Meghasandesam Serial Today July 8th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు షాక్ ఇచ్చిన భూమి – పెళ్లిమండపంలోంచి వెళ్లిపోయిన భూమి
Meghasandesam Today Episode: పెళ్లి కన్నా డాన్సే ముఖ్యం అనుకున్న భూమి మండపంలోంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: పెళ్లి కూతురుగా రెడీ అయిన భూమి దగ్గరకు వెళ్లిన గగన్ ఎమోషనల్ అవుతూ ఎన్నో రోజులుగా మనం ఈ రోజు కోసమే ఎదురుచూశామని చెప్తుంటాడు. భూమి మాత్రం మౌనంగా వింటుంది. దీంతో ఆనందం నీ కళ్లల్లో కనిపించడం లేదు అని గగన్ అడుగుతాడు.
భూమి: అదేం లేదు బావ నేను ఆనందంగానే ఉన్నాను.
గగన్: మాట ఆనందంగా ఉన్నా మనసులో దిగులు నీ కళ్లల్లో కనిపిస్తుంది భూమి. ఎందుకంటే.. అక్కడ డాన్స్ కాంపీటీషన్ వదులుకుని వచ్చి ఇక్కడ నా పక్కన పెళ్లి కూతురుగా కూర్చోవాల్సి వచ్చింది. ఇలా వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు భూమి.
భూమి: మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బావ. నేను అర్థం చేసుకోగలను.
గగన్: చెప్పకుండానే అర్థం చేసుకునే అమ్మాయి నాకు అర్థాంగిగా దొరకడం నా అదృష్టం. థాంక్యూ భూమి.
భూమి: ఇట్స్ ఓకే బావ..
గగన్: నీ ముఖంలో ఇంకా దిగులు చాయలు పోలేదు భూమి. మనం ఇద్దరం కలిస్తే.. జతగా కలిసి జన్మజన్మలు నడిస్తే అన్న ఊహకు వచ్చే ఆనందం ఉంటుందే ఆ ఆనందం ఒక్కసారి
అని గగన్ చెప్తుండగానే.. భూమి నవ్వుతుంది. గగన్ నవ్వుతాడు.. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో సుజాత వచ్చి భూమిని లోపలికి తీసుకుని వెళ్తుంది. మరోవైపు పెళ్లి మండపంలో హ్యాపీగా ఉన్న ప్రసాద్‌ను మీతో మాట్లాడాలి అని శారద, కేపీని పక్కకు తీసుకెళ్తుంది. అక్కడ మీరా పెట్రోల్ బాటిల్‌తో ఉంటుంది.
కేపీ: మీరా నువ్వేంటి అసలు ఏం జరుగుతుంది. మాట్లాడరేంటి..?
మీరా: మీ అబ్బాయి గగన్‌కు భూమిని ప్రేమించాలన్న ఆలోచన తనంతట తనకు పుట్టింది కాదు. మీరే పుట్టించారు. తనను భూమి మీదకు ఎగదోశారు. ప్రేమ నాటకంతో ఈ పెళ్లి జరిగితే మీ ఇద్దరూ ఒకటై పోదామనుకున్నారు.
కేపీ: మీరా నువ్వు అమాయకురాలివి అనుకున్నాను కానీ ఇలా ఆలోచిస్తావని అసలు అనుకోలేదు. భూమి, గగన్‌ల ప్రేమను మా ప్లాన్ అని చెప్పి పాడు చేయకు.
మీరా: నాకు ఈ నీతి సూత్రాలు అవసరం లేదు. ప్లాన్ కాకపోతే మీరిద్దరూ ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టండి. శారద నువ్వు మర్చిపోతున్నావు. విడాకులు ఇస్తానని మీ అబ్బాయి గగన్ మీద ఒట్టు పెట్టావు.
శారద: మర్చిపోలేదు మీరా..? నేను నా మాట మీదే నిలబడతాను.
అంటూ శారద ఏడుస్తూ.. డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతుంది. అలాగే కేపీ కూడా సంతకం పెట్టాలని లేకపోతే ఆ పెట్రోల్ పోసుకుని నేనే చనిపోతాను అంటూ బెదిరిస్తుంది శారద. దీంతో కేపీ ఏడుస్తూ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాడు. అంతా చాటు నుంచి భూమి చూస్తుంది. షాకింగ్‌గా అలాగే నిలబడిపోతుంది. శారద ఏడుస్తూ ఉంటుంది. మీరా, కేపీ వెళ్లిపోతారు. బాగా ఆలోచించుకున్న భూమి ఇలా జరగడానికి వీల్లేదు.. ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకున్న భూమి పెళ్లి మండపంలోంచి డాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లిపోతుంది. ఇంతలో పంతులు పెళ్లి కూతురును తీసుకురండి అని చెప్తాడు. లోపలికి వెళ్లిన సుజాత కగారుగా బయటకు వస్తుంది.
సుజాత: అమ్మాయి పెళ్లి కూతురు కనిపించడం లేదు.
అందరూ షాక్ అవుతారు. మరోవైపు భూమి డాన్స్ కాపిటీషన్‌లో డాన్స్ చేస్తుంటుంది.
ముత్తైదువ: నేను ముందే అనుకున్నాను. మగ దిక్కు లేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలిగా వెళ్తుందా అని అనుకుంటూనే ఉన్నాను.
అంటూ మాట్లాడుతుంటే గగన్ బాధతో ఏడుస్తుంటాడు. అపూర్వ, శరత్‌చంద్ర మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















