News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna Mukunda Murari August 14th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: కట్టుబొట్టు మార్చిన తింగరిపిల్ల- భవానీ నిర్ణయంతో కృష్ణ తిరిగి ఇంటికి వస్తుందా?

కృష్ణ, మురారీ పెళ్లి అగ్రిమెంట్ అయిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కృష్ణ నిద్రలేచి మురారీని చూసుకుని మురిసిపోతూనే బాధపడుతుంది. మీ మనసులో నేను లేను ఇక వీడ్కోలు అని ఎమోషనల్ అవుతుంది. నందు మురారీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ వస్తాడు.

నందు: కృష్ణ ఇంటి గడప దాటేలోపు మురారీ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలియాలి. నేను ఈ విషయం చెప్పేటప్పుడు నువ్వు ఆ చుట్టుపక్కలే ఉండాలి ఎందుకంటే మురారీ వాడి ప్రేమ విషయం ఎట్టి పరిస్తితులో చెప్పనివ్వడు. నన్ను అడ్డుకుంటాడు. ఆ టైమ్ లో నువ్వు మురారీని ఏదో ఒకటి చెప్పి పక్కకి తీసుకెళ్లాలి

గౌతమ్: నేను ఏదో ఒకటి చెప్పి పక్కకి తీసుకెళ్తాను. కానీ నిజంగానే కృష్ణకి మురారీ అంటే ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్

నందు: ఎందుకు ఇష్టం లేదని నిలదీస్తాను. ఇష్టం లేకపోతే మెడలో తాళి ఎలా కట్టించుకున్నావ్. అసలు తాళి విలువ నీకు తెలుసా? అని చీవాట్లు పెడతాను. ఒకబ్బాయి అంటే ఇష్టం లేకుండా తాళి ఎలా కట్టించుకుంటారు. ఒకే గదిలో ఎలా కలిసి ఉంటారు. వాడు ప్రేమిస్తున్నాడని తలబాదుకుంటున్నాడు. ఈవిడ ఏమో అభిమానం, ఆరాధన అంటుంది. ఇన్నాళ్ళూ ఇంత బాగా కలిసి పోయి ఇప్పుడు టాటా బైబై చెప్పేసి వెళ్లిపోతుందా? ఇవన్నీ అడుగుతాను. కృష్ణని నిలదీసే హక్కు నాకున్నాయి  

Also Read: శైలేంద్ర ప్లాన్ సక్సెస్- డీబీఎస్టీ కాలేజ్ గురించి తప్పుడు ఆర్టికల్, తల్లడిల్లిపోయిన రిషి

కృష్ణ శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్లిపోకూడదని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భవానీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కృష్ణ క్యాంప్ కి వెళ్ళి తిరిగి వస్తుందో లేదో అర్థం కావడం లేదని మనసులోనే మాట్లాడుకుంటుంది.

భవానీ: కృష్ణ పేదలకు వైద్యం చేసేందుకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. తను మన కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తుంది. అందుకే తనకి ఒక హాస్పిటల్ కట్టిద్దామని అనుకుంటున్నా. పేదలకి ఉచిత వైద్యం అందించాలని కృష్ణ వాళ్ళ అమ్మానాన్నకి మాట ఇచ్చింది కదా అది మనం నెరవేరుద్దాము

రేవతి: మంచి విషయమే కానీ వృత్తిలో పడి కృష్ణ ఇంటికి రావడం మానేస్తుందని భయమేస్తుంది

భవానీ: నీ భయాలతో వాళ్ళని ఉద్యోగాలు కూడా చేసుకొనిచ్చేలా లేవుగా

ఇక గదిలో మురారీ కృష్ణ వెళ్లిపోకుండా ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటాడు. అప్పుడే ఎదురుగా కృష్ణ వచ్చి నిలబడుతుంది. కళ్ళు మూసుకోమని చెప్తుంది. తన కాళ్ళు కడగటానికి కూర్చుంటుంది. అది చూసి ఏంటి ఇదంతా అని అడుగుతాడు. భార్యకి భర్తే దేవుడు అని కాళ్ళు కడిగేందుకు ఒప్పుకోమని చెప్తుంది. దీంతో సరేనని అంటాడు. వీళ్ళని ముకుంద చాటు నుంచి చూస్తుంది. క్యాంప్ నుంచి తిరిగి ఇంటికి రావా అని మురారీ కృష్ణని అడుగుతాడు. సమాధానం చెప్పేలోపు భవానీ వాళ్ళని కిందకి రమ్మని పిలుస్తుంది.

Also Read: మాళవిక హత్య జరిగిన చోట వేదకి దొరికిన కీలక ఆధారం- ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

కృష్ణ చీరకట్టులో కాకుండా డ్రెస్ లో కనిపించేసరికి పెళ్లి కానీ అమ్మాయిలా డ్రెస్ వేసింది. అసలు క్యాంప్ అయిపోయాక తను వస్తుందా రాదా అని రేవతి భయపడుతుంది. కృష్ణ డ్రెస్ లో రావడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇలా ఛేంజ్ అవడం ఏంటి తనకి నచ్చలేదని ప్రసాద్ మురారీతో అంటాడు. తన గెటప్ మారితేనే తీసుకోలేకపోతున్నారు ఇక తను ఎప్పటికీ రాదని తెలిస్తే ఇంకెంత బాధపడతారోనని మురారీ మనసులో ఫీల్అవుతాడు.

భవానీ: ఏయ్ తింగరి పిల్ల కట్టు బొట్టు మార్చేశావ్ ఏంటి సంగతి  

కృష్ణ: క్యాంప్ కి డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది

ముకుంద: నువ్వు డ్రెస్ లో పెళ్లి కానీ అమ్మాయిలాగా ఉన్నావ్

నందు: నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కృష్ణ. కానీ మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉంది అదేంటి అనేది తెలుసుకుని అన్నయ్య నిన్ను నేను కలుపుతానని మనసులో అనుకుంటుంది.

ప్రసాద్: నిన్ను ఇలా చూస్తుంటే ఏదోలా ఉంది. మాకు చీర కట్టుకున్న కృష్ణ నచ్చింది

మీకు మా అగ్రిమెంట్ మ్యారేజ్ అయిపోయిందని చెప్పలేక ఇలా కట్టుబొట్టు మార్చానని బాధపడుతుంది. క్యాంప్ నుంచి వచ్చేసరికి నీకోక సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని భవానీ చెప్తుంది.

Published at : 14 Aug 2023 10:21 AM (IST) Tags: Krishna Mukunda Murari Serial Krishna Mukunda Murari Serial Today Episode Krishna Mukunda Murari Serial Written Update Krishna Mukunda Murari Serial August 14th Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్