Meghasandesam Serial Today November 14th: ‘మేఘసందేశం’ సీరియల్ : ఇందుకు తాళి కట్టిన వంశీ – శారదకు రౌడీతో పెళ్లి చేయించిన అపూర్వ
Meghasandesam Today Episode: ఇందు పెళ్లి వీడియో చూసిన శరత్చంద్ర శారదను వదిలేయమని చెప్తాడు. అపూర్వ వెళ్లి రౌడీతో శారద పెళ్లి చేయించాక వదిలేయమని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: వంశీ చేత ఇందుకు తాళి కట్టిస్తాడు గగన్. వంశీ తాళీ కట్టడాన్ని వీడియో తీస్తాడు గగన్. ఇందు హ్యాపీగా ఫీలవుతుంది. మీరా ఆనందంతో ఏడుస్తుంది. మరోవైపు గగన్ తీసిన వీడియోను శరత్ చంద్రకు సెండ్ చేస్తాడు. ఆ వీడియో చూసిన శరత్ చంద్ర హ్యపీగా ఫీలవుతాడు. ఇంతలో గగన్ శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇకనైనా మా అమ్మను వదిలేయ్. లేదంటే ఇప్పటి వరకు నేను ఆపుకున్న ఆవేశానికి ఇక్కడ ఎవ్వరూ మిగలరు అని చెప్పగానే శరత్ చంద్ర నీ మాట నువ్వు నిలబడ్డప్పుడు నా మాట మీద నేను నిలబడతాను ఇక మీ అమ్మను వదిలేస్తాను అని చెప్తాడు. ఇందు, వంశీ, మీరా గగన్‌కు మొక్కుతారు. గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శరత్‌చంద్ర రౌడీలకు ఫోన్ చేసి శారదను వదిలేయమని చెప్తాడు. రౌడీలు శారదను వెళ్లిపోమ్మని చెప్తారు. శారద వెళ్లిపోతుంటే. అపూర్వ, సుజాత వస్తారు. అపూర్వను చూసిన శారద షాక్ అవుతుంది.
రౌడీలు: మేడం ఈవిడను సార్ వదిలేయమన్నారు.
అపూర్వ: అందుకనే నేను వచ్చాను. ఏంటి అర్థం కాలేదా..? రంగ నీకు ఇంకా పెళ్లి అవ్వలేదని ఎప్పటి నుంచో తెగ బాధపడుతున్నావు కదా..? నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానురా… పెళ్లి కూతురు ఎవరో తెలుసా..? ఈ శారద.
రంగ: మేడం మీరు నా దేవత మేడం. అసలు నా బతుక్కు పెళ్లి అవుతుందా లేదని అలిసిపోయాను మేడం. మీరు నాకు పెళ్లి చేస్తున్న దాత కాదు మేడం. అమ్మోరు తల్లి లాంటోళ్లు.
సుజాత: ఇది కరెక్టే ఇలాంటి వెధవలందరికీ మా అపూర్వ అమ్మోరే..( మనసులో అనుకుంటుంది)
శారద: అపూర్వ ఏంటి నువ్వు చేస్తున్న పని. నా కొడుక్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు.
అపూర్వ: నోరు మూయ్.. రామ్ములమ్మ దీన్ని లాక్కెళ్లి పెళ్లి కూతురుని చేయండి.
శారద: అపూర్వ ఇది అన్యాయం..
సుజాత: నువ్వెప్పుడు న్యాయం చేశావని…
అపూర్వ: పిన్ని కాసేపు నోరు మూయకపోతే ఇంకొక రౌడీతో నీ పెళ్లి చేస్తాను. ఇంకేంట్రా ఇలాగే ఉన్నావు వెళ్లి రెడీ అవ్వు..
అని చెప్పగానే రంగ రెడీ అవ్వడానికి వెళ్తాడు. రాములమ్మా వాళ్లు శారదను తీసుకెళ్లి పెళ్లికూతురుగా రెడీ చేస్తుంటారు. కొద్దిసేపట్లోనే శారదను రెడీ చేసి తీసుకొస్తారు. రంగ రెడీ అయి వచ్చి తాళి కట్టబోతుంటే కత్తి పట్టుకుని భూమి అక్కడకు వస్తుంది. రేయ్ ఆపరా అంటుంది.
అపూర్వ: ఈ సింహం చేసే పని అపడానికి ఈ చిట్టెలుక వచ్చిందిరా..? రేయ్ రంగా ఏంట్రా చూస్తున్నావు తాళి కట్టు..
రంగ: అలాగే మేడం..
అని తాళి కట్టబోతుంటే.. భూమి కత్తితో అపూర్వ మెడ మీద పెడుతుంది.
భూమి: ఇప్పుడు కట్టమను తాళి. అక్కడ తాళి కట్టాలి ఇక్కడ పీక కట్టు అవుద్ది. రేయ్ వదలరా తాళి.
రంగ: మీరేం అంటారు అమ్మోరు తల్లి ఏం చేయమంటారు.
అపూర్వ: ఒరేయ్ కళ్లు కనిపించడం లేదా..? వదిలేయ్..
రంగ: మీరు అమ్మోరు తల్లి అనుకున్నాను. గుడి కట్టాలనుకున్నాను. వదిలేయ్ అంటారేంటమ్మా. అవ్వక అవ్వక ఇన్నేళ్లకు నాకు పెళ్లి అవుతుంది. నా పెళ్లి కోసం మీరు ఒక్కసారి చచ్చిపోలేరా..? చచ్చిపోండి అమ్మా.. సరేనా..
అంటూ రంగ తాళి కట్టబోతుంటే.. భూమి కత్తతో వెళ్లి రంగను చంపేస్తానని రంగ గొంతు మీద కత్తి పెడుతుంది. చెప్తే అర్తం కావడం లేదారా.. పీక తెగుద్ది అంటుంది. ఇంతలో వెనక నుంచి వచ్చిన అపూర్వ భూమిని తలమీద కొడుతుంది. దీంతో భూమి కిందపడిపోతుంది. రంగ భయంతో అపూర్వ కాళ్ల మీద పడతాడు. దీంతో రంగను తిట్టి వెళ్లి తాళి కట్టు అని చెప్తుంది. రంగ తాళి కట్టబోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!