ఆగస్టు 23 రాశిఫలాలు



మేషం
ఖాళీగా కూర్చోకండి, ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో గొడవలు రావచ్చు...భావోద్వేగానికి లోనై ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. రాబోయే కాలంలో ఆర్థిక లాభాలుంటాయి



వృషభం
ఈ రోజు ఉద్యోగులకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. జీవిత భాగస్వామి మనసు తెలుసుకుని మసలుకోవడం మంచిది.



మిథునం
కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి.



కర్కాటకం
ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. కెరీర్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాస్త శ్రమగా అనిపించినా అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తిచేస్తారు.



సింహం
ఈ రోజు ఏదైనా విషయం డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పని వైపు మనసు ఆకర్షితమవుతుంది. కెరీర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.



కన్య
ఈరోజు పెట్టిన పెట్టుబడిని భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోగలుగుతారు. కార్యాలయంలో మీ పురోగతిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఓపికగా వ్యవహరించాలి.



తుల
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.



వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు.కుటుంబంతో సరదాగా గడుపుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతను తీసుకుంటారు. మీకు అప్పగించిన పనిని నెరవేరుస్తారు.



ధనుస్సు
ఈ రోజు మీకు ఉపయోగపడే అనుభవజ్ఞులను కలవండి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం.



మకరం
ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. మీడియా , విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం పొందుతారు. ఉద్యోగస్థుల పరిస్థితి కార్యాలయంలో మెరుగ్గా ఉంటుంది.



కుంభం
కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.



మీనం
ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఇంటికి అతిథులు రాక మీకు మంచి అనుభూతినిస్తుంది. ఈరోజు లావాదేవీలు చేయడం వల్ల నష్టపోతారు.