Meghasandesam Serial Today January 13th: ‘మేఘసందేశం’ సీరియల్: పక్క పక్కనే వనభోజనాలకు వెళ్లిన రెండు ఫ్యామిలీలు – శరత్ చంద్రను రెచ్చగొట్టిన గగన్
Meghasandesam Today Episode: గగన్ వాళ్లకు దూరంగా వెళ్లిపోతున్న శరత్‌చంద్రను గగన్ మరింత రెచ్చగొట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: అపూర్వ ప్లాన్ చేయడంతో శరత్ చంద్ర వాళ్లు అందరూ వనభోజనాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వికారాబాద్ వెళ్లాలని ప్రసాద్‌కు ఏర్పాట్లు చూడమని చెప్తాడు. సరే అంటాడు ప్రసాద్. విషయం తెలుసుకున్న గగన్ కూడా తన ఫ్యామిలీతో వన భోజనాలకు వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం శారద, పూరి ఏర్పాట్లు చేస్తుంటారు. సామాన్లు తీసుకెళ్లి కారులో పెడుతుంటే.. అప్పుడే శరత్ చంద్ర ఇంటికి వెళ్తున్న ఇందు, వంశీ బైక్ మీద వస్తారు. కరెక్టుగా గగన్ వాళ్ల ఇంటికి రాగానే బైక్ ఆగిపోతుంది. ఇందును చూసిన శారద ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. పూరి మాత్రం కోప్పడుతుంది. పైనుంచి వచ్చిన గగన్ వాళ్లను ప్రేమగా పలకరిస్తాడు. శారద, గగన్ చూపించే ప్రేమకు ఇందు ఫిదా అయిపోతుంది. అత్తింట్లో తను పడుతున్న కష్టాలు చెప్పుకుని బాధపడుతుంది. ఇందు బాధను చూసిన పూరి కూడా ఎమోషనల్ అవుతుంది.
శారద: ఇంత బాధను నువ్వు ఒక్కదానివే మోస్తున్నావా అమ్మా..? మీ అమ్మతో చెప్పి ఆ కట్నం ఏదో ఇప్పించేయోచ్చు కద అమ్మా..
ఇందు: చెప్పాను.. ఇచ్చారు కానీ బ్యాగుల్లో పండ్లు, స్వీట్లు ఇచ్చారు.
గగన్: ఇంతలా బాధపడుతున్నా ఇంటి వైపు ఇంకా ఆశలు పెంచుకోకమ్మా.. అనుకోకుండా వచ్చినా నీ కాపురం నిలబడే దారి వైపే వచ్చావు. ఎంతో చెప్పమ్మా ఇచ్చేద్దాం.
శారద: గగన్ కాస్త ఆగరా.. ఇలా మనం మంచి చేసినా ఆ ఇంటికి చెడుగానే అర్థం అవుతుంది. ఆ అపూర్వ దీన్నే వంకగా పెట్టుకుని మేము ఇవ్వలేమా.. మా పరువు తీయాలనే కదా మీరు చేసేది అని మన వైపే వేలెత్తి చూపిస్తారు.
గగన్: వంశీ.. చిన్న వాడివైనా నీది చాలా పెద్ద మనసు. బాధపడుతున్న బయటి వాళ్లను ఆదుకోవడం కాదు. భర్తగా భార్యను ఆదరించడం గొప్ప నీ మంచి మనసుకు నా జోహార్లు.. నీకు ఇందుపై ఉన్న ప్రేమ తెలియక నేను నీ మీద చేయి చేసుకున్నాను.
వంశీ: అయ్యో బావ అది ఎప్పుడో మనసులోంచి పోయింది. అయినా నువ్వు నా మీద అలా చేయి చేసుకున్నావంటే నీ చెల్లెలు మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్తం అయింది.
అని వంశీ చెప్తుండగానే.. పెట్రోల్ తీసుకుని వచ్చిన వ్యక్తి వంశీకి ఫోన్ చేయడంతో ఇక మేము బయలుదేరుతాము అంటాడు వంశీ.. ఒక్క నిమిషం ఆగండి అంటూ చెప్పిన శారద లోపలికి వెళ్లి పసుపు, కుంకుమ, చీర తీసుకొచ్చి ఇందుకు ఇస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అందరూ కలిసి వికారాబాద్ వన భోజనాలకు వెళ్తున్నారట మేము అక్కడికే వెళ్తున్నాం అని చెప్తారు. మేము కూడా అక్కడికె వెళ్తున్నామని గగన్ వాళ్లు చెప్తారు. తర్వాత శరత్ చంద్ర వాళ్లు వన భోజనాలకు వెళ్లిన దగ్గరకే గగన్ వాళ్లు వెళ్తారు. పక్కనే గగన్ వాళ్లు టెంట్ వేసుకుని వన భోజనాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటే.. అపూర్వ, శరత్ చంద్ర కోపంగా చూస్తుంటారు. భూమి, నక్షత్ర, చెర్రి, ప్రసాద్ హ్యాపీగా ఫీలవుతుంటారు.
అపూర్వ: బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము..?
శరత్: వన భోజనాలకు
అపూర్వ: నాకైతే చావు భోజనాలకు వచ్చినట్టు ఉంది. కాలుతున్న శవాల చుట్టు ఎవరైనా విందు భోజనాలు చేయగలరా బావ.
శరత్: అవును అపూర్వ నాకు అలాగే ఉంది. అందుకే మనం ఇక్కడ ఉండటం లేదు. లోకేషన్ చేంజ్ చేస్తున్నాం.
అంటూ శరత్ చంద్ర అందరూ అన్ని సర్దుకుని పక్కకు వెళ్దాం పదండి అంటాడు. శరత్ చంద్ర కారు దగ్గరకు వెళ్లగానే గగన్ వెళ్తాడు. నవ్వుతూ శరత్ ను చూస్తూ..
గగన్: థాంక్యూ.. థ్యాంకూ వెరిమచ్..
శరత్: దేనికిరా.. థాంక్స్..
గగన్: ఎందుకంటే.. నీకు ఆల్‌రెడీ భయాన్ని పరిచయం చేశాను.
శరత్: నేను నీకు భయపడ్డానా..?
గగన్: ఎస్
శరత్: అసలు నేను నీకు ఎందుకు భయపడతానురా..?
గగన్: మీరు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడ్డావ్..
శరత్: భూమి నిన్ను ప్రేమించదు.. ప్రేమించదు.. ఉంటే నిన్ను భూమి ప్రేమిస్తుంది అన్నదే కదా నీ ఓవర్ కాన్ఫిడెంట్
అంటూ శరత్ చంద్ర కోపంగా గగన్‌ను తిట్టి మేము ఇక్కడే ఉంటాము భూమి నిన్ను ఎలా ప్రేమిస్తుందో నేను చూస్తాను అంటూ అపూర్వ దగ్గరకు వెళ్లి మనం ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటున్నాం అని చెప్తాడు. అపూర్వ, సుజాత షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















