అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today April 9th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఒక్కదెబ్బతో అన్నదమ్ములను కలిపేసిన మీరా.. మళ్లీ ముకుంద ప్రేమలో ఆదర్శ్‌.. అంతేనా!

Krishna Mukunda Murari Serial Today Episode రౌడీలను పిలిపించి మురారి మీదకు పంపి ఆదర్శ్‌ని మీరా మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode  మీరా కృష్ణ దగ్గరకు వచ్చి ఆదర్శ్‌ మారుతాడు అని బాధ పడొద్దు అని చెప్తుంది. మురారి వచ్చి ఎవరు వచ్చారు అని అడుగుతాడు. దానికి కృష్ణ మీరా వచ్చి ఆదర్శ్‌ మారుతాడు అని ధైర్యం చెప్తుందని అంటుంది. దీంతో మురారి వాడు మారడు అంటాడు. 

కృష్ణ: మారుతాడు ఏసీపీ సార్. ఈరోజు లగేజీ లోపల పెట్టాడు రేపు మనల్ని అర్థం చేసుకుంటాడు. 
మురారి: నేను కోరుకున్న మార్పు అదికాదు కృష్ణ. ఒకప్పుడు ఎలా ఉండేవాడు. ఆ చనువు అవన్నీ ఏమయ్యాయి. పెద్దమ్మ ఆపమంటే ఆపే ఆదర్శ్‌ కాదు. నేను వెళ్తుంటే ఎక్కడికి పోతావురా అని ప్రశ్నించే ఆదర్శ్‌ కావాలి.

కృష్ణ: అందరూ ఆ మార్పే కోరుకుంటున్నారు. పెద్దత్తయ్య అంతా చూసుకుంటారు. 

మరోవైపు రేవతి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి భవాని వస్తుంది. మురారి ఆవేశంగా వెళ్లిపోతా అంటే ఆపాల్సింది పోయి నువ్వు కూడా వెళ్లిపోతా అంటావా అని తిడుతుంది. దీంతో భవాని మేం వెళ్లిపోతే అన్నా ఆదర్శ్‌ బాగుంటాడు అని అంటుంది. మురారిని బయటకు వెళ్లమనే హక్కు ఆదర్శ్‌కి లేదు. అని ఆదర్శ్‌ మనస్తత్వం ఇది కాదు అని ఇదంతా ఆదర్శ్‌కి వచ్చిన ఆలోచన కాదు అని ఎవరో ఆదర్శ్‌కి నూరి పోస్తున్నారు భవాని అంటుంది. వాళ్ల మాటలు విన్న మీరా ఇంత ఆలోచిస్తున్నారా అని కంగారు పడి వాళ్లని డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది. ఇక మీరా అటుగా వెళ్తున్న మధుని పిలిచి హోళీ పండగ చేసుకుందాం అంటుంది. ముకుంద చనిపోయి ఎన్ని రోజులు కాలేదు కదా పండగ వద్దు అంటుంది. మీరా సర్ది చెప్తుంది. 

భవాని: నీకు తెలీదు అమ్మ ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో సంవత్సరం వరకు పండగలు చేసుకోకూడదు.
మీరా: మీకు చెప్తే అంత పెద్దదాన్ని కాదు కానీ సంవత్సరం వరకు పండగలు ఎందుకు చేసుకోకూడదు అంటే సంతోషం, బాధ ఒకే చోట ఉండవు అని. కానీ మన పరిస్థితి అది కాదు కదా. ముకుంద పోయిందనే బాధ ఒకటైతే.. ఆదర్శ్, మురారి గొడవ మరో బాధ. ముకుంద చావుని మర్చిపోయి ఆదర్శ్‌, మురారిలను కలపాలి. ఈ పండగ చేస్తే వాళ్లు కలుస్తారు. వాళ్ల మనసులు కదిలించే సందర్భం రావాలి. ఈ పండగ అలాంటి పరిస్థితుల్ని మనం తీసుకురావాలి. మేడం నన్ను నమ్మండి నేను చూసుకుంటాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్.
భవాని: నువ్వు వచ్చాక  ఈ ఇంట్లో చాలా సమస్యలు తీరిపోయాయి. ఇది కూడా తీరిపోతుంది అని నమ్మకంతో ఒకే చెప్తున్నా.. 

ఉదయం ఆదర్శ్‌ వాకింగ్‌ వెళ్తే బయట నుంచి మీరా వస్తుంది. ఆదర్శ్‌ని ఆపాలి అని ఆదర్శ్‌ని ఆపకపోతే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అని హ్యాపీ హోళి అని చేయి అందిస్తుంది.  మీరా చేయి తాకిన ఆదర్శ్ పరిచయం ఉన్న చేయిలా ఫీలవుతాడు. ఇక మీరా ఆదర్శ్‌ని వాకింగ్ వెళ్లొద్దని సరదాగా హోళీ ఆడుదామని చెప్తుంది. ముకుంద అడగటం ఈ ఆదర్శ్‌ కాదు అనడమా సరే అని ఆగిపోతాడు. ఇక మీరా ఆదర్శ్‌ గారు మీరు మురారి, కృష్ణలను బాధ పెడుతున్నారు అని దాని వల్ల మీ అమ్మ బాధపడుతుందని ఈసారి వాళ్లని ఏమైనా అనే ముందు మీ అమ్మని తలచుకోండి అని చెప్తుంది. మురారి తప్పు లేదు అని చెప్పాను అని అయినా మీరు నా మాట నమ్మడం లేదు అని నమ్మితే ఇలా ఉండరు అని అంటుంది. ఆదర్శ్ ఆలోచనలో పడుతుంది.

ఇంతలో మీరా ఏర్పాటు చేసిన ఇద్దరు రౌడీలు వచ్చి మురారిని వాడు వీడు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతారు. దీంతో ఆదర్శ్‌ సీరియస్ అవుతాడు. మురారికి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తాడు. ఇంతలో రౌడీలు ఆదర్శ్‌ కాలర్ పట్టుకుంటే మురారి వచ్చి వాళ్లని పక్కకు నెట్టేస్తాడు. 

మురారిని రౌడీలు కొట్టబోతే ఆదర్శ్ అడ్డుకుంటాడు. కృష్ణ, మురారి షాక్ అయిపోతారు. వాడికి(మురారికి) ఎవరూ లేరు అనుకున్నావా అంటూ రౌడీలను చితక్కొడతాడు. ఆదర్శ్‌కి దెబ్బ తగిలితే మురారి రౌడీలను కొడతాడు. ఇద్దరన్నదమ్ములు చితక్కొడతారు. మధు విజిల్ వేస్తాడు. అందరూ బయటకు వస్తారు. రామలక్ష్మణులు ఒక్కటైపోయారు అని మధు అంటాడు. ఒకర్ని ఒకరు నీకేం కాలేదు కదా అంటే నీకేం కాలేదు అని ప్రశ్నించుకొని హగ్ చేసుకుంటారు. అందరూ సంతోషిస్తారు. మీరా తన ప్లాన్ సక్సెస్ అయిందని తన మురారిని ఇక ఆదర్శ్‌ ఏమీ అనడని అనుకుంటుంది. అందరూ ఆదర్శ్‌ని పొగిడేస్తారు. కృష్ణ ఆదర్శ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆదర్శ్ ఏం మాట్లాడడు. ముకుందతో ముకుంద హోళీ చేసుకుందా అన్నావ్ కదా ఇంకా ఆలస్యం ఎందుకు అని అంటాడు. ఆదర్శ్‌ మీరాని కొత్తగా చూస్తాడు. అందరూ హోళీకి రెడీ అవ్వడానికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న దీపని నిలదీసిన కార్తీక్.. సౌర్య మాటలకు షాక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Embed widget