అన్వేషించండి

కార్తీకదీపం ఆగస్టు 25 ఎపిసోడ్: మోనితకు ఇక దబిడి దిబిడే, డాక్టర్ బాబు ఎక్కడున్నాడో దీపకు తెలిసిపోయింది!

Karthika Deepam August 25 Episode 1440: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకోసం దీప, మోనిత ఇద్దరూ వెతుకుతుంటారు..ఇదే పెద్ద ట్విస్ట్...

కార్తీకదీపం ఆగస్టు 25 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam August 25 Episode 1440)

బుధవారం ఎపిసోడ్ లో దీప-మోనిత ఇద్దరూ కలుస్తారు. అయితే మోనితని నమ్మకూడదని ఫిక్సైన దీప..మోనితని ఫాలో అవుతూ వెళుతుంది. ఇంటిముందు కారుదిగిన మోనిత కాసేపు ఏడ్చి కళ్లు తుడుచుకుని లోపలకు వెళుతుంది. కచ్చితంగా డాక్టర్ బాబుని దీనిదగ్గరే ఉంచుకుని నాటకాలు ఆడుతోంది..ఏం మాయం చేసిందో, ఏం కుట్రచేసిందో..ఈ రోజు నా చేతుల్లో అయిపోయింది అనుకుంటుంది. ఆటో డ్రైవర్ ని అక్కడే ఉండమని ఇంట్లో అడుగుపెట్టిన దీప అక్కడ కార్తీక్ ఫొటో చూసి ఏడుస్తున్న మోనితని చూసి షాక్ అవుతుంది. 

మోనిత
ఎక్కడున్నావ్, ఎప్పుడొస్తావ్..సంతోషంగా కలసి ఉండాల్సిన మనల్ని ఎందుకు విధి విడదీస్తోంది..నువ్వు లేకుండా నిన్ను చూడకుండా బతకలేను కార్తీక్..ఎక్కడున్నావో కనిపించు అని ఏడుస్తుంటుంది.దీప దగ్గరా లేవు నా దగ్గరా లేవు మరి ఎక్కడున్నావ్..మీ అమ్మావాళ్లు అమెరికా వెళ్లిపోయారు..అయినా నిన్ను తీసుకెళ్లింది నీ భార్య అని చెబుతున్నారంట..అయితే నేను చెప్పాలి లేదంటే దీప చెప్పాలి ఇంకెవరూ నీ భార్య అని చెప్పలేరు కదా కార్తీక్..మరి ఎవరు..  నువ్వు నిజంగా దీపకి కనిపించలేదా..లేదంటేదీప నాటకం ఆడుతోందా అంటుంది. ఆ మాట వినగానే దీప మండిపడితుంది..

దీప
దీనిని అస్సలు నమ్మద్దని ఫిక్సైన దీప ఇల్లంతా వెతుకుతుంది. ఇల్లంతా కార్తీక్ ఫొటోలు, గోడలపై నా కార్తీక్ అని రాసిన రాతలు చూస్తుంది. ఇక తన మనసులో నేను ఇక్కడికి వచ్చినట్లు మోనితకు తెలియదని.. అయినా తను నిజంగా ఏడుస్తుందా , నాటకమా అని అనిపిస్తోంది అనుకుంటుంది. ఇది నిజంగా ఏడ్చినట్లయితే మరి డాక్టర్ బాబు ఎవరి దగ్గర ఉన్నాడని ఆలోచనలో పడి అక్కడ నుంచి వెళ్తుంది.

Also Read: తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు

కార్తీక్, దీప ఫోటోలను చూస్తూ గతంలో శౌర్య తనతో అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ బాధపడుతుంది సౌందర్య.  అప్పుడే ఆనందరావు, హిమ షాపింగ్ పూర్తిచేసుకుని వస్తారు. శౌర్య కోసం ఇవన్నీ తీసుకొచ్చానని చూపిస్తుంది. నువ్వు ఇలా ఏడుపు మొహంతో వెళ్లి పిలిస్తే తనెందుకు వస్తుంది చెప్పు..నవ్వుతూ పిలవాలి అంటుంది. వెళదాం లేమ్మా అంటాడు ఆనందరావు.
సౌందర్య: వెళ్లడం కోసం కాదండీ నా బాధ..వెళ్లిన తర్వాత హిమను చూసి శౌర్య ఎలా రియాక్టవుతుందో తలుచుకుంటే భయం వేస్తోంది. మనపై ఎవరికైనా కోపం ఉన్నప్పుడు ఆ కోపం తగ్గేవరకూ కంటపడకుండా ఉండడం మంచిది..లేదంటే ఆ కోపం ద్వేషంగా మారుతుంది..ఇప్పుడు వాళ్ల మధ్య ఉన్న ఈ దూరం శాశ్వతంగా మిగిలిపోతుందన్న భయంతో చెబుతున్నాను.. అందుకే ఇంత ఆలోచిస్తున్నాను. లేదంటే వీళ్లిద్దర్నీ దూరంగా ఉంచడం నాకు సరదానా..
హిమ: పైకి వెళుతూ సౌందర్య మాటలన్నీ విన్న హిమ..అదే నీ భయం అయితే..నేను శౌర్య దగ్గరకు రాను నానమ్మా, మీరే వెళ్లి పిలవండి..కానీ శౌర్యని చూడకుండా నేను ఉండలేను నానమ్మా..
ఆనందరావు: ఓ మనిషి మనల్ని ద్వేషిస్తున్నా తనకోసమే తపిస్తున్నావంటే నీ మనసులో ఏంతో ప్రేమ ఉంది..ఆ ప్రేమే మీ ఇద్దర్నీ కలుపుతుంది..

Also Read: మోనితని ఫాలో అవుతూ వెళ్లిన దీపకు పెద్ద షాక్, కార్తీక్ అక్కడే ఉన్నాడా!

దీప కార్తీక్ కోసం వెతుకుతుండగా కార్తీక్ అప్పుడే కారులో నుంచి దీపని చూస్తాడు. తను మొన్న కలిసిందని..ఏదో మాట్లాడిందని.. తనకు నేను తెలుసేమో నా మతిమరుపు వల్ల నాకేం గుర్తుకు రావటం లేదేమో అని అనుకుంటూ దీప దగ్గరకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. అడ్డుపడిన శివ..ఇప్పుడు ఈయన ఆవిడను కలిస్తే మేడం నన్ను చంపేస్తుందని భయపడి ఆపుతాడు.అయినా పట్టుబట్టి కార్తీక్ వెళతాడు కానీ అప్పటికే దీప ఆటో ఎక్కేస్తుంది.  హమ్మయ్య వెళ్లిపోయింది లేదంటే మేడం చేతిలో నాపనైపోయేది అనుకుంటాడు శివ..
ఇంటికెళ్లిన దీప..డాక్టర్ వాళ్ల అమ్మతో జరిగినదంతా చెబుతుంది. అది ఏం చేసినా నీ మొగుడుని నీ నుంచి తీసుకోలేదని ధైర్యం చెబుతుంది ఆమె. 

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
శివ కాలర్ పట్టుకున్న దీప..నా డాక్టర్ బాబు ఎక్కడున్నారని నిలదీస్తుంది. పోలీసులకు అప్పగిస్తానని బెదిరించడంతో మోనిత దగ్గరున్న విషయం బయటపెడతాడు డ్రైవర్ శివ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget