ఎప్పుడూ గంభీరంగా, కోపంగా కనిపిస్తూ..చెడుమాటలు, కఠినమైన మాటలు మాట్లాడేవారు ఎప్పటికీ డబ్బును ఆదాచేయలేరట. వారి జీవితమంతా డబ్బు చేతిలో నిలవదు.
సమయం సందర్భాన్ని కోపం ప్రదర్శించవద్దని కాదు కానీ.. అనవసర విషయాల్లోనూ కోపం ప్రదర్శించకూడదన్నది చాణక్య నీతి
ఆకలేసినదానికన్నా ఎక్కువ తిన్నవారి చేతిలోనూ డబ్బు నిలవదు. అతిగా తినడం కోసం ఖర్చుచేసేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలుండదు. బతకడం కోసం ఆకలి వేసినప్పుడు తినాలన్నది చాణక్యుడి ఉద్దేశం
చట్టవిరుద్ధంగా సంపాదించే వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. ఈ వ్యక్తిచేతిలోంచి డబ్బు ఏదో విధంగా బయటకు వెళ్లిపోతుంది.
కుటుంబంలో లేదా ఇంటికి వచ్చిన అతిథులను అగౌరవపరిచే వ్యక్తులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదంటాడు చాణక్యుడు. వారు కూడా డబ్బు, గౌరవం లేకుండానే జీవించాల్సి వస్తుంది.
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు.
ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, న్యాయశాస్త్రం..ఇలా ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపాడు చాణక్యుడు.