అన్వేషించండి

Jr NTR Birthday Special: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్‌ రికార్డులను తొక్కుకుంటూ పోవాలే!

Happy Birthday Jr NTR: ఇప్పుడు ఎన్టీఆర్ కేవలం తెలుగు హీరో కాదు, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉన్న పాన్ ఇండియా స్టార్. 'ఆర్ఆర్ఆర్' తర్వాత లెక్క మారింది, లెక్కలు మారాయ్. ఆయన ముందు పెద్ద టార్గెట్ ఉంది.

Young Tiger NTR Birthday Today: ఎన్.టి.ఆర్. - ఈ పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర ఉంది... ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు. మనవడు, హరికృష్ణ కుమారుడికి తన పేరే పెట్టారు. నటనలో టన్నుల కొద్దీ ట్యాలెంటుతో తాతకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. మధ్యలో తమిళ, హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నా అటు వైపు దృష్టి పెట్టలేదు. పెద్దగా అడుగులు వేయలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది.

'దేవర'కు ముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క!
నటుడిగా ఎన్టీఆర్ ప్రతిభను వేలెత్తి చూపించడానికి లేదు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం 'సింహాద్రి'తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'రాఖీ, 'యమదొంగ', 'అదుర్స్', 'ఊసరవెల్లి', 'దమ్ము', 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీర రాఘవ', 'ఆర్ఆర్ఆర్' - సిల్వర్ స్క్రీన్ మీద నటుడిగా ఎన్టీఆర్ అదరగొట్టిన సినిమాలకు కొదవ లేదు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' వరకు ఆయన కెరీర్ అంతా టాలీవుడ్ అన్నట్టు సాగింది. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు.

'స్టూడెంట్ నంబర్ వన్'తో తొలి విజయం, 'సింహాద్రి'తో తొలి ఇండస్ట్రీ హిట్, ఆ తర్వాత 'యమదొంగ'తో తొలి ఫాంటసీ సక్సెస్ ఎన్టీఆర్ అందుకోవడం వెనుక... ఆయనలో టన్నుల కొద్దీ టాలెంట్ బయటకు రావడం వెనుక ఉన్న రాజమౌళి, 'ఆర్ఆర్ఆర్'తో ఇంటర్నేషనల్ గ్రౌండ్ రెడీ చేసి పెట్టాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ ముందున్న టార్గెట్ ఒక్కటే... ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాలి. 'దేవర'కు ముందు ఒక లెక్క... ఎన్టీఆర్ సినిమా తెలుగులో ఆడితే చాలు. అభిమానులకు నచ్చితే మినిమమ్ గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. కానీ, ఇప్పుడు లెక్క మారింది. లెక్కలు మార్చాల్సిన టైమ్ ఎన్టీఆర్ (Jr NTR)కు వచ్చింది. తన సినిమా తెలుగులో ఆడితే చాలదు, ఇండియన్ వైడ్ సక్సెస్ కొట్టాలి. కొమురం భీం నటన, నటనలో వేరియేషన్ పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చాలి.

యాక్టింగ్ స్కోప్ ఉండాలే...
ఇండియా అంతా షేక్ అవ్వాలే!
ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆయన్నుంచి కోరుకునేది ఒక్కటే... ఇప్పట్నుంచి చేసే ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ యాక్టింగ్ స్కోప్ ఉన్నది అయ్యి ఉండాలే, ఆల్ ఓవర్ ఇండియా షేక్ చేసే కంటెంట్ ఉండాలే. బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలని టార్గెట్ పాన్ ఇండియాను దాటి ఉండాలని ఆశిస్తున్నారు.

ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న 'దేవర' అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అయితే, స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ 'వార్ 2' స్పై థ్రిల్లర్. ఈ రెండు మూవీస్ డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్. ఇదే విధంగా వేరియేషన్ చూపిస్తూ ముందుకు వెళ్లాలనేది ఫ్యాన్స్ కోరిక.

Also Read: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్

ఎన్టీఆర్ కాంటెంపరరీ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్ సహా ఆయన జూనియర్లు విజయ్ దేవరకొండ, నాని తదితరులు ఆయన కంటే ముందు అదర్ లాంగ్వేజ్ మార్కెట్స్ కన్నేశారు. ఇప్పుడు ప్రతి హీరో పాన్ ఇండియా మూవీ చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతికేళ్లు కంప్లీట్ చేసుకున్నాక ఎన్టీఆర్ తెలుగును దాటి వెళ్లారు. 'ఆర్ఆర్ఆర్'తో ఆయనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. ఇప్పుడు దాని మీద ఎటువంటి బిల్డింగ్ కడతారనేది ఆయన చేతుల్లో ఉంది. ఆకాశమంత ఎత్తున్నది కడతారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దేశ విదేశాల్లో ఆయన సినిమాల భారీ విజయాలు సాధించాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్!

Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget