Krishna Mukunda Murari Serial Today May 20th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణ, మురారిల కొంప ముంచేసిన ముకుంద.. నిజంగానే గర్భం తీయించుకుందా? ఆదర్శ్‌తో పెళ్లి కోసమే ఈ నాటకమా?
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ, మురారిల బిడ్డను మోస్తున్న మీరా అబార్షన్ చేయించుకోవడంతో కృష్ణ కుమిలి కుమిలి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : కృష్ణ.. మురారిని చాటుగా పిలిచి మీరా కాల్ చేసి రెస్టారెంట్‌కి రమ్మని చెప్పిందని చెప్తుంది. మురారి సరే వెళ్లి ఏంటో కనుక్కుందామని అంటాడు. ఇద్దరూ వెళ్తుండగా లోపలి నుంచి భవాని చూసి కృష్ణను పిలుస్తుంది. అందరూ లోపల ఉంటే మీరు అక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. కృష్ణ.. భవాని దగ్గరకు వెళ్తే మీరా ఇంటికి వచ్చాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని అంటుంది.
కృష్ణ: మీరా రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావ్. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. చెప్పా పెట్టకుండా అలా వెళ్లిపోతే అందరూ ఏమనుకుంటారు. ఎంత కంగారుగా ఉంటుంది.
మురారి: ఒక మాట మాతో చెప్పి వెళ్తే ఏమవుతుంది.
ముకుంద కృష్ణకు ఓ లెటర్ ఇచ్చి చదవమని చెప్తుంది. అది చూసి కృష్ణ షాక్ అయి పోయి అలా ఉండిపోతుంది. కృష్ణని చూసి ఆ లెటర్ తీసుకొని చదివి కోపంతో మీరాని చూస్తాడు. కృష్ణ.. మీరా చెంప పగలగొడుతుంది. కృష్ణ కొట్టడం రెస్టారెంట్‌లో అందరూ చూశారని మీరా మా ఫ్రెండ్‌షిప్‌లో ఇవన్నీ కామన్ మీ పని మీరు చూసుకోండి అని అంటుంది.
కృష్ణ: ఎంత పని చేశావే నా బిడ్డను నీ కడుపులో చల్లగా చూసుకుంటావని పెంచుతానని మాట ఇచ్చి గర్భం తీయించుకుంటావా. నా బిడ్డను పొట్టన పెట్టుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఎవర్నీ అడిగి చేశావు.
ముకుంద: కారణం నువ్వే కృష్ణ నీ కోసమే చేశాను.
కృష్ణ: పిచ్చి పిచ్చిగా వాగకు. నా కోసం నా బిడ్డను నాకు కాకుండా చేయడం ఏంటి.
మురారి: అర్థం లేకుండా మాట్లాడకు మీరా ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు.
ముకుంద: నిజం మురారి గారు కృష్ణ కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కడుపులో బిడ్డ ఉండటం కంటే తీసేస్తేనే కృష్ణకు మంచిది అని ఇలా చేశాను.
కృష్ణ: చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే. నా బిడ్డ లేకుండా పోవడానికి నేను కారణం కావడం ఏంటి. ఆ బిడ్డ కోసం ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా. నాకు ఆ యోగం లేదు అని ఎంత కుమిలిపోయానో తెలుసా. మా మానాన మేం మా కోసం ఎవరో ఒక మంచి ఆవిడ దొరకకపోతుందా మా బిడ్డను మోయకపోతుందా అని ఎదురు చూస్తుంటే సంబంధం లేకుండా మధ్యలో వచ్చి నా అనుమతి లేకుండానే నా బిడ్డను నీ కడుపులో వేసుకొని ఇప్పుడు ఏదో కారణంతో తీసేసి నేనే కారణం అంటావ్ ఏంటి.
ముకుంద: అవును నువ్వే కారణం. నీ బాధ చూడలేకే నేను బిడ్డను తీసేశాను. గర్భం ఉంది గర్బం ఉంది అని ఎన్ని రోజులు నాటకం ఆడతావు. ఎప్పుడు నిజం బయట పడుతుందా అని ఎన్ని రోజులు బాధ పడతావ్. మోసం చేస్తున్న అన్న గిల్టీతో ఎన్ని రోజులు ఇబ్బంది పడతావ్. ఇప్పుడు బిడ్డ లేదు వెళ్లి చెప్పేసేయ్. ఏదో కారణం వల్ల నీ గర్భం పోయింది అని ఏ గోల ఉండదు. ఇంకా సానుభూతి కూడా వస్తుంది.
మురారి: నీకు ఏమైనా పిచ్చా. పిల్లలు పుట్టరని మా పెద్దమ్మకు తెలిస్తే ఏమైనా ఉందా.
ముకుంద: ఏమవుతుంది మురారిగారు ఇప్పుడు చేసినట్లే మళ్లీ సరోగసీ చేయించుకోండి. మీకు ఏమైనా వయసు అయిపోయిందా లేదు కదా.
కృష్ణ: అర్థమైంది నీ కడుపులో ఉన్న మా బిడ్డ ఆదర్శ్‌తో నీ పెళ్లికి అడ్డం. అందుకే బిడ్డను తీసేసి ఏదేదో కారణాలు చెప్తున్నావ్. ఒక నిండు ప్రాణాన్ని, మా ఆశల్ని గాలిలో కలిపేశావ్ కదే నువ్వు అసలు మనిషివేనా.
మురారి: ముందు నీకు ఆదర్శ్‌తో పెళ్లి అవుతుందనే నమ్మకం లేదు. పెద్దమ్మ ముహూర్తాలు పెట్టే సరికి ఆశ కలిగిందేమో.
కృష్ణ: అలాంటి దురాశ నీకు ఉంటే నువ్వు మాకు చెప్పాల్సింది కదా. మేం ఆదర్శ్‌తో నీ పెళ్లి జరిపి తొమ్మిది నెలలు ఈ ఇంటి వారసుడిని నీ గర్భంతో ఉంచే అవకాశం ఇవ్వమని ఆదర్శ్ కాళ్లు పట్టుకొని బతిమిలాడేవాళ్లం. ఒక్క మాట చెప్పాల్సింది కదా. ఎందుకు ఇంత పని చేశావ్.
ముకుంద: అరే నా ఉద్దేశం అది కాదు అని చెప్తుంటే మీరు నమ్మరేంటి. సరే చెప్తా విను. రాత్రి నువ్వు భవాని మేడంతో మాట్లాడింది అంతా నేను విన్నాను. నాకు టెస్ట్ చేసి నేను గర్భవతిని అని తెలిస్తే ఏమవుతుందా అని నువ్వు పడ్డ బాధ నేను చూశాను. ఒక వేళ నీ చేత్తో నీ బిడ్డను తీయాల్సి వస్తే నువ్వు తట్టుకోలేవు అని నేను తీసేశా. ఇదంతా నీ మంచి కోసమే చేశా. నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయలేను అని ముకుంద వెళ్లిపోతుంది.
కృష్ణ కుప్పకూలి ఏడుస్తుంది. మురారి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు ఆదర్శ్ ముకుందకు కాల్ చేస్తూనే ఉంటాడు. స్విఛ్ ఆప్ రావడంతో టెన్షన్ పడతాడు. ఇంతలో ముకుంద ఇంటికి వస్తుంది. ఆదర్శ్ చాలా సంతోషిస్తాడు. ముకుంద దగ్గరకు పరుగులు తీస్తూ హడావుడి పడతాడు. ముకుందకు రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఇంతలో భవాని కూడా వచ్చి ఎక్కడికి వెళ్లిపోయావని అడుగుతుంది. ఆదర్శ్ కంగారు చూసి కృష్ణ వస్తే నీ కంగారుకి కారణం తెలుస్తుందని అంటుంది. ఇక ముకుంద ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంది.
ఇక కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. మురారి ఓదార్చుతాడు. దురదృష్టవంతురాలిని అని ఏడుస్తుంది. మీరా గురించి చెప్పినా వినిపించుకోలేదని తనంతట తాను సరోగసి కోసం వస్తే మంచిది అనుకున్నానని అంటాడు. భవానికి ఏం చెప్పాలి అని ఏడుస్తుంది. ధైర్యంగా ఉండలేను అని ఏడుస్తుంది.
రజిని ఒంటరిగా కూర్చొని ఉంటే భవాని వచ్చి ఏమైందని అడుగుతుంది. భవాని తన కూతురు గురించి చెప్పి బాధ పడుతుంది. సంగీతకు బంగారం లాంటి భర్తని తీసుకొచ్చి తాను దగ్గరుండి పెళ్లి చేస్తానని భవాని అంటుంది. ఇక అందరూ కింద కూర్చొని భోజనం చేస్తారు. కృష్ణ మురారిలు కూడా వస్తారు. వాళ్లని చూసి కృష్ణ అప్పుడే పెళ్లి కల వచ్చేసింది అని అందరూ సంతోషంగా ఉన్నారని ఇక పెళ్లి ఆపాల్సిన అవసరం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్ రికార్డులను తొక్కుకుంటూ పోవాలే!