Meghasandesam Serial Today December 1st: ‘మేఘసందేశం’ సీరియల్: హాస్పిటల్ లో చేరిన ఏస్పీ సూర్య – గగన్ ను టార్గెట్ చేయాలనుకున్న పోలీసులు
Meghasandesam serial today episode December 1st: హాస్పిటల్ లో చేరిన సూర్యను పరామర్శించిన పోలీసులు గగన్‌ను తమ టార్గెట్ గా తీసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కేపీ తనను చంపాలనుకంది తనను షూట్ చేసింది శరత్ చంద్రే అని నిజం చెప్పినట్టు.. మీరా తనను కొట్టినట్టు శరత్ చంద్ర కల కంటాడు. వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచి భయపడుతుంటాడు. ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో మీరా సంతోషంగా శరత్ చంద్ర దగ్గరకు వస్తుంది.
మీరా: అన్నయ్య చెర్రి ఫోన్ చేశాడు. ఆయనను తీసుకుని వస్తున్నాడట. నీ తొందరగా కిందకు రా అన్నయ్య మనం అందరం ఆయనకు స్వాగతం పలుకుదాం.
శరత్: నువ్వు వెళ్లు అమ్మా నేను వస్తాను.
మీరా: సరే అన్నయ్య త్వరగా వచ్చేయ్. మన ఇల్లు ఈరోజు ఉగాది పండుగ లాంటిదే.. సంబరాలు చేసుకోవాల్సిందే.. నువ్వు త్వరగా రా అన్నయ్య
శరత్: సరే అమ్మా నువ్వు వెళ్లు ( మీరా వెళ్లిపోతుంది.) అయ్యో పిచ్చిది ఇంకా నన్ను నమ్ముతుంది.
అనుకుంటూ బాధపడుతుంటాడు. కిందకు వెళ్లిన మీరా అత్తయ్య ఆయన రాగానే దిష్టి తీయడానికి గుమ్మడి కాయ రెడీ చేశారా..? అని అడుగుతుంది. చేశానని వాళ్ల అత్తయ్య చెప్తుంది. అప్పుడే అటు నుంచి వెళ్తున్న నక్షత్రను మీరా పిలుస్తుంది.
మీరా: నక్షత్ర నువ్వే మీ మామయ్యకు దిష్టి తీయాలమ్మ.. ఎందుకంటే నువ్వే మా ఇంటి కోడలివి కదా..? కోడలిగా మా ఇంట నువ్వు ఆడుగు పెట్టిన వేళా విశేషమేమో క్షేమంగా మీ మామయ్యను ఇంటికి తీసుకొస్తుంది.
శరత్ చంద్ర బయటకు వచ్చి మీరాను గమనిస్తుంది. అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వెళ్తుంది. నక్షత్ర సరే అనగానే.. మీరా కేపీకి ఇష్టమైన వంటలు చేయాలని లోపలికి వెళ్తుంది.
అపూర్వ: బావ కేపీ వస్తాడు అని తెలిసిన దగ్గర నుంచి మీరా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి బావ.
శరత్: అవును అపూర్వ కేపీ బతికే ఉన్నాడని తెలిసిన క్షణాన నేను చాలా ఆనందపడ్డాను అపూర్వ. కానీ కేపీ ఇంటికి వచ్చి తనను చంపబోయింది నేనే అని చెబితే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో నా మనసు చెలరేగిపోతుంది అపూర్వ. నాలో గూడు కట్టుకున్న భయం నన్ను ఏమీ ఆలోచించకుండా చేస్తుంది అపూర్వ.
అపూర్వ: బావ ఈ టైంలో నేను ఇలా చెప్పడం కరెక్టో కాదో కానీ కేపీకి హాని జరగాలని నా మనసులో ఏ మూల లేదు. ఎందుకో కేపీ మన ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకైతే లేదు బావ.
శరత్: ఏం మాట్లాడుతున్నావు అపూర్వ.
అపూర్వ: నీకు తెలియండి కాదు బావ. తన అన్నయ్యను మన కేపీ చంపాడన్న కోపంతో ఎస్పీ సూర్య ఊగిపోతున్నాడు బావ. బతికి ఉంటే నేనే చంపేసే వాణ్ని అని ఆరోజు మనతో అన్నాడు కదా..? ఈ రోజు కేపీ బతికి ఉన్న సంగతి తెలిస్తే ప్రాణాలతో కేపీని అతడు బతకనిస్తాడా..? బావ. వచ్చే దారిలో ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది బావ.
శరత్: నోనో అలా జరగడానికి వీల్లేదు. ఆ రోజు అంటే ఆవేశంలో నేను తప్పు చేశాను. ఈ రోజు కేపీ ప్రాణాలకు మళ్లీ ముప్పు రావడానికి వీళ్లేదు అపూర్వ. నువ్వు ఆ ఎస్పీకి ఫోన్ చేసి కేపీని ఏమీ చేయోద్దని చెప్పు అపూర్వ
అంటూ శరత్ చంద్ర చెప్పగానే సరే అంటుంది అపూర్వ. కానీ ఏదో ఒక నాటకం ఆడాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు గగన్ కొట్టడంతో ఎస్పీ సూర్య హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు. దెబ్బలతో బాధపడుతుంటాడు. ఇంతలో అక్కడికి డిపార్ట్‌మెంట్ నుంచి కొంత మంది పోలీసులు వచ్చి ఎలా జరిగింది. ఎవరు కొట్టారు అని అడిగితే.. గగన్ కొట్టాడని చెప్తాడు. దీంతో పోలీసులు అందరూ గగన్‌ను టార్గెట్ చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్లు మాట్లాడుకోవడం చాటు నుంచి భూమి విని భయపడుతుంది. వెంటనే ఈ విషయం గగన్ బావకు చెప్పాలని వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















