అన్వేషించండి

Meghasandesam Serial Today January 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌:   గగన్‌ ఫోన్‌ పగులగొట్టిన భూమి – నిజం చెప్పిన గాయత్రి

Meghasandesam Today Episode:  గగన ఫోన్‌ చెక్ చేయాలి అనగానే బయటకు వెళ్లి గగన్‌ ఫోన్‌ పగులగొడుతుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: లోపలికి వచ్చిన గగన్‌ను ఫోన్‌ ఇవ్వు అని అడుగుతుంది సుజాత. తన ఫోన్‌ ఎక్కడో పడిపోయిందని అంటాడు గగన్‌. చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకుడిగా మాట్లాడుతున్నావా..? నా కూతురు నక్షత్ర డ్రెస్‌ చేంజ్‌ చేసుకుంటుంటే ఫోటోలు తీసి ఇప్పుడు ఫోన్‌ కనిపించడం లేదు అంటూ నాటకాలు ఆడుతున్నావా..? అంటుంది. దీంతో గగన్‌ కోపంగా అపూర్వను తిడతాడు. శరత్‌ చంద్ర.. గగన్‌ను తిడతాడు. ఇంతలో మినిస్టర్‌ ఇద్దరిని ఆపి గగన్‌ నీ క్యారెక్టర్‌ ప్రూవ్‌ చేసుకోవాలంటే నీ ఫోన్‌ ఇవ్వు అంటాడు. నా దగ్గర లేదు అంటాడు గగన్‌. అయితే ఇలంతా వెతుకండి అని శరత్ చంద్ర చెప్తాడు. ఇంతలో భూమికి గాయత్రి ఫోటోలు తీసిన విషయం గుర్తుకు వచ్చి గాయత్రిని పక్కకు తీసుకెళ్లి కొడుతుంది. వెంటనే గాయత్రి జరిగింది చెప్తుంది. భూమి వెంటనే గగన్‌ను తాను భోజనం తినిపించిన దగ్గరకు వెళ్లి గగన్‌ ఫోన్‌ తీసుకుని ఫోటోలు డిలీట్‌ చేయాలని చూస్తుంది లాక్‌ ఉండటంతో ఫోన్‌ ఓపెన్‌ కాదు. ఇంతలో సుజాత వచ్చి అందరినీ పిలుస్తుంది. అందరూ రావడం చూసిన భూమి గగన ఫోన్‌ పగులగొడుతుంది.

గగన్‌: భూమి ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అది నా హానెస్టీని ఫ్రూవ్‌ చేసుకునే ఫోన్‌.

భూమి: మా అంకుల మాట జవదాటను అని నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానకి ఈ పని చేశాను.

గగన్‌: భూమి నీకేమైనా పిచ్చా..

శరత్‌: రేయ్‌ గగన్‌ మాటలు జాగ్రత్తగా రాని.. భూమి నాకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. తనను పట్టుకుని పిచ్చి గిచ్చి అన్నావో బాగుండదు.

గగన్‌: మీరంతా కలిసి నా మీద నింద వేశారు. ఆ నింద నిజం కాదని ప్రూవ్‌ చేయడానికి ఆ ఫోన్‌ ఒక్కటే సాక్ష్యం.

శరత్‌: అడితే పద్దతిలో అడుగు. భూమి ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది.

సుజాత: అల్లుడు గారు.. భూమి మీద మీకున్న ప్రేమో గుడ్డి నమ్మకమో భూమి ఏం చేసినా  కరెక్టు అనిపించేలా చేస్తున్నాయి. ఈ అబ్బాయి నక్షత్ర ఫోటోలు తీస్తే భూమి గగన్‌ను రక్షిస్తుందని మీకు ఎందుకు అనిపించడం లేదు.

అపూర్వ: పిన్ని చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది బావ. ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే వచ్చింది కదా..?

శరత్: ఏమ్మా వీళ్లు చెప్తుంది నిజమేనా..? ఇంకా నీకు ఆ ఇంటి మీద ప్రేమ వదల్లేదా..?

భూమి: వదిలి ఉండకపోతే నేను ఆఫోన్‌ పగులగొట్టే దాన్నే కాదు అంకుల్‌. నక్షత్ర ఫోటోలు ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను, ఆయన బయటే ఉన్నాము. ఇదిగో ఈ గోరింటాకు పిన్నే సాక్ష్యం. చెప్పు పిన్ని మేము బయట ఉన్నామా లేదా..?

సుజాత: నేను గగన్‌ను పిలవడానికి వచ్చినప్పుడు మీరు బయటే ఉన్నారు.

భూమి: అప్పుడు మేము ఏం చేస్తున్నామో చెప్పు..

సుజాత: నేను నువ్వు ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నాడు అనుకున్నాను. కానీ నువ్వే తింటున్నావు అన్నావు.

భూమి: మనసులో ఏదో పెట్టుకుని నన్ను బ్యాడ్‌ చేస్తుంది ఈ పిన్ని..నువ్వు వచ్చే సరికి ఏం చేస్తున్నామో గుర్తు చేసుకుని చెప్పు.

సుజాత: నాకు ఏం గుర్తు రావడం లేదమ్మా.. నువ్వే చెప్పు నిజమో కాదో నేను చెప్తాను.

భూమి: నేను వద్దంటున్నా ఈయన నా ఫోటోలు తీశారు అంకుల్‌.

శరత్‌: రేయ్‌ వద్దంటున్నా భూమి ఫోటోలు ఎందుక తీశావురా..?

భూమి: చెప్పండి అంకుల్‌ అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు చూస్తున్నారు. మీరు చెప్పకపోతే సుజాత పిన్ని అయినా చెప్తుంది. నన్ను చూడాలని ఉంది అని కనీసం ఫోటోలయినా తీసుకురమ్మని శారద ఆంటీ చెప్పిందంట అంకుల్‌. అయినా మీరంతా నా గతం నేను మర్చిపోవాలనుకుంటున్నాను ఫోటోలు తీయోద్దని చెప్పాను. చెప్పినా వినకుండా ఫోటోలు తీశాడని ఆ ఫోన్‌ పగులగొట్టాను.

అని భూమి చెప్పగానే కావాలనే వాణ్ని సేవ్‌ చేయడానికే భూమి అలా చెప్తుందని అపూర్వ అంటుంది. దీంతో అపూర్వ దగ్గరకి వెళ్లి గాయత్రి విషయం చెప్తుంది భూమి. అపూర్వ వెంటనే భూమి చెప్పిందే కరెక్టు అంటుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!
Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
Gundeninda Gudigantalu July28th Episode:శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి
గుండెనిండా గుడిగంటలు: శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget