Meghasandesam Serial Today June 23rd: ‘మేఘసందేశం’ సీరియల్: రూంలోనే భూమికి తాళి కట్టిన గగన్ - సంతోషంతో పొంగిపోయిన భూమి
Meghasandesam Today Episode: రూంలో ఉండగా తన మెడలో తాళి కట్టమని భూమి అడుగుతుంది. సరేనని గగన్ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: పూరి మెహందీ వేయించుకుని గగన్‌కు చూపిస్తుంది. గగన్ బాగుంది కానీ ఈ తతంగం అంతా పెళ్లి కూతురు ఇంట్లో జరుగుతుందేమో అంటాడు. వాళ్లే పెళ్లి వాళ్లా మనం కాదా డబ్బులు ఇచ్చి పంపించు అన్నయ్య అంటుంది. గగన్ మెహందీ వేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి పంపిస్తూ.. అవును అమ్మ ఎక్కడ పూరి అని అడుగుతాడు. సాయంత్రం నుంచి హెడేక్ అని రూంలో ఉండిపోయింది అని చెప్తుంది. గగన్ శారద దగ్గరకు వెళ్తాడు. రూంలో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది శారద. గగన్ రావడంతో కన్నీళ్లు తుడుచుకుంటుంది.
గగన్: అమ్మా ఏదో హెడేక్ అని సాయంత్రం నుంచి పడుకున్నావట. ఇప్పుడు ఎలా ఉంది. మెడిసిన్ తీసుకున్నావా..?
శారద: మెడిసిన్ తీసుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు.
గగన్: నా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నావు అమ్మా ఇప్పుడు నీ కలలన్నీ నిజం అయ్యే టైం వచ్చేసింది అమ్మా.. ఇప్పుడు నువ్వు ఇలా ఉండటం బాధగా ఉందమ్మా..?
శారద: తలపోటే కదమ్మా తగ్గిపోతుందిలే.. నీ పెళ్లి అయితే మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది.
గగన్: అయితే ఏంటమ్మా… అయిపోతుంది కదా..?
శారద: అదే నీ పెళ్లి అయ్యాక ఈ అమ్మ మనసు ఆనందంగా ఉంటుంది అంటున్నాను.
ఇంతలో భూమి, గగన్‌కు ఫోన్ చేస్తుంది.
గగన్: అమ్మా మీ కోడలు ఫోన్ ఒక్క నిమిషం
అంటూ గగన్ పక్కకు వెళ్లిపోతాడు. తన రూంలోకి వెళ్లిన గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు.
గగన్: చెప్పండి తైతక్క గారు.
భూమి: మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ నడుస్తుంది తలతిక్క గారు.
గగన్: మా ఇంట్లో కూడా నడిచింది. పూరి తన రెండు చేతులను ఫుల్ డిజైన్స్‌తో నింపేసింది.
భూమి: అలాగా అది సరే తలతిక్క గారు మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు.
గగన్: నేను రాను తైతక్కగారు పెళ్లి అయ్యాక తమరే తైతక్క తైతక్క అని ఆనందంగా గెంతుకుంటూ ఇక్కడికే రావాల్సి ఉంటుంది.
భూమి: అబ్బా నేను అడుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని రమ్మని..
గగన్: ఎందుకో…?
భూమి: నా కాళ్లకు చేతులకు మీరే మెహందీ పెట్టాలి.
గగన్: హలో నేనా..?నాకు మెహందీ పెట్టడమే రాదు..
భూమి: మీరు ఎలా పెట్టినా పర్వాలేదు.. కానీ మీరు మెహందీ పెట్టిన చేతులతోనే నేను మీ మీద తలంబ్రాలు పోయాలి. మీరు మెహందీ పెట్టిన కాళ్లతోనే నేను మీ ఇంట్లో అడుగుపెట్టాలి.
అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. గగన్ హలో హలో అంటూ నవ్వుకుంటాడు. ఇంతలో భూమి గదిలోకి చెర్రి వస్తాడు.
చెర్రి: హలో మిస్ పెళ్లికూతురు గారు
భూమి: ఎస్ మిస్టర్ చెర్రి గారు కూర్చోండి..
చెర్రి: ఏదో తలుచుకుని నీ ఫేస్‌లో ఏదో చిన్న మెరుపు కనిపిస్తుంది. అన్నయ్య గుర్తుకు వస్తున్నాడా..?
భూమి: గుర్తుకు రావడం కాదు.. మీ అన్నయ్యే వస్తున్నాడు.
చెర్రి: అయితే సోదరుడి సమక్షంలో మెహందీ పెట్టించుకుంటున్నారన్నమాట.
భూమి: లేదు మీ అన్నయ్యతోనే మెహందీ పెట్టించుకుంటాను.
చెర్రి: సోదరుడికి మెహందీ పెట్టడం రాదు కదా..?
భూమి: వచ్చినట్టే పెట్టమని మీ అన్నయ్యకు చెప్పాను చెర్రి..
అని భూమి చెప్పగానే అయితే నేను వెళ్లి నా డార్లింగ్ కు మెహందీ పెడతాను అంటూ చెర్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత గగన్ వచ్చి భూమికి మెహందీ పెడతాడు.
గగన్: ఇక అయిపోయింది.
భూమి: చూస్తున్న కొద్దీ తెగ ముద్దొస్తున్నారు తలతిక్క గారు.
గగన్: అయితే చూసుకోండి తైతక్కగారు
భూమి: అది సరే కానీ బావ నాకు తాళి కడతావా..?
గగన్: ఎందుకు కట్టను పెట్టించారు కదా మీ నాన్న ముహూర్తం.
భూమి: నేను అడిగింది అప్పటి సంగతి కాదు బావ. ఇప్పుడు నా మెడలో తాళి కడతావా అని అడుగుతున్నాను
అంటూ భూమి చెప్పగానే.. సరే అంటూ గగన్ మెహందీతో భూమి మెడలో తాళి డిజైన్ వేస్తాడు. అది చూసుకుని భూమి హ్యాపీగా పీలవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















