అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki  Serial Today: శ్రీలక్ష్మీ వల్లే మ్యాడీ కేసులో ఇరుక్కున్నాడన్న ప్రియంవద.. శ్రీలక్ష్మీపై మ్యాడీకి ఉన్నది నిజమైన ప్రేమేనా...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode March 16th:కోర్టులో నిజం నిరూపించి భార్యను కేసు నుంచి తప్పించిన మ్యాడీ...? మరి ఈ కేసులో అసలు నిందితులు ఎవరు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: చివరి నిమిషంలో బుల్లిరాజును న్యాయస్థానం ముందు నిలబెట్టి శ్రీలక్ష్మీకి  శిక్షపడకుండా కాపాడిన మధుసూధన్‌ను  న్యాయమూర్తి అభినందిస్తాడు. పోలీసులు కూడా చేయని సాహసాన్ని చేసి దోషులకు శిక్షపడేలా చేశాడని పొగడ్తలతో ముంచెత్తుతాడు. శ్రీలక్ష్మీని విడుదల చేయాలని ఆదేశించి బుల్లిరాజుకు శిక్ష విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలిస్తాడు. మ్యాడీ చేసిన పనికి వాళ్ల తాతయ్య ఎంతో అభినందిస్తాడు.ఇప్పుడు నిన్ను చూస్తే గర్వంగా ఉంది రా  అని అంటాడు.
 
భర్త కోసం భార్య త్యాగం చేస్తే...ఆమెను కాపాడుకోవడం కోసం నువ్వు చేసిన పని చాలా గొప్పగా అనిపిస్తోందని సూర్యనారాయణ మ్యాడీని పొగుడుతాడు. తన భర్త  తనను కాపాడటంతో శ్రీలక్ష్మీ కూడా ఎంతో ఆనందపడుతుంది.అసలు బుల్లిరాజుకు నీకు గొడవ ఏంటని ఎందుకు వాడు కిడ్నాప్ చేశాడని లాయర్ బాబాయి అడగటంతో మ్యాడీ  మొత్తం చెబుతాడు.తాను సాక్ష్యాలు తీసుకుని వస్తుంటే వాళ్లు నన్ను కొట్టి బంధించారని...నేను ఎలాగోలా తప్పించుకుని వాళ్ల చెర నుంచి విడిపించుకున్నానని వివరిస్తాడు. వాళ్లనే చితకబాది న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చానని చెబుతాడు. వాళ్లు నన్ను ఈకేసులో ఇరికించి శ్రీలక్ష్మీని తీసుకెళ్లేందుకు ప్లాన్ వేసి ఉంటారని చెబుతాడు.
 
శ్రీలక్ష్మీ,మ్యాడీని తీసుకుని ఇంటికి వచ్చిన సూర్యనారాయణను ఇందిర గుమ్మంలోనే ఆపుతుంది. హైమావతి లోపలికి పరుగెత్తికెళ్లి హారతి తీసుకుని వస్తుంది. లక్ష్మీ, మ‌్యాడీ ఇద్దరికి హారితి ఇచ్చి దిష్టి తీస్తుంది. తొలిసారి వాళ్ల అత్తయ్య దిష్టి తీయడమేగాక...తనకు బొట‌్టుపెట్టి లోపలికి ఆహ్వానించడం చూసి శ్రీలక్ష్మీ కూడా ఆశ్చర్యపోతుంది. తన కొడుకు కోసం జైలుకు వెళ్లేందుకు శ్రీలక్ష్మీ చేసిన త్యాగం చూసి హైమావతి మనసు కూడా కరిగిపోతుంది. కానీ ఇదంతా చూసిన ప్రియంవద మాత్రం కోపంతో రగిలిపోతుంది. అసలు దీనంతటికి కారణం ఈ శ్రీలక్ష్మీనేనని..మండిపడుతుంది. నా మేనల్లుడిని కోర్టు కేసుల్లో ఇరికించి ఆ బుల్లిరాజుగాడు  దీన్ని తీసుకెళ్లిపోదామని ప్లాన్ వేశాడని..ఇదంతా దీనికి తెలియకుండానే జరిగిందా అని నిలదీస్తుంది. ఆ మాటలు విన్న  సూర్యనారాయణ కోపంతో రగిలిపోతాడు. కూతురుని నోరుమూసుకుని ఉండమని హెచ్చరిస్తాడు.
 
భర్త చేసిన తప్పు తన మీద వేసుకుని జైలుకు వెళ్లడానికి సిద్ధపడిన శ్రీలక్ష్మీ త్యాగం గుర్తించకపోయినా పర్వాలేదు గానీ...ఆమెపై నిందలు వేస్తే మాత్రం సహించేది లేదని మండిపడతాడు. దీంతో ప్రియంవద మరింత రెచ్చిపోతుంది. అసలు మ్యాడీ కేసుల్లో ఇరుక్కోవడానికి ఆ బుల్లిరాజే కదా అని...దానికి ఈ లక్ష్మీయే కారణం కదా అని అంటుంది. వాడు మ్యాడీని కిడ్నాప్ చేశాడని...ఏదైనా చేసి ఉంటే ఏం చేసేవాళ్లని అంటుంది. ఇంత వరకు మన ఇంట్లో పోలీసుస్టేషన్ మెట్లు  ఎక్కినవాళ్లు లేరని...ఈ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టింది కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని అంటుంది. సూర్యనారాయణ కూతురిపై మండిపడి....మన ఇంట్లో ఎవరికీ లేని ఈ పాడుబుద్ది నీకు ఎలా వచ్చిందని మందలిస్తాడు. ఆమె మాటలు పట్టించుకోవద్దని మీరు వెళ్లండని చెబుతాడు. స్నానం చేసి వస్తే మీకు నచ్చిన వంటలన్నీ మీ అత్తయ్య సిద్ధం చేసి ఉంచిందని చిన్నత్త చెప్పడంతో మ్యాడీని తీసుకుని శ్రీలక్ష్మీ పైకి వెళ్తుంది.
 
తన గదిలోకి వెళ్లిన తర్వాత నాకోసం నువ్వు ఇదంతా చేశావని తెలిస్తే ఎంతో ఆనందంగా ఉందని శ్రీలక్ష్మీ మ్యాడీతో అంటుంది. దీనికి మ్యాడీ బదులిస్తూ...కింద తాతయ్యవాళ్లు పొగిడారని సంబరపడొద్దని....అసలు ఇదంతా జరిగింది నీవల్లేనని మ్యాడీ మండిపడతాడు. నీప్లేస్‌లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగే చేసేవాడినని చెబుతాడు. అంతమాత్రానా నీపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు కాదని తిడతాడు. మ్యాడీ తిడుతుంటే శ్రీలక్ష్మీ ఆలోచిస్తుంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నావని అడగ్గా...రేపు కాలేజీలో జరిగే ఫ్రెషరస్‌డేగ గురించి అని చెప్పడంతో మ్యాడీ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫ్రెషరస్‌ డేకు మ్యాడీ హీరోలా రెడీ అయిపోతాడు.
 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget