మీద మ్యాడీ సంతకం చేసే టైంకి చిన్ని కావేరి ఫొటో తీసుకొని వస్తుంది. మ్యాడీ చూసి ఆపి ఎంత ధైర్యం నీకు మా అమ్మని చంపిన దాని ఫొటో తీసుకొస్తున్నావ్ అని అడుగుతాడు. మా అమ్మ మీ అమ్మ చంపింది అని మీ వాళ్లు చెప్పారు కదా.. అలాగే నాకు మా నాన్న చెప్పారు.. మీ డాడీ మా అమ్మని చంపారని అంటుంది.

మీ అమ్మ శిక్ష అనుభవించింది మరి మా అక్కని మీ అమ్మ చంపలేదు అని ఎలా చెప్తావ్ అని నాగవల్లి అంటే.. శిక్ష అనుభవించిన ప్రతీ ఒక్కరూ.. నేరం చేసినట్లు కాదు.. తప్పించుకున్న వాళ్లు తప్పు చేయనట్లు కదా.. మీ నాన్న తప్పు చేయరు అని నువ్వు నమ్ముతున్నట్లే నేను కూడా అమ్మ తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను.. నా నమ్మకం నిరూపించడానికి నాకు 30 రోజుల గడువు కావాలి.. ఈ 30 రోజుల్లో నా తల్లి నిర్దోషి అని నిరూపించకపోతే నేను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి నీకు ఇస్తాను.. ఈ ఇంట్లో నుంచి నీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతా అని అంటుంది.

ఇదో కొత్త నాటకమా అని మ్యాడీ అంటే అవును అని లోహిత అంటుంది. మధ్యలో దూరొద్దని వరుణ్ లోహితకు చెప్తాడు. నాకు గడువు ఇవ్వకపోతే నేను విడాకులు ఇవ్వను కదా.. అదే నాకు గడువు ఇస్తే నేను పరస్పర అంగీకారంతో విడాకులు ఇస్తా అంటుంది. 30 రోజుల తర్వాత నువ్వు విడాకుల ఇవ్వకపోతే గ్యారెంటీ ఏంటి అని మ్యాడీ అడిగితే అగ్రిమెంట్ చూపిస్తుంది. మ్యాడీ  తల్లితో ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెడతా అని చెప్పి సంతకం పెడతాడు. మధు కూడా సంతకం పెడుతుంది. తర్వాత మధు కావేరి ఫొటో తీసుకెళ్లి పార్వతి ఫొటో పక్కన పెట్టాలి అని వెళ్తుంటే నాగవల్లి కోపంగా అరుస్తుంది. ఈ ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు అంటే అగ్రిమెంట్‌లో ఈ 30 రోజులు నేను ఇదే ఇంట్లో కోడలిగా ఉంటూ తింటూ ఉండే హక్కు నాకు ఉంది చూడండి అని చెప్తుంది. అందుకే మా అమ్మ గారి ఫోటో మా అత్తగారి ఫొటో పక్కన పెట్టుకునే హక్కు నాకు ఉంది దాన్ని కాదు అనే హక్కు ఎవరికీ లేదు అని కావేరి ఫొటో పార్వతి ఫొటో పక్కనే పెడుతుంది. 

నాగవల్లి మనసులో చాలా తెలివిగా ఇంట్లో చేరింది అని అనుకుంటుంది. చిన్ని మ్యాడీ గదిలోకి వెళ్లి చిన్నప్పటి పెళ్లికొడుకు పెళ్లి కూతురి బొమ్మలు పక్కపక్కన పెడుతుంది. మ్యాడీ చిన్నిని గదిలో చూసి ఆగిపోతాడు. ఇది మన గదే రండి శ్రీవారు అని చిన్ని అంటుంది. మ్యాడీ కోపంగా బట్టలు సర్దేస్తుంటే నాకు భయపడి వెళ్లిపోతున్నారా అని చిన్ని రెచ్చ గొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget