Meghasandesam Serial Today December 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిలో పెద్దకూతురును చూసుకోమన్న ప్రసాద్ – ఫస్ట్ టైం ప్రసాద్‌ను మెచ్చుకున్న శరత్‌చంద్ర
Meghasandesam Today Episode: తన పెద్ద కూతురిని తలుచుకుని శరత్‌చంద్ర బాధపడుతుంటే దూరం నుంచి చూస్తున్న భూమి ఏమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: తన పెద్దకూతురును తలుచుకుని శరత్‌చంద్ర బాధపడుతుంటే బయటి నుంచి వింటున్న భూమి ఎమోషనల్ అవుతుంది. మా అమ్మ దూరం అయినప్పటి నుంచి మళ్లీ నా కడుపున పుడుతుంది. తనే మా అమ్మ అనుకున్నాను. నేను తనను కూతురిలా చూసుకోవడం కాదు. తను నన్ను కొడుకులా చూసుకోవాలి. ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే పెద్దమ్మే కారణం అన్న నువ్వు నీకన్నా తనే ఎక్కువా అని ఎలా అడిగావు అమ్మా అని నక్షత్రను ప్రశ్నించగానే సారీ డాడీ జెలసీతో అలా అన్నాను అంటుంది.
శరత్: నాదృష్టిలో నువ్వు ఎక్కువా తను ఎక్కు వా అన్నది పక్కన పెట్టు. ఒకసారి రావాలే కానీ నాతో సహా మనందరి కంటే తనే ఎక్కువ అవుతుంది. తన దయ మీద మనం బతకాలి. ఎందుకంటే ఈ ఆస్తి అంతా మీ పెద్దమ్మది. అంటే వారసత్వంగా మీ అక్కది. ఈరోజు నుంచి నీకేం కొన్నా మీ అక్కకు కూడా కొని పక్కన పెడతాను.
ప్రసాద్: చాలా మంచి నిర్ణయం బావగారు.
అనగానే శరత్‌చంద్ర తిరిగి ఆశ్చర్యంగా చూస్తాడు.
ప్రసాద్: కానీ కొన్నది కొన్నట్లుగా పక్కన పెట్టడమే అంత మంచి నిర్ణయంలా అనిపిస్తలేదు.
శరత్: ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్..
ప్రసాద్: భూమిని ఎలాగూ మీ పెద్ద కూతురు లాగే చూసుకుంటున్నారుగా.. తను వచ్చేంత వరకు మీ పెద్ద కూతురుని భూమిలోనే చూసుకోవచ్చు కదా..?
శరత్: ఇన్నాళ్లకు మంచి సలహా ఇచ్చావు కృష్ణప్రసాద్. భూమి ఈరోజు నుంచి నీలో నా పెద్ద కూతురుని చూడాలని నిర్ణయించుకున్నాను అమ్మా.. ఇక నుంచి నేను ఏం కొన్నా నక్షత్రతో పాటు నీకు కొంటానమ్మా నువ్వు కాదనకూడదు.
అంటూ డైమండ్ నెక్లెస్ తీసి భూమికి ఇస్తాడు శరత్‌చంద్ర. అపూర్వ, నక్షత్ర, సుజాత షాక్ అవుతారు. భూమి ఎమోషనల్ అవుతుంది. ప్రసాద్ హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో అపూర్వను పిలిచి నీ చేత్తో భూమి మెడలో వేయ్ అని చెప్తాడు. అపూర్వ వెళ్లి భూమి మెడలో డైమండ్ నెక్లెస్ వేస్తుంది. భోగి రోజు భూమి బర్తుడే చేస్తాను అంటాడు శరత్ చంద్ర దీంతో అపూర్వ కోపంతో రగిలిపోతుంది. మరోవైపు వంశీ, సౌందర్యకు ఇందుకు కొత్తబట్టలు తీసుకువస్తాడు. రమేష్‌కు తీసుకురాలేదని కోప్పడతాడు. ఇంతలో ఇందు కోసం రూంలోకి వెళ్లి వంశీ చీరను ఇందుకు చూపిస్తాడు. ఇందు హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు డ్రెస్ బాగాలేదని బిందు ఏడుస్తుంది.
బామ్మ: ఏదో ఒకటి సర్ది చెప్పకపోతే ఇది పార్టీ అంతా ఇలా ఏడుస్తూ కూర్చుంటుందేమో.. (అని మనసులో అనుకుంటుంది.) అమ్మా బిందు నా బంగారం పెద్దదానిగా చెప్తున్నాను. నవ్వుతూ అటూ ఇటూ తిరిగేయ్.. ఇది కూడా ఒక ప్యాషనే అనుకుంటారు. అబ్బా ఎక్కడ కుట్టించావే బలే ఉంది అని అడుగుతారు.
బిందు: నాన్నమ్మ ఈ ఇంట్లో మనకు డైలాగ్స్ తక్కువ. ఒకటి ఆరా డైలాగ్ కొట్టినా.. అది కూడా సీరియస్‌గానో నాన్నకు సపోర్టుగానో కొడతావు. అలాంటి నీకు కూడా నా డ్రెస్ మీద కామెంట్స్ చేయాలా.?
బామ్మ: అది కాదే ఏదో సర్ది చెబుదామనే ఉద్దేశంతో..
బిందు: నువ్వు సర్ది చెబుతావు. నేను సరిపెట్టుకుని తిరుగుతాను. చూసిన వాళ్లు పగలబడి నవ్వుతారు.
అని మాట్లాడుతుండగానే బిందు ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ మొదలైందా.? అని అడగ్గానే పార్టీ లేదని నువ్వు రావొద్దని చెప్తుంది. బామ్మ కంగారు పడుతుంది. దీంతో తన ఫ్రెండ్స్ అందరికీ ఇదే చెప్తాను అని చెప్తుంది. ఇంతలో చెర్రి వచ్చి ఈ పిల్ల దెయ్యం ఇక్కడే ఉంది. దీని కంట పడకుండా ఎలాగో డ్రెస్ తీసుకెళ్లాలి అనుకుంటాడు చెర్రి. మెల్లగా డ్రెస్ తీసుకుని వెళ్తుంటే.. బిందు చూసి పిలుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!