Meghasandesam Serial Today December 13th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి వార్నింగ్ ఇచ్చిన గగన్ - అయోమయంలో పడిపోయిన భూమి
Meghasandesam serial today episode December 13th: భూమి రూంలోకి వెళ్లి నీ నాటకాలు ఆపకపోతే బాగుండదని గగన్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఇందు ఇంటికి వెళ్లి మీరా బలవంతంగా ఇందును తీసుకుని ఇంటికి వస్తుంది. ఇందును ఇంట్లోకి లాగేస్తుంది. ఇందు వెళ్లి కేపీ కాళ్ల మీద పడుతుంది. ఇందును చూసిన కేపీ కంగారు పడతాడు.
కేపీ: ఇందు అమ్మా..
ఇందు: అమ్మా నా మాట వినమ్మా… నేను మా ఇంటికి వెళ్లిపోతాను.
మీరా: ఏదే మీ ఇల్లు..
శరత్: అమ్మా మీరా ఏంటమ్మా ఇది..
మీరా: అన్నయ్య.. ఇదేం చేసిందో తెలుసా..? ఆ గగన్ దీనికి కట్నం ఇచ్చాడట. కానీ ఇది మాత్రం మనకు చెప్పలేదు.
శరత్: నాకు అన్ని తెలుసు అమ్మా.. కానీ సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదమ్మ..
మీరా: ఇదే అన్నయ్య.. ఇదే విధానం.. ఎవడో ఇచ్చిన డబ్బుతో ఇది కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. నాలాగే ఇది కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే చస్తుంది.
కేపీ: మీరా అంత మూర్ఖంగా మాట్లాడతావేంటి..? ఇందుకు సంసారం భవిష్యత్తు లేకుండా ఇక్కడే మగ్గిపోవాలా..?
మీరా: అంటే మీ కొడుకు ఇచ్చిన డబ్బుతో ఇది కాపురం చేయాలా..? అవును మీ కొడుకు ఇందుకు కట్నం ఇచ్చాడని మీకు తెలుసు కదా..?
కేపీ: అవన్నీ ఇప్పుడు ఎందుకు..?
మీరా: ఏదైనా సందర్బం వచ్చినప్పుడే తెలుసుకోవాలి. మీ కొడుకు గగన్ మన ఇందుకూ కట్నం ఇచ్చాడని మీకు తెలుసా..? లేదా..? నీ మీద ఒట్టేసి చెప్పండి..
కేపీ: తెలుసు..?
మీరా: ఏరా నీకు కూడా తెలుసు కదా..?
చెర్రి: అంటే అమ్మ అది తెలుసు అంటే..
మీరా: ఏం నీ చేయి కూడా నా నెత్తి మీద పెట్టుకుంటేనే చెప్తావా..?
చెర్రి: తెలుసు అమ్మ..
మీరా: చూశాశా అన్నయ్య.. ఇందుకు ఆ గగన్ కట్నం ఇచ్చాడని ఈయనకు తెలుసు..? దీనికి తెలుసు..? వీడికి కూడా తెలుసు. తెలియంది ఎవరికి ఇంక నా ఇంట్లో ఎవరు మిగిలి ఉన్నారు… బిందు మాత్రమే.. దానికి కూడా ఇదిగో దీని లాగే చెల్లెలిగా కొనేస్తాడు. అందరూ అటు వెళ్లిపోతే ఈయన గారు కూడా అక్కడికి జారుకుంటారు. మనం ఇక్కడ ఒంటరిగా మిగలాలి.
అపూర్వ: చూడు మీరా మీ ఆయన వల్ల ఈ కట్నం విషయంలో ఇంత కన్పీజన్ వచ్చింది. అలాగని ఇందు కాపురాన్ని కూలదీసి ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నామన చెడ్డ పేరు మనకు ఎందుకు చెప్పు.. ఏమంటావు బావ.
శరత్: అవును మీరా.. వాడి ఇచ్చిన కట్నం ఏదో వాడి ముఖాన పడేద్దాం..
మీరా: అలా అన్నావు బాగుంది అన్నయ్య.. కానీ ఒకటి వాడి డబ్బు వాడి ముఖం మీద పడేంత వరకు ఇందు మాత్రం కాపురానికి వెళ్లదు..
శరత్: అపూర్వ ఆ ఏర్పాట్లేవో త్వరగా చూడు.
అని చెప్పి శరత్ చంద్ర వెళ్లిపోతాడు.
అపూర్వ: అసలు ఆ దొంగతనం చేసిన డబ్బు ఇందు అత్తగారికి ఇచ్చేసి ఉంటే అసలు ఇవాళ ఇంత గొడవ జరిగేదే కాదు..
అంటూ కేపీని గుర్రుగా చూస్తు వెళ్లిపోతుంది అపూర్వ. మరోవైపు భూమి రూంలోకి వెళ్లి భూమికి వార్నింగ్ ఇస్తాడు గగన్. దీంతో భూమి ఏడుస్తుంది. ఎందుకు గగన్ బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అని బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















