అన్వేషించండి

ఎన్నికలు 2024 ఎగ్జిట్ పోల్

(Source:  ABP CVoter)
×
Top
Bottom

Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది

Devara First Single: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు 'దేవర' టీం బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. సినిమాలో 'ఫియర్ సాంగ్'ను విడుదల చేశారు. అది వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. 

Devara First Single fear song released on the occasion of Jr NTR birthday, Watch lyrical video: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే. 'దేవర' సినిమాలో ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్'ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ సాంగ్ వింటే ప్రతి అభిమానికి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!

అనిరుద్ అదరగొట్టాడుగా!
'దేవర' సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, మాంచి సింగర్ కూడా! 'ఫియర్ సాంగ్'ను కంపోజ్ చేయడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా పాడారు. ఆయన సంగీతంతో పాటు గాత్రం కూడా సూపర్ అని చెప్పాలి. ఈ పాటను కన్నడ, మలయాళ భాషల్లో సంతోష్ వెంకీ పాడారు. 

'దేవర'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటకు తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆల్ హెయిల్ టైగర్ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఆ పాట ఎలా ఉందో మీరూ వినండి.

Also Read: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు - పవిత్ర జయరాం అక్రమ సంబంధాలపై శిల్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్', బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జవాన్'తో పాటు పాన్ ఇండియన్ సెన్సేషనల్ సినిమాలకు అనిరుద్ సంగీతం అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు అతను బాణీలు అందించాలని అభిమానులు అందరూ కోరుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ'కు ఎన్టీఆర్, అనిరుద్ కాంబినేషన్ కుదరాలి. కానీ, వర్కవుట్ కాలేదు. ఇప్పుడీ 'దేవర'తో కుదరడం, ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

దసరా పండక్కి దేవర ఊచకోత మొదలు!
Devara Release Date 2024: 'దేవర'ను తొలుత ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకోవడంతో పాటు కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లారు. ఇప్పుడు దసరా బరిలో సినిమా విడుదల కావడం గ్యారంటీ. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఎర్రసముద్రం తీరంలో శత్రువుల ఊచకోత, బాక్స్ ఆఫీస్ బరిలో వసూళ్ల వేట మామూలుగా ఉండవని చెప్పారు.

Also Readపిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు

ఎన్టీఆర్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న చిత్రమిది. వాళ్లిద్దరికీ ఇదే తొలి తెలుగు సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, కె హరికృష్ణ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడంతో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Election Results 2024: కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?
కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?
Loksabha Elections 2024: పగటి కలలు కనడం మానుకుంటే మంచిది, కాంగ్రెస్ వాదనను తప్పుపట్టిన రవిశంకర్ ప్రసాద్
పగటి కలలు కనడం మానుకుంటే మంచిది, కాంగ్రెస్ వాదనను తప్పుపట్టిన రవిశంకర్ ప్రసాద్
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Janhvi Kapoor: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

CM Revanth Reddy Telangana Formation Day Celebrations | ట్యాంక్ బండ్ పై ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలుSajjala Ramakrishna Reddy on Exit Polls | ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిKallakurichi Temple Demolition Viral Video | తమిళనాడులో వివాదాస్పదంగా మారిన గుడి కూల్చివేత దృశ్యాలుBuddha Venkanna Challenge Aara Mastan | ఆరా మస్తాన్ ది ఫేక్ సర్వే అన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Election Results 2024: కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?
కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?
Loksabha Elections 2024: పగటి కలలు కనడం మానుకుంటే మంచిది, కాంగ్రెస్ వాదనను తప్పుపట్టిన రవిశంకర్ ప్రసాద్
పగటి కలలు కనడం మానుకుంటే మంచిది, కాంగ్రెస్ వాదనను తప్పుపట్టిన రవిశంకర్ ప్రసాద్
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Janhvi Kapoor: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
Rafah News: పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
Pushpa 2 Vs Raghu Thatha: 'పుష్ప 2'కు పోటీగా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రఘు తాత'
'పుష్ప 2'కు పోటీగా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రఘు తాత'
Paris Olympics: అమిత్‌ పంగాల్‌కు ఒలింపిక్‌ బెర్తు, క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన బాక్సర్
అమిత్‌ పంగాల్‌కు ఒలింపిక్‌ బెర్తు, క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన బాక్సర్
Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన
Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన
Embed widget