అన్వేషించండి

Podharillu Serial Today March 17th: విడాకులు ఇప్పించడానికి లాయర్‌ చెప్పిన అభ్యంతరం ఏంటి...? మహాను అడ్జుకోవడానికి చక్రి చేసిన పనేంటి..?

Podharillu Serial Today Episode March 17th: విడాకులు ఇప్పించడానికి లాయర్‌ చెప్పిన అభ్యంతరం ఏంటి...? మహాను అడ్జుకోవడానికి చక్రి చేసిన పనేంటి..? పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చదవండి.

Podharillu Serial Today Episode: విడాకులు కోసం లాయర్‌ను కలిసిన మహా,చక్రికి అక్కడ ఊహించని పరిణామం  ఎదురైంది. లాయర్‌ అడిగిన ప్రశ్నలకు మహా మాత్రమే సమాధానం చెప్తుంది. పెళ్లయి ఎన్నేళ్లు అవుతుందని లాయర్‌ అడగ్గా...కేవలం 2 నెలలు మాత్రమే అవుతుందని చెబుతుంది. అయితే ఏడాది తర్వాత రండని లాయర్ చెప్పగా మ్యూచివల్ డైవర్స్‌కు అంత సమయం  అవసరం లేదు కదా అని మహా చెబుతుంది. అయితే మీ ఆయన ఏమైనా కొడుతున్నాడా..? లేక రోజూ తిడుతున్నాడా అని లాయర్‌ మళ్లీ ప్రశ్నిస్తాడు. అలాంటిదేమీ లేదని ఆయన చాలా మంచివాడేనని చెబుతుంది.అయితే విడాకులు ఎందుకు కోరుకుంటున్నారని అడగ్గా....మా ఇద్దరికి మధ్య సఖ్యత కుదరక కాపురం చేయడం లేదని అందుకే కోరుకుంటున్నామని అంటుంది.
 
 కౌన్సెలింగ్ ఏర్పాటు చేయిస్తానని అప్పటి కూడా మీ మధ్య సఖ్యత కుదరకపోతే ఆ తర్వాత చూద్దామని అంటాడు. మధ్యలో చక్రి మాట్లాడటానికి ప్రయత్నించగా మహా అతన్ని అడ్డుకుంటుంది. లాయర్‌ కూడా అతను ఏదో చెప్పబోతున్నాడు  కదా చెప్పనివ్వండని అంటే...ఏం లేదని నేను చెప్పాలనుకున్నదే అతను చెప్పడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి ఆపుతుంది. మాకు ఎలాంటి కౌన్సెలింగ్ వద్దని...ఇద్దరం ఇష్టపడే విడాకులు తీసుకోవడానికి వచ్చామని చెబుతాడు. మీరు విడాకులు ఇవ్వడం కుదరదంటే..మేం వేరే లాయర్‌ను చూసుకుంటామని మహా గట్టిగా  సమాధానమిస్తుంది.
 
మీరు ఇద్దరూ అంత గట్టిగా అడుగుతున్నారంటే తప్పకుండా ఇప్పిస్తానని చెప్పిన లాయర్‌....మీకు పెళ్లయినట్లు మ్యారేజీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు. ఉందని మహా అతనికి మ్యారేజీ సర్టిఫికేట్‌ ఇస్తుంది.అది చూసిన లాయర్‌ షాక్‌ తింటాడు.మీ పెళ్లి పోలీసుస్టేషన్‌లో జరిగిందా అని అడుగుతాడు.అవునని మహా సమాధానమిస్తుంది. ఎందుకు అలా జరిగిందని అడిగితే....మా ఇంట్లో నుంచి మేం పారిపోయి వచ్చామని,మా వాళ్లు వెంబడిస్తుంటే పోలీసులను ఆశ్రయిస్తే పెళ్లి చేశారని చెబుతుంది. సరే అయితే ఇద్దరి ఆధార్ కార్డులిస్తే డైవర్స్‌కు అప్లై చేస్తానని అంటాడు. నేను ఇంట్లో నుంచి వచ్చే హడావుడిలో ఆధార్‌ కార్డు తీసుకురావడం మర్చిపోయానని మహా అంటుంది.అలా అయితే పోలీసుస్టేషన్‌లో పెళ్లి ఎలా చేశారని...రిజిస్ట్రేషన్ ఎలా చేయించారని లాయర్ ప్రశ్నిస్తాడు. అవును కదా పోలీసులు ఆధార్‌కార్డు లేకుండా  పెళ్లి ఎలా చేశారని మహా చక్రి ప్రశ్నిస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసని చక్రి అబద్ధం చెబుతాడు. ఆధార్‌కార్డు లేకుండా పోలీసులు అసలు పెళ్లి చేయరని లాయర్‌ చెప్పడంతో మహా అనుమానం ఇంకా బలపడుతుంది. మీరు ఆధార్ కార్డు తీసుకురాకుండా విడాకులు ఇప్పించలేమని చెప్పి లాయర్‌ వాళ్లిద్దరినీ పంపించేస్తాడు.
 
బయటకు వచ్చిన మహా...చక్రిని నిలదీస్తుంది. పోలీసులకు ఆధార్‌కార్డు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. నన్ను  అడిగితే నేను ఎలా చెప్పగలనని...నేను కూడా ఆరోజు మీపక్కనే ఉన్నాను కదా అని అంటాడు. మీ నాన్న వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నారేమో అని చెప్పగా....వాళ్లు వచ్చిందే నా పెళ్లి ఆపడానికి అయితే ఆధార్‌ కార్డు ఎందుకు ఇస్తారని నిలదీస్తుంది. మరి నాకు ఏం తెలియదని చక్రి అడగ్గా....అసలు పోలీసులు ఆధార్‌ కార్డులేకుండా ఎలా పెళ్లి చేశారో కనుక్కోవాలని అంటుంది. ఇప్పుడు ఈలాయర్‌ లేనిపోనివి చెప్పాడని చక్రి తిట్టుుకుంటాడు. ఈ మహా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టిందంటే నా గుట్టు మొత్తం తెలిసిపోతుందని చక్రి అనుకుంటాడు.
 
మహాను మభ్యపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. నాకు వేరే పనుందని మీరు ఇంటికి వెళ్లండని చెప్పి పంపించేస్తాడు. మహా వెళ్లిపోయిన తర్వాత కానిస్టేబుల్‌ను కలిసి చక్రి తన గోడు వెళ్లబోసుకుంటాడు. మీరు కష్టపడి పెళ్లిచేస్తే...మా ఆవిడ రెండునెలలు తిరగకుండానే నాకు  విడాకులు ఇచ్చి వెళ్లిపోతానంటుందని అంటాడు. ఎందుకు అలా చేస్తుందని అడిగితే వాళ్ల పుట్టింటి వాళ్లు ఫోన్‌ చేసి ప్రేమతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని దీంతో నా భార్య కరిగిపోయి నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటుందని..ఇప్పుడే లాయర్‌ను కలిసి వస్తున్నామని చెబుతాడు.మీరు కొంచెం  ఆమెకు ఫోన్ చేసి విడాకులు తీసుకోకూడదని బెదిరించాలని అంటాడు. దీనికి ఆ కానిస్టేబుల్ సరేనని చెబుతాడు.
 
 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 29th: 'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget