Meghasandesam Serial Today December 31st: ‘మేఘసందేశం’ సీరియల్: అరెస్ట్ అయిన గగన్ - స్టేషన్ లో వేసిన సూర్య
Meghasandesam serial today episode December 31st: కిడ్నాప్ కేసులో గగన్‌ను అరెస్ట్ చేస్తాడు ఎస్పీ సూర్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: మీరా బిందును తీసుకుని శారద ఇంటికి వెళ్తుంది. పూరిని పలిచి బిందును ఎందుకు కొట్టావని అడుగుతుంది. కూతురును పెంచడం ఇలాగేనా అంటూ తిడుతుంది. దీంతో పూరి కూడా మీరాను తిడుతుంది.
పూరి: ఎంత మంది ముందు నేను కొట్టానో అంత మంది ముందు అంతకంటే ముందు నీ కూతురు శివను కౌగిలించుకుంది.
మీరా: ఏమే అది చెప్తుంది నిజమేనా..?
బిందు: అంటే అమ్మ శివ నాకు మంచి ఫ్రెండ్ అమ్మ. రన్నింగ్ పోటీలో గెలిస్తేనే కౌగిలించుకున్నాను అంతే..
పూరి: మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలితేనే చంపేసేంత శత్రుత్వం ఉంది నీకు మాకు. అలాంటిది. మా ఇంట్లో ఉన్నవాడితో నీ కూతురుకు ఫ్రెండిష్ప్ ఏంటి..? సరే కాసేపు ఫ్రెండే అనుకుందాం. శివ గెలిచినందుకు షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోదా..? కౌగిలించుకోవాలా..? మా అమ్మను అనడం కాదు. ఒకసారి నువ్వెలా పెంచుతున్నావో ఒకసారి చెక్ చేసుకో..
మీరా: నోర్ మూయ్ బిందు చెప్తుంది కదా..? నార్మల్ గానే కౌగిలించుకున్నానని అయినా మీలాంటి వాళ్లకు ఏం తెలుస్తుందిలే మా లాంటి హైక్లాస్ అలవాట్లు పద్దతులు, పట్టింపులు.
పూరి: అవును మరి మీలాంటి పెద్ద వాళ్లకే తెలుస్తాయి. కూతురు తప్పు చేసిందని తెలిసి కూడా కప్పిపుచ్చుతున్నావు చూడు ఇది మీ సంస్కారం.
మీరా: ఏయ్ చాటు మాటుగా బతికే మీలాంటి వాళ్లు నేర్పిస్తే సంస్కారం గురించి నేర్చుకునేంత స్థాయిలో మేము లేము. అయినా ఈ శివ గాడిని అభినందిస్తే కొట్టే అధికారం నీకెవరు ఇచ్చారు…? ఇస్తే లేకపోతే శివను కొట్టాలి. వీడు నీ అన్నయ్యో తమ్ముడో కాబోయే మొగుడో అయితే అప్పుడు అప్పుడు ఆ హక్కుతో నువ్వు కొట్టగలవు. ఏంటే నీకు వీడికి ఉన్న సంబంధం
భూమి: అత్తయ్యా ఫ్లీజ్ అనవసరంగా గొడవ పడొద్దు..
మీరా: లేదు భూమి నాకు తెలియాల్సిందే..? చెప్పు ఏంటే నీకు వీడికి ఉన్న సంబంధం.
పూరి: అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
మీరా: ఆ ఇప్పుడు నాకు అర్థంమైంది. మీరు వీడికి ఇంత ముద్ద పడేస్తున్నారు కదా..? అందుకే వీడిని కట్టుబానిసలా చూస్తున్నారు. మీ బానిసతో ఎవరు స్నేహం చేసినా తట్టుకోలేకపోతున్నారు. వీడితో స్నేహం చేసిన వాళ్లందరినీ మీ బానిసలాగే చూస్తున్నారు. చెప్పండి మీ బానిసను ఎంతకు అమ్ముతారో..? నేనే డబ్బు పడేసి కొంటాను.. చెప్పండి..
భూమి: అత్తయ్యా విచక్షణ కోల్పోయి మాట్లాడొద్దు.. శివను ఎంత బాగా చూసుకుంటున్నామో శివకు తెలుసు.. శివను మా ఇంట్లో వాడిలాగా చూసుకుంటున్నాము అత్తయ్య. పూరి అందరి ముందు బిందును కొట్టడం తప్పే..
పూరి: నువ్వేంటి వదిన అలా మాట్లాడుతున్నావు..?
భూమి: నిజమే మాట్లాడుతున్నాను పూరి. శివ రన్నింగ్ పోటీలో గెలిచినందుకు బిందు కౌగిలించుకుందా..? ముద్దు పెట్టుకుందా..? అన్నది లెక్కలోకి రాదు. నువ్వు కొట్టిందే లెక్కలోకి వస్తుంది. నువ్వు కొట్టినందుకే కదా నా మేనత్త శివను మనం కట్టు బానిసలా చూస్తున్నాం అని అపార్థాని తీసింది. అత్తయ్యా ఈ గొడవ సమసిపోవడానికి ఏం చేయాలో చెప్పండి.
మీరా: అది నా కూతురుకు క్షమాపణ చెప్పాలి.
పూరి: నేనా అసలు జరగదు..?
శారద: నువ్వు చేసింది తప్పు అని మాకు అనిపిస్తుంది. కాబట్టి క్షమాపణ చెప్పు
పూరి: వీళ్లు మనల్ని ఎన్నిసార్లు అవమానించారు. మరి మనకు ఎన్నిసార్లు వీళ్లు క్షమాపణ చెప్పాలి
అని అడగ్గానే.. భూమి, పూరిని బయటకు తీసుకెళ్లి కన్వీన్స్ చేస్తుంది. దీంతో పూరి వెళ్లి బిందుకు క్షమాపణ చెప్తుంది. దీంతో మీరా, బిందు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు రోడ్డు మీద ఒక అమ్మాయిన కొందరు రౌడీలు కిడ్నాప్ చేయబోతుంటే.. గగన్ వెళ్లి సేవ్ చేస్తుంటాడు. అప్పుడే ఎస్పీ సూర్య అక్కడకు వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. ఆ అమ్మాయి మాట మార్చి గగన్ తనను కిడ్నాప్ చేయబోతే వాళ్లు సేవ్ చేస్తున్నారని చెప్తుంది. ఆ మాటలకు సూర్య, గగన్ ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















