Meghasandesam Serial Today November 16th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీని ఫాలో చేసిన అపూర్వ – స్టోర్ రూంలోకి వెళ్లిన కేపీ
Meghasandesam serial today episode November 16th:కేపీ స్టోర్ రూంలోకి వెళ్లగానే బయటి నుంచి అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: నక్షత్ర, గగన్ పక్కన కూర్చుని భూమిని వదిలేసి తనను పెళ్లి చేసుకో అని చెప్తుంటే.. ముసుగు వేసుకుని వాళ్ల వెనకే కూర్చున్న భూమి కోపంగా నక్షత్రను కొడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో నక్షత్ర మళ్లీ టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా కలిసి మాట్లాడుకుందా అని వెళ్లిపోతుంటే..
గగన్: ఆగు..
నక్షత్ర: ఏంటి బావ.. చెప్పు…
గగన్: నా సమాధానం వినకుండా నీ మనసులో ఉన్నది అంతా చెప్పి నువ్వు వెళ్లిపోతున్నావంటే దాని అర్థం నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను అనే కదా..?
నక్షత్ర: అంటే ఒప్పుకోలేదా.? బావ.. ఇంకా ఆ మాయదారి భూమినే నమ్ముతున్నావా..?
గగన్: నేను భూమిని నమ్ముతున్నానా..? ద్వేషిస్తున్నానా..? నమ్మడం లేదా..? అన్నది పక్కన పెట్టు ఇక నీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు మాటలో రూపంలో నీ మనసులోంచి వచ్చిన చెత్తనంతా తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయ్.. ఇంకా నా తమ్ముడు చెర్రి గురించి ఏమన్నావు.. వాడో చిత్త కార్తె కుక్క వాడో వుమనైజర్ అన్నావు కదా..? వాడు ఎప్పుడైనా అమ్మాయితో తిరగడం..మిస్ బిహేవ్ చేయడం నువ్వు ఎప్పుడైనా చూశావా..?
నక్షత్ర: అంటే బావ..
గగన్: ఏయ్ అంటే గింటే కాదు.. స్ట్రెయిట్‌గా పాయింట్ కు రా సమాధానం చెప్పు.. చూశావా లేదా..?
నక్షత్ర: లేదు చూడలేదు బావ
గగన్: వాడు వుమనైజర్ కాదు నక్షత్ర ఎవరో అమ్మాయి తనను ప్రేమించాలని తపించిన ఒక వెర్రి వాడు.. నక్షత్ర వాణ్ని నువ్వు ఒక్కసారి ప్రేమించి చూడు తిరిగి వాడు ప్రేమను కాదు ప్రాణం ఇస్తాడు. ముందు నువ్వు పెళ్లి బంధానికి కట్టుబడు.. వాడు జీవితాంతం నీకు కట్టుబడి ఉంటాడు.. అది నా తమ్ముడు చెర్రి..
నక్షత్ర: నీకు నీ తమ్ముడు అర్థం అయ్యాడు కానీ నా ప్రేమ అర్థం కాలేదా.? బావ..
అని చెప్తుండగానే.. ముసుగులో ఉన్న భూమి కోపంగా వెళ్లి నక్షత్రను కొడుతుంది.
భూమి: ఇంతా చెప్పిన కూడా ఇంకా సెరం లేకుండా మాట్లాడుతున్నావా..?
నక్షత్ర: నీకు ఎందుకే మధ్యలో
భూమి: పెళ్లి అయిన దానివి ఇంకో పెళ్లి అయిన వాడిని ప్రేమించమని అడిగితే.. సీరియల్ నే ప్రాణంగా చూసేదాన్ని నాకు కాక ఇంకెవరికి వస్తుందే గుస్సా..? నువ్వు ఇంకోక మాట మాట్లాడితే నా చేతిలో నీ మర్డర్ ఖాయం..
అంటూ వార్నింగ్ ఇవ్వగానే.. నక్షత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
భూమి: సార్ మీది బీబీతో మీది సంతోషంగా ఉండండి..
గగన్: అయ్యో నాకు బీబీ లేదు.. నాకు ఇంకా పెళ్లి.. మీ లాంగ్వేజ్‌లో ఓ తింగరి గ్రహం నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉంది.
ఇంతలో నర్సు వచ్చి సార్ మీరు అడిగిన సీసీటీవీ పుటేజీ సెక్యూరిటీ రూంలో ఉంది. అక్కడి రండి చూద్దురు అని చెప్పగానే.. ఓకే వెళ్దాం పద అని ఇద్దరూ రూంలోకి వెళ్తారు. భూమి కంగారుగా వెళ్లిపోతుంది.
మరోవైపు కేపీని చూసిన అపూర్వ పట్టుకోవడానికి వెళితే కేపీ స్టోర్ రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకుంటాడు. బయటి నుంచి అపూర్వ కేపీకి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అక్కడికి గగన్ వస్తాడు. గగన్ ను చూసిన అపూర్వ భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















