Meghasandesam Serial Today December 21st: ‘మేఘసందేశం’ సీరియల్: తన పెద్దకూతురు వస్తుందన్న శరత్‌చంద్ర – ప్రేమ విషయం తెలిసి నక్షత్రను నిలదీసిన అపూర్వ
Meghasandesam Today Episode: రెండు నెక్లెస్సులు కొన్న శరత్‌చంద్రను ఇంకోటి ఎవరికి అని అడగ్గానే తన పెద్దకూతురుకు అని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: భూమితో ఫోన్‌లో మాట్లాడిన శారద, పూరి లను చూసిన గగన్ ఏంటి డిష్కర్షన్ పెట్టారు అని అడుగుతాడు. అది సరే నువ్వేంటి అన్నయ్యా ఇంత టిప్‌టాప్‌గా రెడీ అయ్యావు అని అడుగుతుంది పూరి. దీంతో గగన్ పూరి చెవి పట్టుకుని అడిగిన దానికి సరైన సమాధానం చెప్పడం నేర్చుకో అనగానే అదేం లేదు అన్నయ్యా అమ్మా భూమికి ఫోన్ చేసి తనను ఇంటికి కోడలిగా రమ్మని అడిగింది. అని చెప్పగానే మీక్కూడా అలాగే చెప్పిందా అంటాడు గగన్. దీంతో శారద, పూరి షాకింగ్‌గా మీక్కూడా అని అడుగుతున్నావు ఏంటి అని అడగ్గానే గగన్ ఏం లేదని నేను ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు. మరోవైపు నక్షత్రను రెడీ చేస్తుంది అపూర్వ.
అపూర్వ: మేకప్ అంత లైట్‌గా వేసుకున్నావేంట్రా..? ఫంక్షన్ లో అందరి కంటే నువ్వే రిచ్‌గా కనబడాలి. నువ్వు పూజ చేసిన విధానం చూస్తే నాకే షాక్ వేసింది తెలుసా..?
సుజాత: మీ అమ్మకు షాకులు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదమ్మా.. ఈ మధ్యనే భూమి నేర్పిస్తుంది.
అపూర్వ: పిన్ని కొంచెం అపుతావా..?
సుజాత: ఆ ఆపుతాలేమ్మా… నువ్వు ఎప్పుడు నన్ను పూర్తిగా చెప్పనిచ్చావు.
అపూర్వ: బేబీ ఇక ఆనందానికైతే అవధులేవు తెలుసా..? అవును గిఫ్టుగా ఏదో అడుగుతానని మాట తీసుకున్నావు కదా…? తీసుకుని మంచి పని చేశావు. నలుగురిలో అడిగావననుకో డాడీ కాదనలేరు.
నక్షత్ర: ఆ కాన్పిడెంట్ తోనే మమ్మీ మాట తీసుకున్నాను.
అని చెప్పగానే సుజాత, అపూర్వను పక్కకు తీసుకెళ్లి మీ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడినట్టు ఉంది. సాయంత్రం వాళ్ల డాడీని అడిగేది కూడా ఆ ప్రేమించిన వాడితో పెళ్లి చేయమని అని చెప్పగానే అపూర్వ కోపంగా సుజాతను తిట్టి.. నక్షత్ర దగ్గరకు వెళ్లి పిన్ని చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. నక్షత్ర ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతుంది. అపూర్వ కోపంగా గట్టిగా అడగ్గానే ఇంతలో శరత్ చంద్ర వస్తాడు.
శరత్: ఏమైంది…?
అపూర్వ: అది బావా సిటీలోనే బెస్ట్ డిజైనర్‌తో డ్రెస్ డిజైన్ చేయిస్తే ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పడం లేదు బావ.
శరత్: దానికి అంతలా అరవాలా…? అమ్మా నక్షత్ర నీకు బర్తుడే గిఫ్టుగా ఏం తెప్పించానో తెలుసా..?
సుజాత: అల్లుడు గారు తను నైట్‌కు కదా అడుగుతాను అంది.
శరత్: తను అడిగేది ఏదైనా ఇస్తాను అత్తయ్యగారు. నా తృప్తి కోసం ఇప్పుడు ఇది తీసుకొచ్చాను చూడు. నచ్చిందా అమ్మా..
నక్షత్ర: సూపర్ డాడీ..థాంక్యూ సోమచ్ డాడీ..
అపూర్వ: డైమండ్ కదా… రామ్మా..
అంటూ అపూర్వ నెక్లెస్ తీసుకుని నక్షత్ర మెడలో వేస్తుంది. ఈరోజు నీలో వచ్చిన మార్పు అంతా ఇంతా అనిపించలేదమ్మా.. ఎంత విలువైన గిప్ట్ ఇచ్చినా తక్కువే అవుతుందమ్మా.. అనగానే సుజాత అపూర్వకు కూడా ఏదో తెచ్చినట్టు ఉంది అని అడగ్గానే ఇది అపూర్వకు కాదు నా పెద్దకూతురుకు అని శరత్ చంద్ర చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మరోవైపు తన డ్రెస్ చూసుకుని బిందు బాధపడుతుంది.
మీరా: అదేంటి బిందు నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి..?
బిందు: అమ్మా ఇది డ్రెస్సా.. నువ్వైనా చెప్పు నాన్నమ్మ ఇది డ్రెస్సా..?
చెర్రి: ఈ డ్రెస్ చాలా బాగుంది. ఆఫ్రికన్ చింపాంజీలా ఉంది.
ప్రసాద్: నాకు ఒక మాట చెబితే నేను కొత్త డ్రెస్ తీసుకొచ్చేవాడిని
బిందు: నాన్నా నేను ఈ ఫంక్షన్‌కు రాను వస్తే అందరూ వీడు ఏడిపించినట్టు ఏడిపిస్తారు.
అని చెప్పగానే ప్రసాద్ వెళ్లిపోతాడు. మీరా కూడా వెల్లిపోతుంది. బిందు ఏడుస్తుంటే.. చెర్రి ఓదారుస్తాడు. ఈ డ్రెస్సే కదా నీ ప్రాబ్లమ్ అంటూ కత్తెర తీసుకుని డ్రెస్ కట్ చేయబోతుంటే బిందు తిడుతుంది. మరోవైపు పెద్ద కూతరు ఎవరు బావ అని అపూర్వ అడగ్గానే మీ శోభాచంద్ర అక్కకు పుట్టిన అమ్మాయి మన పెద్దకూతురే కదా? అపూర్వ అంటాడు శరత్ చంద్ర. దీంతో అపూర్వ, సుజాత, నక్షత్ర షాక్ అవుతారు. అంతా బయటి నుంచి వింటున్న భూమి ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!