జ్ఞానం,ఆత్మవిశ్వాసం, మేధస్సు, తార్కికానికి ప్రతీక అయిన బుధగ్రహం ఆగస్టు 21 ఆదివారం అర్థరాత్రి కన్యారాశిలోకి ప్రవేశించింది. ఈ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉందో చూద్దాం...
మేషం ఈ సమయంలో ఓవర్ గా ఆలోచించడం మానుకోవాలి..లేకుంటే మానసిక సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో వివాదం వచ్చే అవకాశం ఉంది. కన్యారాశిలో బుధుడు సంచరించే నెలరోజులూ ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ఆస్తి కలిసొస్తుంది.
మిథునం కన్యారాశిలో బుధగ్రహ సంచారం మీ కుటంబ జీవితాన్ని సుఖంగా ఉండేలా చేస్తుంది. కార్యాలయంలో మీపై అటెన్షన్ ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం మీకు స్నేహితులు, సోదరలు నుంచి సహకారం అందుతుంది. జర్నలిజం, రచన, కన్సల్టింగ్, నటన, దర్శకత్వం లేదా యాంకరింగ్ వంటి రంగాల్లో ఉండేవారికి శుభసమయం. మాటతీరు మార్చుకోకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
సింహం కన్యారాశిలో బుధుడి సంచారం సింహరాశివారిని వారి వారి రంగాల్లో రాజుగా నిలబెడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు బాగా సక్సెస్ అవుతారు. సంపద పెరుగుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది.
కన్య బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో సంచరిస్తున్నందున ఈ రాశివారికి కూడా అంతా శుభసమయమే. వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి..చేసే వ్యాపారంలో భారీ లాభాలొస్తాయి.
తుల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విశ్వసనీయ వ్యక్తులను మీతో ఉంచుకోవడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే హానితప్పదు. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం బుధుడు పదకొండవఇంట సంచరిస్తున్నందున మీకు అద్భుతంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. జీవితభాగస్వామితో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు బుధుడి సంచారం ధనస్సు రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో సక్సెస్ అందిస్తుంది . ఉన్నత ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా మంచి లాభాలు పొందుతారు.
మకరం తొమ్మిదో స్థానంలో బధుడి సంచారం మీకు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు వ్యాపారంలో సక్సెస్ అవుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు..
కుంభం మీ రాశి నుంచి 8వ పాదంలో సంచరిస్తున్నాడు బుధుడు. అందుకే మీ ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. చర్మ సమస్యలు ఉండొచ్చు . అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా ధ్యానంపై శ్రద్ధ పెట్టాలి.
మీనం కన్యా రాశిలో బుధుడి ఆగమనం మీకు ఫలవంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఎక్కువగా వాదించే లక్షణాన్ని మార్చుకుంటే మంచిది. మీ భాగస్వామిపై అనుమానం ఉంటుంది.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు