Brahmamudi Serial Today march 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును తిట్టిన రేఖ – నిజం చెప్పిన స్వాతి
Brahmamudi serial today episode march 17th: పోలీస్ స్టేషన్ నుంచి వస్తూ రేఖకు దొరికిపోతారు ఇందు, స్వాతి, ఐశ్వర్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు తాగిన మైకంలో ఉన్న ఐశ్వర్య చుక్కలు చూపిస్తుంటుంది. రాజు వచ్చి లక్కీని తీసుకెళ్తాడు. ఐశ్వర్య కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఇక్కడకు రమ్మని చెప్పండి అంటూ ఎస్సై చెప్తుండగానే.. ఇందు, స్వాతి వస్తారు.
ఎస్సై: అమ్మా ఈవిడ మీ తాలూకానేనా..?
ఇందు: అవును సార్ ఇవాళ ఎగ్జామ్ పూర్తి అయిందని ఏదో పార్టీకి వెళ్లింది. అక్కడ కొంచెం డ్రింక్ చేసినట్టు ఉంది. సారీ సార్
ఎస్సై: ఏదో కొంచెమా..? పోలీసులకు రౌడీలకు తేడా తెలియనంతగా తాగేసింది. (అక్కడే ఉన్న నందు చూస్తుంటుంది.) వచ్చినప్పటి నుంచి కిడ్నాప్ అంటూ ఒక్కటే గొడవ. పోనీ పంపిచేద్దాం అనుకుంటే బయటికి వెళ్లగానే.. ఏదైనా జరిగితే అది మాకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయం.. అందుకే ఇప్పటి వరకు భరించాల్సి వచ్చింది..
స్వాతి: పోనీ తన ఫొన్ తీసుకుని మాకు కాల్ చేయాల్సింది
ఎస్సై: ఫోన్ తీసుకుని ఫోన్ చేయాలా..? అది కూడా చూడండి.. కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వు..
కానిస్టుబుల్: ఇదిగో అమ్మా లాక్ ఓపెన్ చేయ్..
ఐశ్వర్యకు ఫోన్ ఇవ్వగానే.. తాగిన మైకంలో ఐశ్వర్య ఏదేదో చేస్తుంటుంది.
ఎస్సై: ఒకసారి మీ ఫోన్ అన్‌లాక్ చేసి ఇవ్వండి
ఐశ్వర్య: ష్యూర్ ఇప్పుడే చేస్తా..
గాలిలో ఆన్‌లాక్ చేస్తుంది.
ఎస్సై: వచ్చినప్పటి నుంచి అలా గాలిలో నొక్కుతూనే ఉంది. కానీ ఫోన్ మాత్రం లాక్ ఓపెన్ అవ్వదు.. ఎంతో మంది డబ్బున్నోళ్లను చూశాము కానీ ఈ రేంజ్ లో మమ్మల్ని ఎవ్వరూ ఆడుకోలేదు అమ్మా.. నిమిషానికో మాట మాట్లాడుతుంది ఐదు నిమిషాలకు ఒక గొడవ చేస్తుంది
ఇందు: సార్ మా ఐశ్వర్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను సార్
నందు: చూశావా బాబాయ్ దాని పొగరు.. ఇందాక నేను పబ్బులోకి వెళ్లినప్పుడు కూడా చాలా పొగరుగా మాట్లాడింది. అప్పుడే నాలుగు పీకుదామనుకున్నాను.. పని మీద ఉన్నాను కదా అని వదిలేశాను. అమ్మా బాబులు సంపాదిస్తే ఇదిగో ఇలాగే తయారవుతారు.
బాబాయ్: వాళ్ల సంగతి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో..
నందు: వాళ్లతో పోలిస్తే నీ కూతరు బంగారం అని చెప్తున్నాను
బాబయ్: అమ్మా బంగారం బయలుదేరు
నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇందు, స్వాతి, ఐశ్వర్యను బయటకు తీసుకెళ్తారు. కారు దగ్గరకు వెళ్లిన ఐశ్వర్య గొడవ చేస్తూ.. ఇందును తోసేస్తుంది. అక్కడే ఉన్న నందు వచ్చి పట్టుకుని ఐశ్వర్యను తిట్టి వెళ్లిపోతుంది. ముగ్గురు ఇంటికి వెళ్తారు. బయటి నుంచి వచ్చిన ముగ్గురిని రేఖ చూస్తుంది. అందరూ హాల్లోకి వెళ్తారు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లావు అని రేఖ కోపంగా ఇందును తిడుతుంటే అపర్ణ అడుపడుతుంది. దీంతో రేఖ కోపంగా అపర్ణను తిడుతుంది. ఇంతలో స్వాతి రేకను అడ్డుకుని నిజం చెప్తానని పబ్బులో జరిగిన విషయం పోలీస్ స్టేషన్ విషయం చెప్తుంది. దీంతో రేఖ ముందే తనకు ఎందుకు చెప్పలేదని కోప్పడుతుంది. మీరంటే భయం అందుకే చెప్పలేదని రేఖ బాధగా నిద్రొస్తుందని వెళ్లిపోతుంది. ఇందు కూడా తనకు నిద్ర వస్తుందని వెళ్లిపోతుంది. భ్రమరాంబ మాత్రం స్వాతిని తలుచుకుని ఏడుస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Brahmamudi serial today episode
Image Credit BY: Jio Hotstar/ Star Maa.com
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















