మేషం సింహం, తులా రాశివారు మీకు సరిగ్గా సరిపోతారు. మీ ఎనర్జీకి తగ్గట్టుగా ఉంటారు .
వృషభం మీది చాలా పవర్ ఫుల్ పర్సనాలిటీ.. వృశ్చికం, మకర రాశులవారు మీకు సరిజోడి.
మిథునం మిథున రాశివారు చాలా రొమాంటిక్..ధనస్సు, కుంభ రాశులవారు మీకు పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు
కర్కాటకం వృషభం, మకర రాశివారు మీకు సరైన జోడీ. ఎందుకంటే ప్రేమ బంధానికి మీరిచ్చే విలువ, మీ ఆలోచనలను ఈ రెండు రాశులవారు సరిగ్గా అర్థం చేసుకుంటారు.
సింహం మీ ఎనర్జీకి, మీ ఆలోచనలకు సరిగ్గా సరిపోయే రాశులు మిథునం, సింహం, కుంభం.
కన్య కర్కాటకం, మీన రాశులవారు మీ మనసెరిగి ప్రవర్తిస్తారు. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో వీరికి తెలుసు.
తుల మీ మనసు తెలుసుకుని మీ ఆలోనచలకు అనుగుణంగా మసలుకోవడంలో మేషం, ధనస్సు రాశివారు టాప్ లో ఉంటారు. వీరు మీకున్న స్ట్రెస్ నుంచి మంచి రిలీఫ్ అవుతారు..
వృశ్చికం ఈ రాశివారు నచ్చినవాటికోసం ఎంతదూరమైనా వెళ్లే టైప్. వీళ్లని భరించే శక్తి వృషభం, కర్కాటక రాశివారికి మాత్రమే ఉంటుంది.
ధనస్సు మేషం, మిథున రాశివారు మీకు సరిగ్గా సరిపోయే పార్టనర్స్. వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఈ రెండు రాశులవారిని పార్టనర్స్ గా ఎంపిక చేసుకుంటే అంతా ఆనందమయం.
మకరం మీ ప్రవర్తన, వ్యక్తిత్వానికి వృషభం, కర్కాటక రాశులవారు సరిగ్గా సరిపోతారు.
కుంభం సింహం, ధనస్సు, కుంభ రాశివారు మీకు సరైన జోడీ. క్రియేటివిటినీ ఇష్టపడే మీ ఆలోచనలకు ఈ రాశుల వారు మరింత పదునుపెట్టడంలో సక్సెస్ అవుతారు.
మీనం మీన రాశివారి ఆలోచనలకు సరిపడా పార్టనర్స్ ఎవరంటే వృషభం, కన్యారాశివారు. మీ మనసెరిగి ప్రవర్తించడంలో వీరు సక్సెస్ అవుతారు..