Meghasandesam Serial Today April 28th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని రూంలో బంధించిన మీరా – అయోమయంలో భూమి
Meghasandesam Today Episode: గగన్ బెయిల్ కోసం ఇటికి వచ్చి డబ్బులు తీసుకెళ్తున్న భూమిని మీరా రూంలో వేసి లాక్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : శరత్ చంద్ర అటెంప్ట్ మర్డర్ కేసులో ఏసీపీ గగన్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొస్తుంది. దీంతో భూమి, గగన్ కోసం స్టేషన్ వెళ్తుంది. స్టేషన్‌కు వచ్చిన భూమిని ఏసీపీ తిడుతుంది. నీ కన్నతండ్రిని చంపాలని చూసిన వాడి కోసం నువ్వు రావడానికి సిగ్గుగా లేదా అంటూ నిలదీస్తుంది.
భూమి: మీరు ఏదైనా అనుకోండి కానీ గగన్ నిర్దోషి అని తేలాక మీరు ఆయనకు క్షమాపణ చెబితే సరే సరి. అప్పుడు మనిద్దరం కలిసి తిరుగుదాం కోర్టుకు.
ఏసీపీ: ఏంటి నన్నే బెదిరిస్తున్నావా..?
భూమి: బెదిరించడం కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలెంజ్ అని అదే అనుకోండి.
ఏసీపీ: ఏ ధైర్యంతో చేస్తున్నావు నువ్వు ఈ చాలెంజ్..
భూమి: మనసు ఇచ్చిన దానిలా కాకుండా ఒక మనిషిగా ఆయన నాకు తెలుసు కాబట్టి. నేను శరత్ చంద్ర కూతురిని అని తెలిసిన మరుక్షణమే నువ్వు నాకు వద్దు అని కోర్టు బయటే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. అది ఆయన వ్యక్తిత్వం.
ఏసీపీ: డ్రెస్ తో సహా నువ్వు ఇంకా అప్‌డేట్ అవ్వలేదు భూమి. ఏదో ప్లాన్ చేసి ఒక నైట్ అంతా నీతో ఉండి నీ పరువు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి హీరో అయిపోయాడు. ఇదంతా ఒక కథలా అనిపించడం లేదు. ఏం రాజేందర్ నీకు అనిపించలేదా..?
రాజేంద్ర: అవును మేడం ఆలోచికస్తుంటే.. కథలాగే ఉంది.
ఏసీపీ: చూడు భూమి నిన్ను దక్కించుకోవడం కోసం వాడు ఇన్ని కుట్రలు చేశాడని నేను నిరూపిస్తాను. అప్పుడు నువ్వు నాకు క్షమాపణ చెప్తావు.
భూమి: చూద్దాం మేడం మేము క్షమాపణ చెప్తామో మీరు క్షమాపణ చెప్తామో.. కానీ రాసిపెట్టుకోండి మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది.
అంటూ భూమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అపూర్వ, మీరాను కన్వీన్స్ చేసేందుకు ట్రై చేస్తుంది.
అపూర్వ: ఆ భూమి మీద మచ్చ పడి మన ఇంటి పరువు గంగపాలు అయిన దగ్గర నుంచి ఇప్పటి దాకా అంతా ఎంక్వైరీ చేశాను మీరా. దీని అంతటి వెనక ఆ గగన్ గాడే ఉన్నాడు.
మీరా: మరి ఆ రోజు రాత్రి భూమిని ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తే గగన్ కాపాడాడు కదా వదిన.
సుజాత: ఓసి పిచ్చి పిల్లా ఇంకా నీకు అర్థం కాలేదా..? అది కూడా వాడి ప్లానే.. అలా చేసినందుకే కదా రాత్రంతా భూమితో ఉండగలిగాడు.
మీరా: అవునా..?
అపూర్వ: అవును మీరా మీడియాలో ఎప్పుడైతే లీక్ అవుతుందో భూమిని మనం వాడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పా మనకు వేరే దారి ఉండదని వాడి ఆలోచన.
అంటూ ఇద్దరూ కలిసి మీరా మైండ్‌ను డైవర్ట్ చేస్తారు. దీంతో మీరా భూమిని చెర్రికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటుంది. దీంతో ఇంకాసేపట్లో ఆ శారద మన ఇంటికి పరుగెత్తుకు వస్తుంది. దాంతో ప్రసాద్ వెళ్లకుండా చూడు అని చెప్తారు మీరా సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో శారద ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వస్తుంది. ప్రసాద్‌ను పిలుస్తుంది. విషయం చెప్తుంది. దీంతో ఇద్దరూ వెళ్లబోతుంటే.. మీరా వచ్చి ఆపేస్తుంది. శారదను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మరోవైపు భూమి లాయర్ దగ్గరకు వెళ్లి గగన్‌కు బెయిల్ ఇప్పించాలని అడుగుతుంది. దీంతో లాయర్ ఇప్పట్లో గగన్‌కు బెయిల్ దొరకదని చెప్తాడు. ఎలాగైనా మీరే బెయిల్ ఇప్పించాలని కోరుతుంది. అయితే సెక్యూరిటీగా డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని లాయర్ చెప్పగానే ఎంత ఖర్చైనా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొస్తుంటే అపూర్వ చూసి తిడుతుంది. చివరికి ఇంట్లో దొంగతనం చేస్తున్నావా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో మీరా వచ్చి భూమిని తీసుకెళ్లి రూంలో వేసి లాక్ చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















